anushka shetty first look from naveen polishetty, uv creations movie released

నవీన్ పోలిశెట్టి, యూవీ క్రియేషన్స్ మూవీలో చెఫ్ అన్విత రవళి శెట్టిగా
అనుష్క శెట్టి, ఆమె బర్త్ డే సందర్భంగా లుక్ రిలీజ్.
యంగ్ టాలెంట్ నవీన్ పోలిశెట్టి, అందాల తార అనుష్క శెట్టి హీరో
హీరోయిన్లుగా యూవీ క్రియేషన్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ
సినిమాకు పి మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అనుష్క చెఫ్
పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉందీ సినిమా.
సోమవారం అనుష్క శెట్టి పుట్టినరోజు సందర్భంగా ఆమె ఈ చిత్రంలో పోషిస్తున్న
అన్విత రవళి శెట్టి క్యారెక్టర్ లుక్ పోస్టర్ ను చిత్రబృందం విడుదల
చేశారు. ఈ లుక్ లో ఆమె కిచెన్ లో డెలిషియస్ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నట్లు
ఉందీ లుక్. ఈ స్పెషల్ పోస్టర్ లో అనుష్కకు బర్త్ డే విశెస్ తెలిపారు.
వచ్చే ఏడాది తెరపైకి రానున్న ఈ మూవీపై ఫిల్మ్ లవర్స్ లో మంచి
అంచనాలున్నాయి.