Batala Ramaswamy Biopic Movie Opening Photos
బట్టల రామస్వామి బయోపిక్కు’ పూజ కార్యక్రమాలతో ప్రారంభం
7 హిల్స్ ప్రొడక్షన్స్ పతాకంపై అల్తాఫ్ ,శాంతిరావు, లావణ్యరెడ్డి, సాత్వికజై హీరోహీరోయిన్లుగా రామ్ నారాయణ్ దర్శకత్వంలో సతీష్ కుమార్. ఐ నిర్మించనున్న సికామ్ ఎంటర్ టైనర్ “బట్టల రామస్వామి బయో పిక్కు” .ఈ చిత్ర ప్రారంభోత్సవం నిన్న హైద్రాబాద్ లో జరిగింది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకులు వీరశంకర్ క్లాప్ కొట్టగా ,ప్రముఖ కెమెరామెన్ జయరామ్ కెమెరా స్వీఛాన్ చేశారు. ప్రముఖ దర్శకుడు చంద్రమహేష్ గౌరవ దర్శకత్వం వహించారు.ప్రముఖ సంగీత దర్శకులు ఆర్. పి. పట్నాయక్ మూవీ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో గీత రచయిత భాస్కర్ బట్ల, హీరోస్ రాం కార్తీక్, గౌతమ కృష్ణ, అరిస్ట్స్ఆర్. కె, గిరిధర్, సింగర్ రవివర్మ, యాదగిరిగుట్ట ఏ ఈ ఓ భాస్కర్ శర్మ, బిల్డర్ రామ్మూర్తి లతో పాటు చిత్ర యూనిట్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్సతిష్ కుమార్. ఐ మాట్లాడుతూ” న్యూ టాలెంట్ ని ఎంకరేజ్ చేద్దామని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాము. డీఫ్రెంట్ జోనర్లో వుండే వెరైటీ మూవీ మాచిత్రం. అన్ని కమర్షియల్ హంగులతో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాం.నెక్స్ట్ వీక్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకొనున్నాం. అన్నారు.ఈ చిత్రానికి డి. ఒ. పి కర్ణ పైరసాని, ఎడిటర్:సాగర్ దాడి, పి ఆర్ ఓ :బి.వీరబాబు,కధ, మాటలు, పాటలు:వాసుదేవమూర్తి, ప్రొడ్యూసర్:సతీష్ కుమార్.ఐ , స్క్రీన్ ప్లే, సంగీతం, డైరెక్షన్:రామ్ నారాయణ్.