Anoop roobens interview Photos
నాకు 90Ml అలవాటు లేదు కానీ మా డైరెక్టర్ చెప్పిన కథ ఆ కిక్ ఇచ్చింది – అనూప్ రూబెన్స్
Rx100 మూవీ ఫేమ్ కార్తికేయ గుమ్మడికొండ హీరోగా నటిస్తున్న 90 Ml చిత్రం రిలీజ్ కి సిద్ధంగా ఉంది ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ మీడియాతో మాట్లాడారు.
_సినిమాలో మొత్తం ఎన్ని పాటలు ఉన్నాయి.?
6 పాటలు ఉన్నాయి అండి, ఒక బిట్ సాంగ్ ఉంది.
అన్ని మాస్ సాంగ్స్ ఉంటాయి,కార్తికేయ బయట ఎలా ఉంటాడో డైరెక్టర్ సినిమాలో అది బాగా చూపించాడు.
సినిమా లో మ్యూజిక్ కి మంచి స్కోప్ ఉందా. ?
ఉంది అండి, ఈ సినిమాలో సాంగ్స్ కూడా పెద్ద లెన్త్ ఉండవు, నేను రెండు మూడు మాస్ సినిమాలు ఇది కంప్లీట్ కమర్షియల్ మాస్ సినిమా.
రీసెంట్ టైం లో మీ కెరియర్….
కొన్ని అనుకున్నవి జరగలేదు, పెద్ద ప్రాజెక్ట్స్ కొన్ని అవ్వలేదు,కానీ నా చేతిలో ఏమి లేదు,టైం ఎప్పుడు ఏమి జరగాలో అది జరుగుతుంది.
పూరి గారి తో మీ జర్నీ….
ఆయన తో మంచి అనుబంధం ఉంది,రెగ్యులర్ గా మాట్లాడుతా అప్పుడప్పుడు కలుస్తుంటాం…
ఒక డైరెక్టర్ కంటే మంచి వ్యక్తి గా నాకు బాగా పరిచయం.
వెబ్ సిరీస్ కేమైనా మ్యూజిక్ చేస్తున్నారా.?
వెబ్ సిరీస్ ఇంకా స్టార్ట్ చేయలేదు ఏమైనా exacting thing వస్తే డెఫినెట్ గా చేస్తా.
నితిన్ తో ఏమైనా చేస్తున్నారా.?
నితిన్ తో ఉంటుంది
సినిమాకి వర్క్ చేసేటప్పుడు స్టోరీ ని దృష్టిలో పెట్టుకుంటారా .?
హీరోని దృష్టిలో పెట్టుకుంటారా.?
ఫస్ట్ స్టోరీ అండి, తర్వాత హీరో ఎందుకంటే హీరోని బట్టి కూడా ఉంటుంది.ఆ స్టార్ ని బట్టి తనకున్న క్రేజ్ నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి.
మ్యూజిక్ డైరెక్టర్ మీద రెండు కంప్లైంట్స్ ఉంటాయి,ఒకటి ఫారన్ మ్యూజిక్ కాపీ కొడతారని,కొట్టినవే మళ్ళీ మళ్ళీ కొడతారని .?
ఒక మ్యూజిషియన్ లో ఒక స్టైల్ ఉంటుంది లోపల నేను ఒక 100 ట్యూన్స్ కంపోస్ చేస్తే ఒక ఐదు ట్యూన్ లు ఎక్కడో టచ్ అవుతాయి అది కాపీ కాదు,
సేమ్ మక్కీ కి మక్కీ దించడం తప్పు,
అలా అయితే మ్యూజిక్ డైరెక్టర్ వాల్యూ ఏముంది.
ఇంకే సినిమాలు చేస్తున్నారు.?
కన్నడ లో ఒక సినిమా చేస్తున్న,
తెలుగులో కొన్ని డిస్కషన్ లు జరుగుతున్నయి.
ఈ సినిమాకి ప్లస్ అంటే ఏమి చెప్తారు.?
నేను మ్యూజిక్ చేసాను అని కాకుండా మ్యూజిక్ ప్లస్,కార్తికేయ డాన్సులు ప్లస్,కామెడీ ప్లస్.