Bangarraju Movie Musical Night Event Photos
బంగార్రాజులో ప్రతి సాంగ్ ఓ వజ్రంలా ఉంది.. మ్యూజికల్ నైట్ ఈవెంట్లో కింగ్ నాగార్జున
కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం `బంగార్రాజు`. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. కళ్యాణ్ కృష్ణ దర్శకుడు. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లలో విడుదలకానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆదివారం బంగార్రాజు మ్యూజికల్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..
నాగార్జున మాట్లాడుతూ.. ‘అభిమానులందరినీ ఇక్కడకు పిలవలేకపోయాం. అందరూ క్షమించండి. జనవరి 14న ఈ చిత్రం రిలీజ్ కానుంది. అన్నపూర్ణ స్టూడియోకు అది చాలా ముఖ్యమైన తేది. అదే రోజును అన్నపూర్ణ పుట్టింది. దసరా బుల్లోడు అనే సినిమాతో యాభై ఏళ్ల క్రితం నాన్న గారు సంక్రాంతికి దుమ్ములేపారు. అది కూడా మ్యూజికల్ హిట్. సక్సెస్ మీట్లో అందరికీ థ్యాంక్స్ చెబుతాను. సినిమాకు సగం సక్సెస్ మ్యూజిక్. ఆ సగం సక్సెస్‌ను అనూప్‌కు ఇస్తున్నాం. చక్కటి మాస్ కమర్షియల్ సాంగ్ ఇచ్చారు. ప్రతీ సాంగ్ ఓ వజ్రంలా ఉంటుంది. సూపర్ హిట్ ఆల్బమ్. లిరిక్ రైటర్స్ మంచి సాహిత్యాన్ని ఇచ్చారు. తెలుగు భాష ఉన్నంత వరకు సాహిత్యం ఉంటుంది. ఎంత ఊహించారో అంతకన్నా ఎక్కువే ఉంటుంది. జనవరి 11న ట్రైలర్ రాబోతోంది. జనవరి 14న పండుగ రోజున పండుగలాంటి సినిమాను తీసుకొస్తున్నాం. అందరూ ఆదరించండి’ అని అన్నారు.
నాగ చైతన్య మాట్లాడుతూ.. ‘మనం సినిమాకు ఇలాంటి ఫంక్షన్ చేశాం. బంగార్రాజుకు మళ్లీ ఇలా చేయడం ఆనందంగా ఉంది. ఆడియోను పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్. ఇప్పుడు ఒక్క పాట హిట్ అయితే ఓపెనింగ్స్ అదిరిపోతాయి. అలాంటిది ఈ సినిమా కోసం అనూప్ అద్బుతమైన ఆల్బమ్ ఇచ్చారు. అనూప్ అన్నపూర్ణలో చేసిన ప్రతీ సినిమా, ఆల్బమ్ హిట్ అయింది. ప్రతీ ఒక్కరి ఇన్ పుట్స్ తీసుకునేవారు. మా లిరిక్ రైటర్స్ అందరికీ థ్యాంక్స్. ఇది పండుగ లాంటి సినిమా. ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరితో కలిసి సినిమా చూసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది. బంగారం లాంటి పాత్ర ఇచ్చినందుకు నాన్నకు, కళ్యాణ్ కృష్ణకు థ్యాంక్స్. అంచనాలకు తగ్గట్టుగానే సినిమా ఉంటుంది’ అని అన్నారు.
డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ.. ‘సినిమా సక్సెస్‌ను మ్యూజిక్ డిసైడ్ చేస్తుంది. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. నాగార్జున గారి ప్రతీ సినిమా మ్యూజికల్‌గా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. నేను, నాగ చైతన్య కలిసి చేసిన రారండోయ్ వేడుకచూద్దాం కూడా మ్యూజికల్ హిట్ అయింది. నాగార్జున గారు మాకు ఎన్నో సలహాలు ఇస్తుంటారు. ఈ మూవీ టైటిల్ సాంగ్ గురించి చాలా కష్టపడ్డాం. రెండు పాటల విషయంలో చై కూడా పోటీ పడ్డాడు. పెద్ద లడ్డుండ కంటే చిన్న లడ్డుండ బాగుండాలని మాతోనే మూడు రోజులున్నారు. వంద మంది వంద రోజులు నాన్ స్టాప్‌గా కష్టపడితే ఈ రోజు ఇలా మీ ముందుకు వచ్చాం. ఇండస్ట్రీలో బంగార్రాజు అంటే నాగార్జున గారే. ఇప్పుడు నాగ చైతన్య వచ్చారు. ఇద్దరూ పోటీ పడి నటించారు. ఏ పాత్ర బాగుంది.. ఏ పాత్ర బాగాలేదు.. ఏది తక్కువ ఏది ఎక్కువ అనేది ఎవ్వరూ చెప్పలేరు’ అని అన్నారు.
కృతి శెట్టి మాట్లాడుతూ.. ‘బంగారమే అనే పాటకు మొదటి సారి డ్యాన్స్ చేశాను. భాస్కర భట్ల గారు ఎంతో మంచి లిరిక్స్ రాశారు. మధు ప్రియ గారు ఎంతో ఎనర్జీతో పాడారు. ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు అనూప్ గారికి థ్యాంక్స్. నాకు సపోర్ట్ చేసిన నాగ చైతన్యకు థ్యాంక్స్. నాగార్జున, రమ్యకృష్ణ గారి సీనియర్లతో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను’ అని అన్నారు.
నిర్మాత జీ స్టూడియోస్ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘ప్రతీ పాట అద్బుతంగా ఉంది. ఈ మ్యూజికల్ ఈవెంట్‌తోనే సంక్రాంతి పండుగ ప్రారంభమైనట్టుంది. సంక్రాంతికి ఒక బంగార్రాజు వస్తేనే ఆ రేంజ్ ఉంది. ఇప్పుడు ఇద్దరు బంగార్రాజులు వస్తున్నారు’ అని అన్నారు.
నాగ సుశీల మాట్లాడుతూ.. ‘నేను ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమాను చూస్తాను. సోగ్గాడే చిన్ని నాయన కంటే పెద్ద హిట్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అని అన్నారు.
సుమంత్ మాట్లాడుతూ.. ‘అన్ని పాటలు వరుసగా వినడం ఇదే మొదటి సారి. అనూప్ రూబెన్స్ అద్బుతమైన సంగీతాన్ని అందించారు.మనం, సోగ్గాడే కంటే ఈ సినిమాలోని ఆల్బమ్ అద్బుతంగా ఉంది. ఈ పాటలు వినడానికి నేను థియేటర్‌కు వెళ్తాను. సంక్రాంతికి ఇదే నెంబర్ వన్ సినిమా అవుతుంది. ఎంతో నమ్మకంగా చెబుతున్నాను. సోగ్గాడే కంటే పెద్ద హిట్ అవుతుంది. సంక్రాంతికి సినిమాను తీసుకువచ్చేందుకు అందరూ ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. మాస్కులు వేసుకుని మాస్ థియేటర్లోనే ఈ సినిమాను చూస్తాను’ అని అన్నారు.
ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ.. ‘నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నాగార్జున గారికి థ్యాంక్స్. కల నెరవేరినట్టు అనిపిస్తోంది. నేను కూడా సినిమా గురించి ఎదురుచూస్తున్నాను. నేను డ్యాన్స్ చేయగలను అని చెప్పి ప్రోత్సహించిన కొరియోగ్రఫర్ శేఖర్ మాస్టర్ గారికి థ్యాంక్స్’ అని అన్నారు.
డీఓపీ యువరాజ్ మాట్లాడుతూ.. ‘చిన్నప్పటి నాగార్జున గారి సినిమాలు చూస్తూ పెరిగాను. ఈ సినిమాలో కొన్ని సీన్స్‌లో నాగార్జున గారు మైస్మరైజ్ చేశారు. సహనానికి నాగ చైతన్య ఇంకో పేరులాంటి వారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్’ అని అన్నారు.
భాస్కర భట్ల మాట్లాడుతూ.. ‘సోగ్గాడే చిన్ని నాయన తరువాత మళ్లీ బంగార్రాజుకు పాటలు రాశాను. లడ్డుండా, బంగారా బంగారా పాటలు రాశాను. కళ్యాణ్ కృష్ణకు అన్ని విభాగాల మీద పట్టుంది. అలాంటి దర్శకుడితో పని చేయడం ఆనందంగా ఉంది. ఇందులో నాగ చైతన్య ఉన్నారు కాబట్టి ఈ సినిమా సోగ్గాడే కంటే పెద్ద హిట్ అవ్వాలి’ అని అన్నారు.
దక్ష నగార్కర్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో భాగస్వామిని అయినందుకు ఎంతో సంతోషంగా ఉంది. నాగార్జున సర్ నుంచి ఎంతో నేర్చుకున్నాను. అది మాటల్లో చెప్పలేను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్‌కు థ్యాంక్స్. సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను’ అని అన్నారు.
లిరిక్ రైటర్ బాలాజీ మాట్లాడుతూ.. ‘సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో నీ నవ్వే పాటను రాశాను. ఇందులో నాగ చైతన్య కోసం నా కోసం అనే పాటను రాశాను. డైరెక్టర్ గారు ఎంత మంది సందర్భం ఇస్తారో.. సాహిత్యాన్ని కూడా ఇస్తారు’ అని అన్నారు.
లిరికల్ రైటర్ కాస్లర్ శ్యామ్ మాట్లాడుతూ.. ‘మొదటి సారి నాగార్జున గారికి రాశాను. నాగ చైతన్య గారికి శైలజా రెడ్డి గారి అల్లుడు టైటిల్ సాంగ్ రాశాను. నా సాంగ్‌లో సస్పెన్స్ ఎలిమెంట్ ఉందేమో అందుకు ఇంకా రిలీజ్ చేయలేదు. నా పాటలో రమ్యకృష్ణ గారు కూడా ఉంటారు. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ గారు ఎంతో సరదాగా ఉంటారు’ అని అన్నారు.
దర్శన మాట్లాడుతూ.. ‘ఇది మ్యూజికల్ ఈవెంట్ కాబట్టి అనూప్ రూబెన్స్ గురించి మాట్లాడుతాను. నాకు మంచి పాట ఇచ్చినందుకు థ్యాంక్స్. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన నాగార్జున గారికి థ్యాంక్స్. జనవరి 14న రాబోతోంది. అందరూ కరోనా నిబంధనలు పాటిస్తూ సినిమాను చూడండి’ అని అన్నారు