Asin onam wishes with her daughter Harini with viral photo
ఆసిన్ గారాల పట్టి హరిణితో ఓనం శుభాకాంక్షలు
హీరోయిన్ అసిన్ ప్రముఖ వ్యాపార వేత్త రాహుల్ శర్మను పెళ్లాడిన సంగతి తెలిసిందే. రాహుల్ తో పరిచయం తర్వాత అసిన్ సినిమా రంగాన్ని క్రమక్రమంగా వదిలేసింది. గతేడాది కాలంగా అసిన్ పేరుకానీ, ఫోటోలు కానీ బాలీవుడ్ సర్కిల్లో కనిపించడం లేదు, వినిపించడం లేదు. బయట కనిపించకుండా, సోషల్ మీడియాలో సైతం యాక్టివ్‌గా లేకుండా అసిన్ ఏం చేస్తోంది? అంటే….. ఆమె పూర్తి తన కూతురు అరిన్ బాధ్యతలు చూసుకోవడంపైనే దృష్టి పెట్టారు.
దాదాపు పదేళ్ల క్రితం తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచిన అసిన్ గుర్తుందా? తెలుగులో ఘర్షణ, గజని వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ అందాల భామ, అగ్రనటిగా ఉన్న సమయంలోనే మైక్రోమాక్స్ సంస్థ అధినేత రాహుల్ శర్మను లవ్ చేసి, 2015లో పెళ్లి చేసుకుంది. వీరికి 2017 అక్టోబర్ 24న ఆడబిడ్డ హరిణి జన్మించగా, ఈ ఓనం సందర్భంగా సంప్రదాయ దుస్తుల్లో ఉన్న హరిణి చిత్రాన్ని అసిన్, అభిమానులతో పంచుకుంది. ఓనం శుభాకాంక్షలు చెబుతూ, అసిన్ పోస్ట్ చేసిన హరిణి ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. దాన్ని మీరూ చూడండి. అరిన్ లుక్ అచ్చం అసిన్ మాదిరిగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అరిన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
హీరోయిన్లు పెళ్లి చేసుకుని పిల్లలను కన్న తర్వాత మళ్లీ సినిమా వైపు అడుగులు వేయడం మామూలే. అయితే అసిన్‌కు ఆ ఉద్దేశ్యం ఉందా? లేదా? అనే విషయంలో క్లారిటీ లేదు. బహుషా ఆమె మళ్లీ వెండితెర వైపు రాకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే (అక్టోబర్ 26) అసిన్ పుట్టినరోజు అక్టోబర్ 24న అరిన్ పుట్టినరోజు తల్లీకూతుళ్ల పుట్టిన రోజులకు మధ్యలో ఒకరోజు మాత్రమే గ్యాప్ ఉండటం విశేషం. అసిన్ బర్త్ డే అక్టోబర్ 26 కాగా.. అరిన్ బర్త్ డే అక్టోబర్ 24.