Athade Srimannarayana Trailer launch photos
అన్ని హంగులతో ప్యాన్ ఇండియా చిత్రంగా అలరించనున్న హీరో రక్షిత్ శెట్టి `అతడే శ్రీమన్నారాయణ`
రక్షిత్ శెట్టి హీరోగా పుష్కర్ ఫిలింస్ బ్యానర్‌పై పుష్కర్ మల్లిఖార్జున, హెచ్.కె.ప్రకాశ్ నిర్మిస్తోన్న చిత్రం `అతడే శ్రీమన్నారాయణ`. సచిన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ప్యాన్ ఇండియా చిత్రంగా గ్రాండ్ లెవల్లోఈ సినిమానువిడుదల చేస్తున్నారు. గురువారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. తెలుగు ట్రైలర్‌ని నేచురల్ స్టార్ నాని విడుదల చేశారు. ఈ సందర్భంగా…
హీరో రక్షిత్ శెట్టి మాట్లాడుతూ – “ట్రైలర్ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. సాధారణంగా నేను ఇప్పటి వరకు నా సినిమాల ట్రైలర్స్‌ను నేనే కట్ చేసుకుంటున్నాను. కానీ ఈ సినిమా ట్రైలర్‌ను కట్ చేయడానికి నెలరోజుల సమయం పట్టింది. నేను షార్ట్ ఫిలింస్ నుండి సినిమాల్లోకి వచ్చాను. చాలా కష్టపడ్డాను. ఇక `అతడే శ్రీమన్నారాయణ` సినిమా విషయానికి వస్తే ఈ సినిమా కోసం మూడేళ్లు కష్టపడ్డాను. ఈ జర్నీలో నాతో పాటు చాలా మంది ప్రయాణించారు. నా టీమ్‌కు ఈ సందర్భంగా థ్యాంక్స్ చెబుతున్నాను. నేను వచ్చి ఏడేళ్లు అయ్యింది. తక్కువ సినిమాలే చేశావని అంటుంటారు. కానీ మీరు చూస్తే నేను చేసిన సినిమాలు చూస్తే నేను, నాటీమ్ పడ్డ కష్టం పడుతుంది. ఈ సినిమాకు శంకర్ నాగ్‌గారు దర్శకత్వం వహించిన `మాల్గుడి డేస్` నాకు స్ఫూర్తి. ఆ సినిమాలోని మాల్గుడి ప్రదేశం దక్షిణ భారతానికి చెందిన ఉహత్మాక ప్రదేశం. అది భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఈ సినిమాకోసం 19 సెట్స్ వేశాం. దాదాపు 90 శాతం బెంగళూరు సెట్స్‌లోనే తీశాం. మిగిలిన భాగాన్ని బీజాపూర్, ఉత్తర కర్ణాటకల్లో చిత్రీకరించాం. అలాగే సినిమా ప్రారంభించి టీజర్ విడుదల చేసే సమయానికి ప్యాన్ ఇండియా మూవీగా చేయాలని నిర్ణయించుకున్నాం. అందులో భాగంగానే ఇప్పుడు సినిమా హ్యూజ్ రేంజ్లో విడుదల చేస్తున్నాం. డబ్బింగ్ విషయానికి వస్తే కన్నడ వెర్షన్ ను పూర్తి చేశాను. హిందీ ట్రైలర్‌కు డబ్బింగ్ చెప్పాను. వాయిస్ సెట్ అవడంతో ఇప్పుడు హిందీకి పూర్తి స్థాయిలో డబ్బింగ్ చెప్పాలని అనుకుంటున్నాను. ఇంత పెద్ద సినిమాను పూర్తి చేసి ప్యాన్ ఇండియా మూవీగా చేశామంటే నిర్మాతలు అందించిన ప్రోత్సాహమే కారణం. ఈ సినిమా కోసం మూడేళ్లలో 385 రోజలు పాటు కష్టపడ్డాం. డైరెక్టర్ సచిన్ నిద్రాహారాలు మానుకుని రేయింబగళ్లు కష్టపడ్డాడు. టీమ్ అందరూ బాగా సపోర్ట్ చేశారు. నా మిత్రుడు, కిరిక్ పార్టీ డైరెక్టర్ రిషబ్ శెట్టి ఈసినిమాలో చిన్న సన్నివేశంలో కనిపించింనందుకు థ్యాంక్స్. ఈ సినిమాలో లవ్, అడ్వెంచర్, కామెడీ, యాక్షన్ సహా అన్ని హంగులుంటాయి“ అన్నారు. అనంతరం పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు బదులుగా తెలుగులో తన అభిమాన నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని తెలిపారు. తన నటన, ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్‌లో తన పరిణితి తనకు నచ్చుతుందని తెలిపారు.
నిర్మాతలు పుష్కర్ మల్లిఖార్జున, హెచ్.కె.ప్రకాశ్ మాట్లాడుతూ – “ముందు ఈ సినిమాను 8 కోట్ల రూపాయల బడ్జెట్ తో ప్రారంభించాం. కథ, సబ్జెక్ట్ మీద నమ్మకంతో మంచి చిత్రంగా, నిర్మాణ వ్యయంలో రాజీ పడకుండా నిర్మించాం. అలాగే ప్యాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తున్నాం. రక్షిత్ శెట్టి ఈ సినిమాలో యాక్ట్ చేయడం మాకు హ్యాపీ. తనతో మరిన్ని చేయాలనుకుంటున్నాం“ అన్నారు.
డైరెక్టర్ సచిన్ మాట్లాడుతూ – “మూడేళ్ల పాటు ఓ సినిమాకు పనిచేయడం చాలా గొప్ప విషయం. ఇందులో నా ఒక్కడి కష్టమే కాదు.. అందరి సపోర్ట్ దొరికింది. అందరికీ నచ్చేలా ఉంటుంది. హీరో రక్షిత శెట్టి, నిర్మాతలు పుష్కర్ మల్లిఖార్జున, హెచ్.కె.ప్రకాశ్లకు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను“ అన్నారు.
ఈ కార్యక్రమంలో హీరోయిన్ శాన్వి శ్రీవాత్సవ సహా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.