Bobby Simha Interview photos
కథలేని సినిమాల్లో యాక్ట్ చేయడం నాకు తెలియదు – బాబీ సింహా
మాస్ మహారాజా రవితేజ హీరోగా వి.ఐ. ఆనంద్ దర్శకత్వంలో వస్తున్నా చిత్రం డిస్కోరాజా ఈ చిత్రంలో తమిళ్ లో విలన్ గా అద్భుతమైన పాత్రలు చేసిన బాబీ సింహా ఈ సినిమాలో కూడా విలన్ గా కనిపించనున్నారు,
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.!
చెన్నయ్ లో ట్రైల్స్ ఎప్పుడు మొదలు పెట్టారు.?
2005 లో చెన్నై కి వెళ్ళాను 2008 వరకు నాకు తమిళ్ సరిగా రాదు,
నాకు రజినీకాంత్ గారు అంటే చాలా ఇష్టం,
అది పేట సినిమాతో నా కల నెరవేరింది,
ఇప్పుడు కమలహాసన్ సర్ తో ఇండియన్-2 లో చేస్తున్నాను.
డిస్కోరాజా గురించి చెప్పండి.?
ఈ సినిమా కమర్షియల్ అనే కాదు మంచి కంటెంట్ ఉంది వి.ఐ ఆనంద్ గారు వచ్చి కంటెంట్ ఓరియెంటెడ్ డైరెక్టర్ లైక్ ఎక్కడికిపోతావ్ చిన్నవాడా,ఒక్క క్షణం.
హిస్ సో కూల్ & క్రియేటివ్,
ఇప్పటివరకు నేనొక 40,45 సినిమాలు చేశాను దానిలో బెస్ట్ డైరెక్టర్స్ లిస్ట్ లో వి.ఐ ఆనంద్ కూడా ఒకరు.
మీ రోల్ ఈ సినిమాలో సీరియస్ గా ఉంటుందా, లేదా జోవియల్ గా ఉంటుందా.?
అన్ని ఉంటాయి అండి.
హీరో అవ్వాలని వచ్చారా.?
నేను యాక్టర్ అవుదామని వచ్చాను,హీరో అనేది నా డెసిషన్ లో బట్ ఇట్ హేపెన్ రెండు ఫెయిల్యూర్ అయినా తర్వాత ఇగో కొంచెం హర్ట్ అయింది.ఇవన్నీ జర్నీ లో జరిగేవే కదా.
మీ మాటల్లో ఎక్కువ కాన్సెప్ట్ కనబడుతోంది అది డిస్కోరాజా ఎఫెక్ట్ అంటారా.?
బేసిక్ గా నాకు కాన్సెప్ట్ సినిమాలు ఎక్కువ ఇష్టం,
కథలేని సినిమాల్లో యాక్ట్ చేయడం నాకు తెలియదు.నాకు సీన్ చెప్పారంటే దానిలో బలమైన కంటెంట్ ఉండాలి.
రవితేజ గారిలో మీకు నచ్చిన విషయం ఏంటి.?
టైమింగ్,టైం మేనేజేమెంట్,పంక్చువాలిటి.
ఈ మూవీ లో నటించడానికి కారణం స్టోరీ ఆ.? కేరెక్టర్ ఆ.?
స్టోరీ & మై కేరెక్టర్,
స్టోరీ లో విషయం ఉంటుంది మనకు,
కథ లేకపోతే ఏమి చేయలేము కదా కథ లేకపోతే మనకు పని ఉండదు.
చాలా విలన్ రోల్స్ చేశారు కదా దానికి ఈ డిస్కోరాజా కి తేడా ఏంటి.?
జిగర్తాండ లో ఫస్టాఫ్ భయపెట్టాలి,సెకండాఫ్ లో ఒక ఫ్యూలిష్ నెస్ ఉంటుంది,
చాలా ఫేవౌర్స్ ఉన్నాయి ఆ సినిమాలో.
ఈ రెండింటికి చాలా తేడా ఉంది డిస్కోరాజా నాకే చాలా కొత్తగా అనిపించింది.
జిగర్తాండ తెలుగు రీమేక్ చూసారా.?
చూసాను అండి నాకు చాలా బాగా నచ్చింది.
డబ్బింగ్ మీరే చెప్పారా.?
నేనే చెప్పా నేను ఏ లాంగ్వేజ్ లో సినిమా చేసిన నేనే చెప్పుకుంటా.
తెలుగులో ఇది వరకు రిజక్ట్ చేసిన సినిమాలు ఏమైనా ఉన్నాయా.?ఎందుకు.?
చాలా ఉన్నాయండి,కథలు నచ్చక.
రజినీకాంత్ గారి గురించి మీ మాటల్లో.?
రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ తెలుసు,కార్తీక్ సుబ్బరాజ్ ఆయనతో ఎప్పటికైనా సినిమా చేస్తాడని తెలుసు చిన్న రోల్ ఇస్తే చాలు అనుకున్నాను బట్ నాకు పేట లో చాలపెద్ద రోల్ ఇచ్చాడు.
ఫ్యూచర్ లో ఎవరితో వర్క్ చెయ్యాలని ఉంది.?
అందరితో చెయ్యాలని ఉంది సర్.
మీకు తెలుగు సినిమాలు ఎందుకు రావట్లేదు.?
ఎందుకు రావాలి సర్.!
అంటే వస్తున్నాయి బట్ నేను చూస్ చేసుకోవట్లేదు.
మీరు జూనియర్ ఆర్టిస్ట్ చేసారా.?
చాలా చేసాను అండి.
ఇప్పటకి, అప్పటికి తేడా ఏంటి.?
చాలా తేడా ఉంది
అప్పట్లో 250 ఇచ్చేవారు రోజుకి వాటితో చాలా హ్యాపీగా ఉండేది,
నేను ఫ్రేమ్ లో ఆ చివర నిలబడ్డాను
నేను ఈ రోజు 250 సంపాదించాను అనుకునే దానిలో చాలా ఆనందం ఉంది.