Arjunas wedding in Ashokavanam Grand release on April 22

విశ్వక్ సేన్ ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ .. ఏప్రిల్ 22న గ్రాండ్ రిలీజ్
‘ఫలక్‌నుమా దాస్’ నుంచి పాగల్ వరకు వైవిధ్యమైన కథా చిత్రాలతో మెప్పిస్తున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ సమర్ఫణలో ఎస్వీసీసీ డిజిటల్ బ్యానర్‌పై బాపినీడు, సుధీర్ ఈదర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను ఏప్రిల్ 22న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. .
‘‘‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ ప్రమోషన్స్‌ను డిఫరెంట్‌గా చేస్తున్నాం. విశ్వక్ సేన్ పాత్ర యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యింది. తను ఇప్పటి వరకు చేసిన సినిమాలకు భిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ అల్లం అర్జున్ కుమార్ పాత్రను పోషిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన టీజర్‌తో పాటు ‘ఓ ఆడపిల్ల..’, ‘సిన్నవాడా…’ అనే లిరిక్ సాంగ్స్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా హిలేరియస్‌గా ఉంటుంది’’ అని మేకర్స్ తెలిపారు.
ఈ ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ చిత్రానికి.. సూపర్ హిట్ మూవీ ‘రాజావారు రాణిగారు’ మూవీ డైరెక్టర్ రవి కిరణ్ కోలా కథ- మాటలు, స్క్రీన్ ప్లే అందించడం విశేషం. విద్యా సాగర్ చింతా చిత్రాన్ని తెరకెక్కించారు. జై క్రిష్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. పవి కె.పవన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి విప్లవ్ ఎడిటర్. ప్రవల్య దుడ్డిపూడి ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు.
నటీనటులు:
విష్వక్ సేన్, రుక్సర్ థిల్లాన్ తదితరులు
సాంకేతిక నిపుణులు:
దర్శకత్వం: విద్యాసాగర్ చింతా
సమర్పణ: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్
కథ, మాటలు, స్క్రీన్ ప్లే : రవి కిరణ్ కోలా
బ్యానర్: ఎస్.వి.సి.సి.డిజిటల్
నిర్మాతలు: బాపినీడు, సుధీర్ ఈదర
సినిమాటోగ్రఫీ: పవి కె.పవన్
సంగీతం: జై క్రిష్
రచన: రవికిరణ్ కోలా
ఎడిటర్: విప్లవ్
ప్రొడక్షన్ డిజైనర్: ప్రవల్య దుడ్డిపూడి
పి.ఆర్.ఓ : వంశీ కాకా