Biopic of former Deputy Prime Minister Babu Jagajjeevan Ram

మాజీ ఉప ప్రధాని బాబూ జగజ్జీవన్ రామ్ బయోపిక్
డిసెంబర్ 22: మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబూ జగజ్జీవన్ రామ్ జీవిత చరిత్రను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు దిలీప్ రాజా. గతంలో ప్రముఖ హాస్యనటుడు అలీ హీరోగా ‘పండుగాడి ఫోటో స్టూడియో ‘ చిత్రాన్ని అలాగే అంబేడ్కర్ జీవిత చరిత్రకు దర్శకత్వం వహించారు ప్రస్తుతం ఆయన ” బాబూజీ ” టైటిల్ తో గుంటూరు జిల్లా తెనాలి పరిసర ప్రాంతాల్లో బాబూ జగజ్జీవన్ రామ్ బయోపిక్ ను రూపొందిస్తున్నారు. మాజీ ఐఎయస్ అధికారి డాక్టర్ బి రామాంజనేయులు తొలి క్లాప్ ఇవ్వగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ లిడ్ కాప్ అధ్యక్షులు కాకుమాను రాజ శేఖర్ కెమేరా స్విచ్ ఆన్ చేశారు.జగజ్జీవన్ రామ్ కుమార్తె, లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ పాత్రను సీనియర్ నటి తాళ్లూరి రామేశ్వరి పోషిస్తుండగా టైటిల్ రోల్ ను మిలటరీ ప్రసాద్ చేస్తున్నట్లు దర్శకుడు దిలీప్ రాజా వివరించారు.
—