Allari Naresh’s Next A Concept Based Film With Vijay Kanakamedala
Allari Naresh’s Next A Concept Based Film With Vijay Kanakamedala
Hero Allari Naresh is one among the highly successful heroes of Telugu cinema. Besides doing lead roles, he is also starring in special roles in other hero films. The talented actor strike a chord with his performance in his last film Maharshi and he will next be seen in an out and out entertainer Bangaru Bullodu which is nearing completion.
Known for his hilarious expressions and flawless comedy-timing, Allari Naresh who waited for long time for a good subject has finally signed his next. Billed to be a concept based movie, Allari Naresh’s next film will be with debut director Vijay Kanakamedala who worked as co-director with star director Harish Shankar.
Satish Vegesna, who was the co-producer for films like Okka Kshnanam and Mosagallaku Mosaadadu, will produce this film as Production No 1 on his own banner SV2 Entertainment.
More details of the film will be announced soon.
హీరో అల్లరి నరేష్ కథానాయకుడిగా ఓ కాన్సెప్ట్ బేస్డ్ మూవీ ప్రారంభం కానుంది. నరేష్ ఒక వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు వైవిధ్యమైన పాత్రల్లోనూ నటిస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారు. ఇటీవల విడుదలై ఘనవిజయం సాధించిన `మహర్షి` చిత్రంలో నరేశ్ ఓ కీలక పాత్రలో నటించి అందరి ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. అలాగే మరో వైపు తనదైన మార్క్ కామెడీ మూవీ `బంగారు బుల్లోడు` సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.
నరేశ్ నటించబోయే కాన్సెప్ట్ బేస్డ్ మూవీకి డైరెక్టర్ హరీశ్ శంకర్ దగ్గర కో డైరెక్టర్‌గా పనిచేసి విజయ్ కనకమేడల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. `మోసగాళ్లకు మోసగాడు`, `ఒక్క క్షణం` చిత్రాలకు కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన సతీశ్ వేగేశ్న నిర్మాతగా మారి ఎస్వీ2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఈ చిత్రాన్నినిర్మించబోతున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను ప్రకటిస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది.