Amazing Car rangoli is attracting @Sirisilla

రెండు ఎకరాల్లో కారు గుర్తు ముగ్గు
-వినూత్న ముగ్గుకు వేదికైన సిరిసిల్ల
-అభిమానం చాటుకున్న 200మంది టిఆర్ఎస్ మహిళా విభాగం కార్యకర్తలు
-పట్టణ వాసులను ఆకర్షిస్తున్న కార్ గుర్తు ముగ్గు
-తండోపతండాలుగా వీక్షిస్తున్న వైనం
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రమైన సిరిసిల్ల పట్టణంలోని బైపాస్ రోడ్ లో రెండెకరాల స్థలంలో సుమారు 200 మంది మహిళ టిఆర్ఎస్ కార్యకర్తలు సంక్రాంతి పురస్కరించుకొని మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కారు గుర్తు ముగ్గును వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కారు గుర్తు ముగ్గును వీక్షించడానికి పట్టణవాసులు తండోపతండాలుగా వచ్చి వీక్షించారు. కేవలం మూడు గంటల్లోనే ఈ ముగ్గును సిద్ధం చేసి అబ్బుర పరిచారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసనసభ్యుడు, మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు నియోజకవర్గంలో ఈ ముగ్గును వేసి మహిళా కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఈమేరకు మహిళా కార్యకర్తలను మంత్రి కేటీఆర్ తో పాటు స్థానిక టిఆర్ఎస్ నేతలు ప్రజా ప్రతినిధులు అభినందించారు. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో భారీ కారు గుర్తు ముగ్గు వేయడం విపరీతంగా ఆకర్షిస్తోంది.