Arvind Krishna Birthday Special Poster from Atharva
‘అథర్వ’ నుంచి అరవింద్ కృష్ణ బర్త్ డే స్పెషల్ పోస్టర్*
యంగ్ అండ్ టాలెంటెడ్ కార్తీక్ రాజు హీరోగా, సిమ్రన్ చౌదరి, ఐరాలు హీరోయిన్లుగా నటించిన అథర్వ సినిమాను పలు భాషల్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాను మహేష్ రెడ్డి తెరకెక్కిస్తుండగా.. సుభాష్ నూతలపాటి నిర్మిస్తున్నారు. పెగ్గో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్న ఈ మూవీని నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సంయుక్తంగా సమర్పిస్తున్నారు. విజయ, ఝాన్సీలు ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు.
అథర్వ చిత్రంలో అరవింద్ కృష్ణ ప్రముఖ పాత్రను పోషించారు. నేడు (జనవరి 5) ఆయన బర్త్ డే సందర్భంగా చిత్రయూనిట్ శుభాకాంక్షలు చెబుతూ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో అరవింద్ కృష్ణ ఎంతో సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇక ఈ పోస్టర్లోనే పోలీసులు, మీడియా అంటూ చాలా హడావిడి వాతావరణం కనిపిస్తోంది.
ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి కార్తిక్ రాజు, సిమ్రన్ చౌదరి, ఐరా పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్‌లను విడుదల చేశారు. సోషల్ మీడియాలో ఈ పోస్టర్లకు మంచి స్పందన లభించింది. దీంతో సినిమాకి మంచి బజ్ ఏర్పడింది. ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ పూర్తవ్వడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించింది చిత్రయూనిట్. త్వరలోనే టీజర్‌ను రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ ప్లాన్ చేసింది.
క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా.. ఈ సినిమాలో ఇంకా ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి. లవ్, రొమాన్స్, కామెడీ ఇలా అన్ని జానర్లను టచ్ చేసేలా సినిమా ఉంటుందని మేకర్లు తెలిపారు.
ఈ సినిమా కోసం టాప్ టెక్నీషియన్లు పని చేశారు. డీజే టిల్లు, మేజర్ సినిమాలకు సంగీతం అందించిన శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందిస్తున్నారు. చరణ్ మాధవనేని కెమెరామెన్‌గా, ఎస్బి ఉద్దవ్ ఎడిటర్‌గా వ్యహరించారు.
కార్తిక్ రాజు, సిమ్రన్ చౌదరి, ఐరా, అరవింద్ కృష్ణ, కబీర్ సింగ్ దుల్హన్, విజయ్ రామరాజు, గగన్ విహారి, రామ్ మిట్టకంటి, కిరణ్ మచ్చ, మరిముత్తు, ఆనంద్ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.
సాంకేతికబృందం
కథ, దర్శకత్వం : మహేష్ రెడ్డి
నిర్మాత : సుభాష్ నూతలపాటి
బ్యానర్ : పెగ్గో ఎంటర్టైన్మెంట్స్
సమర్పణ : నూతలపాటి నరసింహం, అనసూయమ్మ
ఎగ్జిక్యూటివ్ : ప్రొడ్యూసర్స్ విజయ, ఝాన్సీ
సంగీతం : శ్రీచరణ్ పాకాల
కెమెరామెన్ : చరణ్ మాధవనేని
ఎడిటర్ : ఎస్బి ఉద్దవ్
ఆర్ట్ : రామ్ కుమార్
లిరిక్స్ : కాసర్ల శ్యామ్, కిట్టు విస్సాప్రగడ
పీఆర్వో : సాయి సతీష్, పర్వతనేని రాంబాబు
*Arvind Krishna’s Look From Karthik Raju, Mahesh Reddy, Peggo Entertainments’ ATHARVA Unveiled*
Young and talented hero Karthik Raju’s multi-lingual film Atharva is directed by Mahesh Reddy and produced by Subhash Nuthalapati under the banner of Peggo Entertainments. Nuthalapati Narasimham and Anasuyamma are presenting the movie. Vijaya and Jhansi are the executive producers.
Arvind Krishna is playing a special role in this. Wishing the actor on his birthday, the team has released his look from the movie. The poster sees Arvind Krishna giving a stern gaze, and it also sees police officials and media persons.
As of now, the makers released the first-look posters of Karthik Raju, Simran Choudhary, and Ayraa and every promotional stuff increased expectations on the movie which has completed the shooting part and progressing the post-production works at a brisk pace. The makers are planning to release the teaser soon.
Atharva will have elements other than crime and thrilling. It will have a Love, Romance track, Comedy and different emotions as well.
Kabir Singh Duhan, Vijay Rama Raju, Gagan Vihari, Ram Mittakanti, Kiran Macha, Marimuthu and Anand will appear in important roles.
A top-notch team of technicians is taking care of different crafts of the movie. Sricharan Pakala of DJ Tillu and Major fame renders soundtracks, wherein Charan Madhavaneni is the cinematographer and SB Uddhav is the editor.
Atharva will release in Telugu, Tamil, Malayalam and Kannada languages.
Cast: Karthik Raju, Simran Choudhary, Ayraa, Arvind Krishna, Kabir Singh Duhan, Vijay Rama Raju, Gagan Vihari, Ram Mittakanti, Kiran Macha, Marimuthu, Anand and others
Technical Crew:
Writer and Director: Mahesh Reddy
Producer: Subhash Nuthalapati
Banner: Peggo Entertainments
Presents: Nuthalapati Narasimham and Anasuyamma
Ex-Producers: Vijaya, Jhansi
Music: Sricharan Pakala
DOP: Charan Madhavaneni
Editing: SB Uddhav
Art: Raam Kumar
Lyrics: Kasarla Shyam, Kittu Vissapragada
PRO: Sai Satish, Parvataneni