C Studios Logo Launched by Thaman S S

‘సి’ స్టూడియో లోగో ఆవిష్కరించిన తమన్
దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రి తమ్ముడు మహిత్ నారాయణ్ నెలకొల్పబోతున్న ‘సి–స్టూడియోస్ (ద సోల్‌ఫుల్ మ్యూజిక్ అడ్డ)’ లోగోను ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తమన్.. చక్రితో కలిసి జర్నీ చేసిన రోజులను గుర్తుచేసుకున్నారు. ‘‘చక్రిగారి వద్దకు మేము వర్క్ చేయడానికి డబ్బు కోసం కాదు.. ఆయన ప్రేమ కోసం వచ్చేవాళ్లం.. చక్రిగారి తమ్ముడు మహిత్‌నారాయణ్ మంచి మ్యూజిక్ డైరెక్టర్‌గా రాణించాలని కోరుకుంటున్నాను. చక్రి పేరు మీద వస్తున్న సి–స్టూడియో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను” అని తెలిపారు. ఓ బ్రదర్‌గా మహిత్ నారాయణ్‌కు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. స్టూడియోను అందరూ ఆదరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లోగో ట్యాగ్ లైన్ ‘సోల్ ఫుల్ మ్యూజిక్ అడ్డ’ తనను ఎంతో ఆకట్టుకున్నదని, చక్రి కూడా అందరితో సోల్‌ఫుల్‌గా, ఆత్మీయంగా ఉండేవారని తెలిపారు. మహిత్ నారాయణ్ మాట్లాడుతూ.. టైం ఇచ్చి లోగోను ఆవిష్కరించినందుకు తమన్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. త్వరలోనే హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో స్టూడియో ప్రారంభం కాబుతున్నదన్నారు. అన్నయ్య చక్రి ఆశీస్సులతోపాటు, అందరి ఆశీస్సులు తనకు కావాలని ఆయన కోరారు. స్టూడియో పేరులోని ‘సి’లో రెండు ‘సి’లు ఉన్నాయని, ఇందులో ఒకటి అన్నయ్య చక్రి పేరు, రెండోది మెగాస్టార్ చిరంజీవి పేరు అని, వారిద్దరూ తనకు ఆదర్శమని వివరించారు