Balakrishna – Boyapati Srinu new movie launch
Prestigious Film In Natasimha Nandamuri Balakrishna, Mass Director Boyapati Srinu’s Combination Produced By Miryala Ravinder Reddy Launched
After Blockbusters ‘Simha’, ‘Legend’ Natasimha Nandamuri Balakrishna, Boyapati Srinu are coming again together for a new film to score a Hat-trick. This prestigious project is launched with a grand Pooja ceremony. Miryala Ravinder Reddy is producing this film under Dwaraka Creations banner. Popular Director B Gopal gave the First clap for the muhurtam shot while Popular Producer Ambica Krishna switched on the camera. The First shot has been picturized on Natasimha Nandamuri Balakrishna uttering powerful dialogue in his unique style, ” Nuvvoka Maatante adi ‘Sabdham’, Ade Maata Nenante Adi ‘Saasanam’… Check In The Public”. Popular Producers C Kalyan, Sivalenka Krishna Prasad attended the event. The team has addressed media in a press meet.
Natasimha Nandamuri Balakrishna said, ” Today is an auspicious day. The film everyone is eagerly waiting for in My and Boyapati Srinu’s combination Produced by Miryala Ravinder Reddy garu in Dwaraka Creations launched today. My films, ‘Simha’, ‘Legend’ which were made with Boyapati Srinu scored super success. Our combination usually carry a lot of expectations among the audience and fans. But, Me and Boyapati believe in ‘Gatham Gathaha’. We won’t talk about our previous films and concentrate in our next film only. M Rathnam gari story, dialogues will be too good. We carry the responsibility to deliver what audience expect from us. ‘Simha’ and ‘Legend’ became blockbusters as we feel and fulfilled that responsibility. This films story has freshness and also has spiritual angle to it. Some stories were made out of a character and some comes from one’s personality. But, stories from our combination mostly come from our aggression. The story has shaped up superbly. Industry needs good young producers like Miryala Ravinder Reddy. I can assure the audience and fans that we will deliver a very good film in our combination.”
God in the form of Police has punished the criminals today.
Speaking about Encounter of Disha’s Killers, ” The miscreants who did henious act and killed Disha were encountered today. Nanna garu, Anna Nandamuri TarakaRama Rao garu has given many message oriented films and tried to uplift moral values in the society through his films and various mediums. I also conveyed the message, ‘There will be no creation without a Woman’ in my film ‘Legend’. Many ghastly incidents towards women are happening throughout out country. The God in the form of Police has done justice and punished the criminals today. This encounter carried out to instill fear among those who will try to do such crimes in the future. This should be a lesson for everyone. I appreciate Telangana Government, Police Department for taking this step which will stop to even think about doing such inhumane things. Disha will rest in peace now. I offer my deepest condolences to her family.”
Mass Director Boyapati Srinu said, ” This is my second film in Dwaraka Creations banner. This is my hat-trick film with Balayya Babu. ‘Bhadra’ was my first film in the industry. My career began with a very good film. It takes a good turn with ‘Simha’. ‘Simha’ and ‘Legend’ became biggest hits. This hat-trick film is my responsibility. I will make sure to surpass those two films with this film and fulfill my responsibility.
One can escape from Pollution but not from Police
Speaking about Disha’s Killers Encounter, ” While everyone in our country is mourning for the death of Disha, it’s good to hear that the justice has been served by the police with this encounter. Everyone should remember that one can escape from pollution but no one can escape from the Police.”
Producer Miryala Ravinder Reddy said, ” I might make many films in the future. But, producing a film with Balakrishna Garu is always an honour for me. I promise that this film after its release, Balakrishna Gari Fans will also witness such respect from everyone who love cinema.”
Natasimha Balakrishna starrer will have Dialogues: M Rathnam, Music: Thaman SS, Cinematography: Ramprasad, Art Director: AS Prakas, Editing: Kotagiri Venkateswara Rao, ThammiRaju, Producer: Miryala Ravinder Reddy, Direction: Boyapati Srinu
నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాతగా ప్రెస్టీజియస్ మూవీ ప్రారంభం!!
‘సింహా’. ‘లెజెండ్’ లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తోన్న హ్యాట్రిక్ చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌రెడ్డి ప్రొడక్షన్ నెం.౩ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు బి. గోపాల్ క్లాప్ నివ్వగా ప్రముఖ నిర్మాత అంబికా కృష్ణ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఫస్ట్ షాట్ లోనే నటసింహ నందమూరి బాలకృష్ణ ‘నువ్వొక మాటంటే అది ‘శబ్దం’ అదే మాట నేనంటే అది ‘శాసనం‘’అనే పవర్ఫుల్ డైలాగ్‌ను తనదైన స్టైల్లో చెప్పడం విశేషం. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు సి.కల్యాణ్, శివలెంక కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నటసింహ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ – “ఈరోజు శుభదినం. ఎప్పడు ఎప్పుడా అని అందరూ ఎదురుచూస్తున్న నా మరియు బోయపాటి శ్రీను కలయికలో ద్వారక క్రియేషన్ మిర్యాల రవీందర్ రెడ్డి గారు నిర్మాతగా నూతన చిత్రం ప్రారంభం జరిగింది. బోయపాటి శ్రీను కాంబినేషన్లో ’సింహా’, ’లెజెండ్’ సినిమాలు చేయడం, అద్భుతమైన విజయాలు అందుకోవడం జరిగింది. మా కాంబినేషన్లో సినిమా అనగానే ప్రేక్షకుల్లో, అభిమానుల్లో చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అయితే నాది, బోయపాటిది సిద్ధాంతం ఏంటంటే గతం గతః. మేము చేసిన సినిమాల గురించి మాట్లాడుకోకుండా పూర్తి కాన్సన్ట్రేషన్ మా నెక్స్ట్ మూవీ మీదనే ఉంచుతాం. అలాగే ఎం.రత్నంగారి కథ, సంభాషణలు వినసొంపుగా ఉంటాయి. ఏదైతే జనం కోరుకుంటున్నారో అవి ఇవ్వాల్సిన భాద్యత మా మీద ఉంది. అంత బాధ్యత తీసుకుంటాం కనుకనే ’సింహా’, ’లెజెండ్’ సినిమాలు అంత పెద్ద విజయం సాధించాయి. ఈ సినిమా కథలో కొత్తదనం ఉంది. అలాగే ఆధ్యాత్మికం కూడా ఉంది. కొన్ని కథలు ఒక పాత్రలో నుండి పుట్టుకొస్తాయి. కొన్ని ఒక మనిషి వ్యక్తిత్వం నుండి పుట్టుకొస్తాయి. అయితే మా కలయికలో కథలు ఎక్కువగా మా ఆవేశం నుండి పుట్టుకొస్తాయి. అలాగే ఈ కథ అద్భుతంగా వచ్చింది. ఇండస్ట్రీకి మిర్యాల రవీందర్‌లాంటి మంచి మంచి యంగ్ ప్రొడ్యూసర్స్ రావాల్సిన అవసరం ఎంతో ఉంది. అటువంటి తరుణంలో మా కాంబినేషన్లో చాలా మంచి సినిమా ఇవ్వబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
ఆ భగవంతుడే పోలీసుల రూపంలో నిందితులకు శిక్ష విధించాడు
దిశ అనే మహిళపైన కొంత మంది దుండగులు చేసిన సామూహిక అత్యాచారానికి ఫలితంగా ఈ రోజు వారిని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఎన్నో మాధ్యమాల ద్వారా సంఘాన్ని మార్చడానికి, వారికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వడానికి నాన్నగారు అన్న నందమూరి తారక రామారావుగారు ఎన్నో మంచి సందేశాత్మక చిత్రాలు చేయడం జరిగింది. అలాగే ’లెజెండ్’ సినిమాలో మేము కూడా స్త్రీ లేకుంటే సృష్టి లేదు అనే మంచి సందేశం ఇవ్వడం జరిగింది. ఇక్కడే కాదు దేశం యావత్తు మన మహిళలపై ఎన్నో ఘాతకాలు జరుగుతున్నాయి. ఆ భగవంతుడే పోలీసుల రూపంలో ఈరోజు నిందితులకు సరైన శిక్ష విధించడం జరిగింది, మరోసారి ఎవరూ కూడా అలాంటి దుశ్చర్యలు చేయకుండా ఉండటానికి, అసలు ఆ ఆలోచన కూడా మొలకెత్తనీయకుండా వారిని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. అందరికీ ఇదొక గుణపాఠం కావాలి. ముందు ముందు ఇటువంటి ఘాతుకానికి సాహసించకుండా, ఆ ఆలోచన కూడా రానివ్వకుండా చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి నా అభినందనలు తెలియజేస్తున్నా. దిశ ఆత్మకు ఇప్పుడు శాంతి చేకూరింది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అన్నారు.
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ “ద్వారక క్రియేషన్స్‌లో నా రెండవ సినిమా ఇది. బాలయ్యబాబు, నాది హ్యాట్రిక్ ఫిలిం. ఇండస్ట్రీలో నా మొదటి సినిమా ’భద్ర’. ఒకమంచి సినిమాతో నా లైఫ్ స్టార్ట్ అయింది. ‘సింహా వంటి భారీ విజయంతో నా జీవితానికి మంచి మలుపు వచ్చింది. సింహా, లెజెండ్ చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. ఇప్పుడు రాబోతున్న మూడవ సినిమాపై నా బాధ్యత మరింత పెరిగింది. ఆ రెండు సినిమాలను మించిన మంచి సినిమాను మీ ముందుకు తీసుకొచ్చి నా బాధ్యతను నెరవేర్చుకుంటాను.
పొల్యూషన్ నుంచైనా తప్పించుకోవచ్చు కానీ పోలీస్ నుంచి తప్పించుకోలేరు
దిశకి జరిగిన అన్యాయం గురించి దేశంలోని అందరూ బాధపడుతున్నపుడు తెలిసిన మంచి విషయం ఏంటంటే వారు పారి పోవడానికి ప్రయత్నిస్తే పోలీసులు వారిని ఎన్కౌంటర్ చేయడం. ఎవరైనా ఒకటే గుర్తుంచుకోవాలి ‘పొల్యూషన్ నుండైనా తప్పించుకోవచ్చేమో కానీ పోలీస్ నుండి ఎవరూ తప్పించుకోలేరు” అన్నారు.
చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ “భవిష్యత్తులో నేను చాలా సినిమాలు తీస్తుండొచ్చు. కానీ, బాలకృష్ణగారితో సినిమా అంటే గౌరవంగా భావిస్తా. ఆ గౌరవాన్ని సినిమా విడుదల తర్వాత బాలకృష్ణగారి అభిమానులు, సినిమా ఇష్టపడే ప్రతి ఒక్కరి నుండి అటువంటి గౌరవాన్ని పొందే విధంగా ఈ సినిమాను నిర్మిస్తానని ప్రామిస్ చేస్తున్నాను” అన్నారు.
నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: ఎం.రత్నం, సంగీతం: థమన్ ఎస్.ఎస్, సినిమాటోగ్రఫీ: రాంప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్: ఎ.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వరరావు, తమ్మిరాజు, నిర్మాత: మిర్యాల రవీందర్‌రెడ్డి, దర్శకత్వం: బోయపాటి శ్రీను.