Bhagat Singh Nagar Motion Poste Launch
‘భగతసింగ్ 112 వ జన్మదిన సందర్భంగా ఆయనకు నివాళులు సమర్పిస్తు భగత్ సింగ్ నగర్’ మోషన్ పోస్టర్ లాంచ్..
గ్రేట్ ఇండియా మీడియా హౌస్ సమర్పణలో వలజ గౌరి, రమేష్ ఉడత్తు నిర్మాతలుగా, వలజ క్రాంతి దర్శకత్వంలో ప్రదీప్ వలజ, మిధున ధన్పాల్ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న చిత్రం ‘భగత్ సింగ్ నగర్’ ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ లాంచ్ ను తెలంగాణ రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి చేతుల మీదుగా శనివారం ప్రసాద్ ల్యాబ్ లో విడుదల గావించారు. ఈ సందర్భంగా ముందుగా ప్రముఖ నిర్మాత దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీకు న్యూ కమర్స్ ట్రూ స్టోరీస్ తో వస్తున్నారు. అభినందించవలసిన విషయం. భగత్ సింగ్ నగర్ అనగానే నాకు విజయవాడ గుర్తొచ్చింది. లవ్ థ్రిల్లర్ స్టొరీ అని విన్నాను.. టీమ్ అందరికీ నా బెస్ట్ విషెస్ తెలియచేస్తున్నా అన్నారు.
దర్శకుడు క్రాంతి మాట్లాడుతూ.. కొత్త వాడిని అయినా నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నా.. ఇక సినిమా విషయానికి వస్తే… భగత్ సింగ్ నగర్ అనే స్లమ్ ఏరియా లో జరిగే లవ్ స్టొరీ తో మొదలై త్రిల్లర్ గా టర్న్ అయ్యి క్రైమ్ గా మారే చిత్రం. ఇక నిర్మాత రమేష్ గారు కేవలం డబ్బు పెట్టడమే కాదు.. నేను స్ట్రెస్ లో ఉన్నప్పుడు చాలా మోటివేట్ చేసేవారు. ఆయన లేకపోతే నేను ఈ వేదిక లేదు. ఓ మంచి సినిమా చేసాము ఆదరిస్తారని ఆశిస్తున్నా అన్నారు.
చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ... భగతసింగ్ గారి 112 వ జయంతిని పురస్కరించుకొని ‘భగత్ సింగ్ నగర్’ పోస్టర్ ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. స్లమ్ ఏరియా లో జరిగే క్రైమ్ థ్రిల్లర్ సినిమా స్టోరీ అంటున్నారు. కొత్త థాట్స్ కు నాంది పలుకుతున్నారని తెలుస్తోంది. మంచి సక్సెస్ ను పొందాలని కోరుకుంటున్నా అన్నారు.
సిపిఐ నారాయణ మాట్లాడుతూ.. కుటుంబాన్ని సంతృప్తి పరిచే వాడే అసలైన కంమ్యూనిస్ట్ అని అభిప్రాయం. మరి ఈ భగతసింగ్ నగర్ సినిమాలో ప్రేమను ఎలా చూపించారో తెలియదు కానీ.. పోస్టర్, మరియు ఫస్ట్ లుక్ మాత్రం
ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సినిమా లో మంచి సందేశం కూడా ఉందని చెబుతున్నారు. ప్రేక్షకుల సహకారంతో విజయవంతం కావాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్నారు.
హీరో ప్రదీప్ వలజ మాట్లాడుతూ… ముంబయి లో యాక్టింగ్ కోర్సు చేసాను. మా నాన్న మునిచంద్ర గారే దగ్గరుండి చేర్పించారు. ఇలా పేరెంట్స్ సపోర్ట్ ఉండటం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అందుకు నేను మానాన్న కు కృతజ్ఞతలు. ఇక యాక్టింగ్ కోర్సు అవగానే అవకాశం కోసం వెతుక్కోవాల్సి వస్తుంది. ఆ కష్టం లేకుండానే మా అన్నయ్య క్రాంతి నే డైరెక్ట్ చేసి అవకాశం ఇచ్చాడు. కానీ షూటింగ్ టైం లో మాత్రం చాలా కష్టపెట్టాడు. మా కష్టానికి తగ్గట్టు సినిమా బాగోచ్చింది. ఆదరిస్తారని ఆశిస్తున్నా అన్నారు.
హీరోయిన్ మిధున ధన్ పాల్ మాట్లాడుతూ.. మలయాళంలో చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ అయ్యింది. తెలుగులో నా మొదటి సినిమా ఇది. అందరూ ఎంతో సహకరించారు. ఈ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నా అన్నారు.
నిర్మాత రమేష్ మాట్లాడుతూ… ఎన్ ఆర్ ఐ అంటే ఏమీ తెలియదు అనుకుంటారు. కానీ మేము వెళ్ళేది కూడా ఇక్కడ నుంచే కదా.. అందులోనూ నేను ఒక బిసినెస్ మ్యాన్ ను. నాకు తెలిసింది రెండే ఒకటి సక్సెస్, మరోటి ఫెయిల్యూర్.. కనుక ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా.. మంచి సినిమా చేసాను అనే ఫీలింగ్ నాకుంది అన్నారు.
తెలంగాణ రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి చాడ వెంకట రెడ్డి, సిపిఐ నారాయణ, సిపిఎం పల్లా రాజేశ్వర్ రెడ్డి, దర్శకుడు చంద్ర మహేష్, ముని చంద్ర, దర్శకుడు బాబ్జి, ఆదారి కిషోర్, ఓంకార్ రాజు, సతీష్ గౌడ్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రదీప్ వలజ, మిధున ధన్ పాల్, రవి ప్రకాష్, బెనర్జీ, మునిచంద్ర, ప్రభావతి, అజయ్ గోష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి డిఓపి: కళ్యాణ్ సమి, రాజేష్ పీటర్, మ్యూజిక్: హర్ష ప్రవీణ్, ప్రభాకర్ దమ్ముగరి, బ్యాక్ గ్రౌండ్: ప్రభాకర్ దమ్ముగిరి, ఎడిటర్: జియాన్ శ్రీకాంత్, కొరియోగ్రఫీ: ప్రేమ్ గోపి మాస్టర్, లిరిక్స్: చైతన్య ప్రసాద్, విశ్వయిక, సుదీర్ కుమార్ వరాల, వీరు గడ్డం, కో డైరెక్టర్: నవీన్, వినోజ్ ఎన్. కో ప్రొడ్యూసర్స్: వెన్ కొనురు, నాగేశ్వర్ పిళ్ళే, నిర్మాతలు: వలజ గౌరి, రమేష్ ఉడత్తు, కథ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం: వలజ క్రాంతి.