Bollywood people will throw if Nani goes there
నాని వస్తే బాలీవుడ్లో గెంటేస్తారు
న్యాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. నా గ్యాంగ్, విక్రమ్ కథ, అనిరుధ్ సౌండ్, మైత్రి డబ్బు, మన సినిమా, మీ ఎంటర్టైన్మెంట్’ అని క్యాప్షన్ ఇచ్చారు. ముందుగా నాని ‘నా పేరు పెన్సిల్.. ఫేమస్ రివెంజ్ రైటర్’ అంటూ చెప్పే డైలాగ్ తో టీజర్ మొదలైంది.ఇది తొలిసారి పెన్సిల్ రాసిన ఒరిజినల్ స్టోరీ అంటూ నాని ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌తో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇంగ్లిష్ సినిమాలు చూసి వాటిలోని డైలాగాలను తెలుగులోకి ఫన్నీగా ట్రాన్స్‌లేట్ చేస్తుంటాడు. రివెంజ్ స్టోరీలు రాసే పాత్ర ఆయనది. ఈ చిత్రం షూటింగ్ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా పాత్రికేయులతో నాని ముచ్చటించారు.
ఈ ఇంటర్యూలో భాగంగా ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా నాని ఇలా చెప్పారు. అందరూ బాలీవుడ్‌కి ట్రై చేస్తున్నారు. వెళుతున్నారు మరి మీరు వెళ్ళరా అంటే నేను వెళ్లనండీ బాలీవుడ్‌కి నేను ఇక్కడే ఉంటాను. ఒకవేళ నేను వెళ్లినా అక్కడ నన్ను ఉండనివ్వరు వాళ్ళు నన్ను తరిమేస్తారు అని చమత్కారంగా నవ్వుతూ అన్నారు. అంటే ఆయన అర్ధం ఏంటి తాను అక్కడ ఇమడలేడన్న ఆలోచనతో ఉన్నాడు నాని. గతంలో తమిళ, తెలుగు ఒకేసారి చిత్రాన్ని నిర్మించినప్పుడు చాలా ఇబ్బంది పడ్డానని అందుకే చెయ్యనన్న ఉద్దేశ్యంతో అన్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి (సి.వి.ఎం) నిర్మిస్తున్న ఈ సినిమాలో బామ్మగా లక్ష్మి, వరలక్ష్మిగా శరణ్య, ప్రియ, స్వాతి, చిన్ను అంటూ ఐదుగురు ఆడవాళ్ళూ ఉన్నారు. అనీష్ కురువిళ్ల, ప్రియదర్శి, రఘుబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం అనిరుధ్ రవిచంద్రన్ అందిస్తున్నారు. మరి మీరు కూడా ఈ ట్రైలర్ మీద ఒక లుక్ వేసెయ్యండి మరి.