Ammayi Releasing Worldwide In 47,000 Screens
Ammayi Releasing Worldwide In 47,000 Screens Is A Proud Moment For Telugites: Vijayendra Prasad
India’s first martial arts film ‘Ladki’ (Ammayi in Telugu) starring Pooja Bhalekar under the direction of sensational director Ram Gopal Varma and produced prestigiously by T Anjaiah, Shreshta Patel Movies, Indo-Chinese Co-Productions, Parijatha Creations and Artsy Media, will be releasing in a grand manner worldwide on 15th of this month in 47,000 screens. The film has become a hot topic in the industry, ahead of its release. The film’s pre-release event was celebrated grandly at JRC Convention Centre in Hyderabad in presence of senior music director Keeravani, popular director and writer Vijayendra Prasad, Macha Ravi, Kona Venkat, Tummalapalli Rama Satyanarayana etc.
Writer Vijayendra Prasad, who attended the event as the chief guest said, “Ramu reached many heights with Shiva. He was an inspiration for many technicians. I felt happy, after seeing trailer of “Ammayi”. I proudly say that Ramu is back. Also, the release of this movie in 47000 screens worldwide is a fantastic thing. It’s indeed a proud moment for Telugites.”
MM Keeravani said, “There is no believability in a hero beating 10 people. But those who have learned martial arts can easily beat ten people. So, believability is a fact in this movie. When you see the trailer of this movie, there is emotion in it. Emotion is also essential for success. The entire team worked very dedicatedly for this movie. Hope, this should become a big hit.”
Director Ram Gopal Varma said, “There’s emotional connect for me with this movie. I adore Bruce Lee a lot. I like Bruce Lee’s attitude and philosophy. I’ve watched “Enter The Dragon” 27 times in theatre. I did a research to find out why we are unable to forget the fights of Bruce Lee, even after 40 years, and made this movie. Bruce Lee with his martial arts made audience believe that he can hit 10 people who are double to his size. I feel it’s an achievement to make this as a female centric with Pooja Bhalekar playing the lead role and shooting the movie in Bruce Lee’s country i.e. China. For the first time, international trailer of Ladki was launched on Burj Khalifa and it got overwhelming response.”
Actress Pooja said, “This is my dream project. I’m interested in learning martial arts since childhood. This film made on martial arts will remain to be a wonderful journey for me. However, I am very happy that this film is being made as a tribute to Bruce Lee.”
Kona Venkat said, “I came here to wish my mentor RGV on Guru Purnima. It’s a dream project for Ram who has been working on it for 10 years. So, it’s an emotional one for him. I haven’t seen Ramu becoming this emotional. Pooja is amazing in the movie.”
ఒక తెలుగు సినిమా ప్రపంచ వ్యాప్తంగా 47000 స్క్రీన్ లలో రిలీజ్ అవ్వడం తెలుగు వారందరికీ గర్వ కారణం. దీన్నెవరూ ఆచ్చీవ్ చేయలేరు.. *ప్రముఖ దర్శక,రచయిత విజయేంద్ర ప్రసాద్*
టి. అంజయ్య, శ్రేష్ఠ పటేల్ మూవీస్ సమర్పణలో ఇండో, చైనీస్ కో ప్రొడక్షన్స్, పారిజాత క్రియేషన్స్, ఆర్ట్సీ మీడియా పతాకాలపై పూజా భలేకర్ ప్రధాన పాత్రలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఇండియాస్ ఫస్ట్ మార్షల్ ఆర్ట్స్ ఫిలిం ‘లడ్కీ’ (తెలుగులో ‘అమ్మాయి‘). ఈ నెల 15 న ప్రపంచ వ్యాప్తంగా 47,000 స్క్రీన్ లలో విడుదల ఆవుతున్న సందర్బంగా ఇప్పుడు ఈ చిత్రం ఇండస్ట్రీ లో హాట్ టాపిక్‌గా మారింది .తెలుగులో మొట్ట మొదటిసారిగా మార్షల్ ఆర్ట్స్ పై గ్రాండ్ గా విడుదల అవుతున్న కారణంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని జె. ఆర్. సి కన్వెన్షన్ సెంటర్ లో ప్రి రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి,ప్రముఖ దర్శక,రచయిత విజయేంద్ర ప్రసాద్, మచ్చ రవి, కోన వెంకట్, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ తదితరులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. అనంతరం
*ముఖ్య అతిధులుగా వచ్చిన రచయిత విజయేంద్ర ప్రసాద్, మాట్లాడుతూ..* 10 నెలల క్రితం నేను “కనబడుటలేదు” ఆడియో ఫంక్షన్ కు వెళ్లడం జరిగింది.అక్కడ రామ్ గోపాల్ వర్మ కూడా ఉన్నారు.15 సంవత్సరాలుగా నాలో గూడు కట్టుకున్న కోపం, చిరాకు, అసహ్యం, బాధ అన్ని కలగలపి నాకు అనుకోకుండా కొన్ని మాటలు వచ్చాయి. శివ సినిమా చూశాను ఆ సినిమాతో రాము ఎక్కడికో వెళ్ళిపోయాడు. నేనే కాదు నాలాంటి డైరెక్టర్లు, రచయితలు, టెక్నిషియన్స్ ఇలా ఎందరో ఆయన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకోవడం జరిగింది. ఆ తరువాత ఆ రాంగోపాల్ వర్మ కనిపించడం మానేశారు.మీకేమైనా కనిపిస్తే మళ్ళీ అలాంటి సినిమా తీయమని చెప్పండి అనేశాను. ఇప్పుడు “అమ్మాయి”సినిమా ట్రైలర్ చూసిన తరువాత చాలా గర్వంగా చెపుతున్నాను ఇప్పుడు నాకు ఆ రాము కనిపించారు. అలాగే ఈ సినిమా 47000 స్క్రీన్ లలో రిలీజ్ అవ్వడమనేది ఫెంటాస్టిక్ థింగ్. దీన్ని ఎవరూ ఆచ్చీవ్ చేయలేరు. ఎందుకంటే అవతార్ లాంటి సినిమాలే 20,000 థియేటర్స్ లలో రిలీజ్ అయితే ఈ సినిమా 47,000 స్క్రీన్ లలో రిలీజ్ అవ్వడం తెలుగు వారందరికీ గర్వ కారణం.ఇలాంటి మంచి సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు.
*సంగీత దర్శకుడు కీరవాణి మాట్లాడుతూ..* రాము గారు తను తీసిన సినిమాలు హిట్స్ అన్నీ యాక్సిడెంట్స్ అని , ఫ్లాప్స్ అన్నీ ఇంటెన్షనల్ అని చెప్పినప్పుడు మీరు నమ్మితే మీ అంత పెద్ద ఫూల్ ఎవరూ ఉండరు.అయితే అయన హిట్స్ ఇంటెన్షనలే ఫ్లాప్స్ ఇంటెన్షనలే అనేది చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఆ కొద్ది మందిలో నేను ఉన్నందుకు గర్వ పడుతున్నాను. ఒక సినిమాలో హీరో 10మందిని కొట్టడం అనేది అసాధ్యం అయినా ఫ్యాన్స్ నమ్మాలని డైరెక్టర్ అనుకుంటాడు. అందులో బిలీవబిలిటి ఉండదు . కానీ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న వారు పదిమందిని కొట్టారు అంటే దానిని బిలీవ్ చేయవచ్చు.అయితే బిలీవబిలిటి అనేది ఈ సినిమాలో ఒక ఫ్యాక్ట్.ఈ సినిమా ట్రైలర్ చూసినపుడు ఇందులో ఎమోషన్ ఉంది. ఎమోషన్ కూడా సక్సెస్ కు చాలా అవసరం.ఈ సినిమా కొరకు టీం అంతా ఎంతో డెడికేటెడ్ గా వర్క్ చేశారు. ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు.
*చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ..* ఇది నేను ఎమోషనల్ అయ్యి తీసిన సినిమా. ఎందుకంటే నా లైఫ్ లైన్ లో వెనక్కి తిరిగి చూసుకుంటే కొన్ని సంఘటనలు జరిగినప్పుడు వ్యక్తులు గుర్తుండిపోతారు. అలాంటి వారే బ్రూస్లీ. నాకు బ్రూస్లీ అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టమంటే నా చిన్నప్పుడు నేను నారాయణ గుడాలోని శ్రీనివాస్ థియేటర్ కు పంజాగుట్ట నుండి సైకిల్ పై 27 సార్లు వెళ్లి “ఎంటర్ ద డ్రాగన్ ” సినిమా చూడడం జరిగింది. అలాగే నాకు బ్రూస్ లీ యాటిట్యూడ్, తన ఫిలాసఫీ నా మీద చాలా ఇంపాక్ట్ చూపించాయి.40 సంవత్సరాలైనా మనం బ్రూస్లీ ఫైట్స్ ఎందుకు మరచిపోలేక పోతున్నాము అని స్టడీ చేసి ఈ సినిమా తీశాను. నేను చేసిన శివ సినిమాలో కూడా బ్రూస్లీ సినిమా “రిటర్న్ అఫ్ ద డ్రాగన్” లోని రెస్టారెంట్ లో అమ్మాయిని రక్షించే ఫైట్ సీన్ ను కాలేజ్ లో ఫైట్ సీన్ గా పెట్టి శివ సినిమా తీశాను. కానీ శివ మార్షల్ ఆర్ట్స్ సినిమా కాదు. కానీ బ్రూస్లీ యాటిట్యూడ్స్ సినిమాలో చాలా ఉంటాయి. తరువాత నేను చేసిన చాలా సినిమాల్లో ఫైట్ సీన్స్ డిజైన్ చేసి వాడడం జరిగింది. ఇండియా లో మార్షల్ ఆర్ట్స్ లేదు. కానీ జాకీ చాన్, జెట్లీ, టోనీజా సినిమాలు వచ్చినప్పుడు చాలా ఎగ్జయిట్ గా ఫీల్ అయ్యేవాన్ని. మార్షల్ ఆర్ట్స్ లో బ్రూస్లీ తనకంటే డబల్ సైజ్ ఉన్న పదిమందిని కొట్ట గలుగుతాడు అని తన సినిమాలతో ప్రేక్షకులను బిలీవ్ చేయించాడు “ఎంటర్ ద డ్రాగన్” సినిమాతో. అయితే నేను ఆ థాట్ ను ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లి అమ్మాయితో మార్షల్ ఆర్ట్స్ తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచతో పూజా భలేకర్ ని సెలెక్ట్ చేసుకొని నేను ఇష్టపడే బ్రూస్లీ కంట్రీ అయిన చైనాలో “లడ్కీ” ని షూట్ చేయడం, నాకది గొప్ప ఆచీవ్‌మెంట్ గా భావిస్తాను. నా లైఫ్ లో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ సినిమాలు మూడు. అవి గాడ్ ఫాదర్ (సర్కార్) ,సౌండ్ ఆఫ్ మ్యూజిక్ “రంగీలా”, ఇప్పుడు తీసిన “అమ్మాయి”.
నేను తీసిన సినిమాలలో ఫ్లాప్ కు నేను ఒక్కడినే కారణం. కానీ హిట్ కు మాత్రం చాలా మంది కారణం. క్షణం క్షణం బాగా వచ్చింది అంటే శ్రీదేవి పెర్ఫార్మన్స్,కీరవాణి మ్యూజిక్ కారణం. ఆలా ఈ సినిమా బాగా రావడానికి కారణం పూజ.ఈ సినిమా కొరకు పూజ చాలా కష్టపడింది. నన్ను క్వశ్చన్ చేయకుండా ట్రస్ట్ చేయడం గ్రేట్..తను లేకపోతె ఈ సినిమానే లేదు. అలాగే అంజయ్య గారు బాగా సపోర్ట్ చేశారు. సినిమాటోగ్రాఫర్ అయితేనేం ఇలా టెక్నిషియన్స్ అందరూ ఎంతో డెడికేటెడ్ గా ఫైటింగ్ సీన్స్ బాగా వచ్చేవరకు చాలా హార్డ్ వర్క్ చేస్తూ నన్ను నమ్మి ఇన్ని రోజులు నాతో ట్రావెల్ అయ్యారు. వారందరికీ ధన్యవాదములు.మొట్ట మొదటి సారి బూర్జ్ కళీఫా మీద ఇంటర్నేషనల్ “లడ్కి” ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది అన్నారు.ఈ నెల 15 న ప్రేక్షకుల ముందుకు మార్షల్ ఆర్ట్స్ పైన తీసిన ఈ సినిమా 40,000 థియేటర్స్ లలో రిలీజ్ అవుతున్నందుకు చాలా సంతోషం గా వుంది. అన్నారు.
*చిత్ర సమర్పకులు టి. అంజయ్య మాట్లాడుతూ..* దాసరి గారి తరువాత సినీ ఇండస్ట్రీని గుర్తించి మా విజయేంద్ర ప్రసాద్ గారికి రాజ్య సభ ఇచ్చిన మోడీ గారికి ధన్యవాదాలు. అలాగే కీరవాణి పాటలు అంటే ఎంతో ఇష్టం. ఇలా వీరిద్దరూ మా ఫంక్షన్ కు రావడం చాలా సంతోషంగా ఉంది. ఆర్. జీ. వి గారితో నాకు ఐదు సంవత్సరాల అనుబంధం ఉంది.ఆయనతో నేను “అమ్మరాజ్యం లో కడప బిడ్డలు”, “బ్యూటిఫుల్”, ఇప్పుడు వస్తున్న “అమ్మాయి” ఇలా తనతో మూడు సినిమాలు చేశాను.ఈ ఐదు సంవత్సరాల జర్నీ లో నేను ఆర్. జీ. వి గారిని గమనించింది ఏంటంటే అయన ఊపిరి సినిమా, ప్రాణం సినిమా, ఆలోచన సినిమా ఇలా ఎప్పుడూ సినిమా సినిమా ఆలోచనతోనే ఉంటాడు. ఇప్పటి వరకు తను తీసిన సినిమాలు ఒక ఎత్తయితే ఈ సినిమా ఒక ఎత్తని కచ్చితంగా చెప్పగలను.ఈ సినిమా “శివ” కంటే పెద్ద హిట్ అవుతుంది.ఈ సినిమా తరువాత తను మళ్ళీ కమ్ బ్యాక్ అయ్యి ఎక్కడికో వెళ్ళిపోతారు. ఆర్.జీ.వి గారెప్పుడూ సక్సెస్ కు పొంగిపోరు, ఫెయిల్యూర్ కు జంకరు, విమర్శలకు ఎట్టి పరిస్థితుల్లోను జడవరు. కాబట్టి ఈ సినిమా తర్వాత “లడ్కీ 2” తీయండి మీకు సపోర్ట్ గా మేము ఉంటాము. అలాగే ఇందులో పూజ గత పది సంవత్సరాలుగా వేరే సినిమా చెయ్యకుండా ఎంతో డెడికేటెడ్ గా చాలా హార్డ్ వర్క్ చేసింది. తను చేసిన ఫైట్స్ అద్భుతంగా వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 15 న 47,000 స్క్రీన్ లలో విడుదల అవుతున్న పాన్ వరల్డ్ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు
*మరో నిర్మాత మధు మంతెన మాట్లాడుతూ..* పూజ చాలా హార్డ్ వర్క్ చేసింది. రాము గారు చాలా హార్డ్ వర్క్ చేసి ఈ సినిమా తీశారు.పూజ ఫైట్స్ చూస్తుంటే గూజ్ బమ్స్ వస్తున్నాయి.ఈ నెల 15 న వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు.
*హీరోయిన్ పూజ మాట్లాడుతూ..* ఇది నా డ్రీమ్ ప్రాజెక్టు. నేను చిన్నతనం నుంచే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం మెదలు పెట్టాను. అదే మార్షల్ ఆర్ట్స్ పై చేసిన ఈ సినిమా నాకు వండర్ ఫుల్ జర్నీ గా నిలుస్తుంది.అయితే బ్రూస్లీకి నివాళిగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ఇండో చైనా బాషలలో 47,000 స్క్రీన్ లలో విడుదల అవ్వడం గొప్ప విశేషం. ఈ సినిమా కొరకు నేను చాలా కష్టపడ్డాను .ఈ రోజు నాకు ఈ సినిమాతో మంచి పేరు వచ్చింది.ఈ క్రెడిట్ అంతా ఆర్. జీ. వి గారికే చెందుతుంది అన్నారు
*రవి మాట్లాడుతూ..* రాము గారు చాలా సీరియస్ గా తీసుకొని తీసిన సినిమా “అమ్మాయి”. అయన 2013 నుండి అలుపెరగకుండా చేస్తున్న ఈ సినిమా తన కళ . ఈ సినిమా కొరకు పూజ ను వెతికి సెలెక్ట్ చేసి ఇన్ని కళలు నేర్పించడమనేది చాలా కష్టమైన పని. ఈ సినిమా కొరకు పూజ 10 సంవత్సరాల నుండి ఫిట్ నెస్ మెంటైన్ చేయడం అనేది చాలా కష్టం.వీరిద్దరూ ఇంత కాలం జర్నీ చేసి మార్షల్ ఆర్ట్స్ కథాంశం పై తీసిన “అమ్మాయి” ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 15 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా “ఎంటర్ ద డ్రాగన్” అంతటి పెద్ద హిట్ అవ్వాలి అన్నారు
*కోన వెంకట్ మాట్లాడుతూ..* గురుపౌర్ణమి రోజున మా గురువు రాము గారికి శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చాను. 10 సంవత్సరాల నుండి చేస్తున్న ఈ సినిమా రాము గారికి ఇదొక డ్రీమ్ ప్రాజెక్ట్. కాబట్టి రాము గారికి ఇదొక ఎమోషనల్ మూవీ.ఇప్పటి వరకు రాము గారు ఇంత ఎమోషనల్ అవ్వడం నేను చూడలేదు.నాకు తెలిసి ఈ సినిమా బ్రూస్లీ కు ట్రి బ్యూట్ అనుకుంటాను.పూజ ఇందులో అద్భుతంగా నటించింది.ఒక ఇండియన్ అమ్మాయి చేసిన మార్షల్ ఆర్ట్స్ సినిమా 47,000 స్క్రీన్ లలో ఇండో చైనీస్ బాషలలో విడుదల అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. జులై 15 న వస్తున్న ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి అన్నారు
*నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ మాట్లాడుతూ..* ఈ సినిమాతో మా బాస్ ఈజ్ బ్యాక్ బిగ్ బ్యాక్. ఇండస్ట్రీ లో ఒక ఊపు ఊపుతాడని సంగర్వంగా చెపుతున్నాను .ఎందుకంటే రాము గారు శివ తీసినప్పుడు దాసరి గారు, బి. గోపాల్ గారు, కోడి రామకృష్ణ గారు,రాఘవేంద్ర రావు గారు,యస్. వి. కృష్ణా రెడ్డి ఇలా అందరు డైరెక్టర్ లు మంచి హవా చూయించారు.అలాంటి వారు ఇప్పడు రెస్ట్ తీసుకొని మంచి మంచి సీరియల్స్, సినిమాలు చూస్తున్నారు.కానీ మా బాస్ అప్పటి నుండి ఇప్పటివరకు యంగ్ టైగర్ లాగ సినిమాలు తీస్తూనే ఉన్నాడు.ఆయనకు హిట్ తో ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు తీస్తూనే ఉన్నాడు.తను ఎంతో కష్టపడి ఇష్టం తో చేసిన సినిమా “అమ్మాయి”. “బాహుబలి” ని ఎన్ని రోజులు తీశారో ఈ సినిమాను అన్ని రోజులు తీశారు.బాహుబలి ఎన్ని రోజులు ఆడుతుందో ఈ సినిమా అన్ని రోజులు ఆడుతుంది. “బాహుబలి” , “ఆర్.ఆర్.ఆర్” పాన్ ఇండియా సినిమాలు అయితే తెలుగులో మొట్ట మొదటి సారిగా ఇండో చైనీస్ బాషలలో విడుదల అవుతున్న ఈ సినిమా తొలి పాన్ వరల్డ్ సినిమా. ఆ సినిమాలు హిట్ అయిన తరువాత చైనా లో రిలీజ్ చేస్తే ఈ సినిమా హిట్టో, ఫ్లాపో అనేది తెలియకుండానే చైనాలో 40,000 స్క్రీన్ లలో భారీగా రిలీజ్ చేయడం తెలుగు ఇండస్ట్రీ లోనే ఇది మొదటి సినిమా.తన లైఫ్ లో ఇన్ని రోజులు తీసిన సినిమా లేదు.ఈ సినిమాకు తను ప్రాణం , మనసు , డబ్బు, తన ఎనర్జీ అంతా పెట్టి ఎంతో దమ్మున్న తెలుగు డైరెక్టర్ తీసిన ఈ “అమ్మాయి” సినిమా ఈ నెల 15 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.ఇది గొప్ప విజయం సాదిస్తుందనే నమ్మకం ఉందని అన్నారు.
*నట్టి కుమార్ మాట్లాడుతూ..* ఈ సినిమా చేస్తున్నప్పుడు చైనా వారు వచ్చి అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది.ఆ తరువాత చైనా లో షూటింగ్ చేయడం జరిగింది.రాము తీసిన ఈ సినిమా “శివ” కంటే పెద్ద విజయం సాదించాలి అన్నారు
ఇంకా ఈ కార్యక్రమం లో పాల్గొన్న వారందరూ ఈ నెల 15 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు.