Cabinet Ministers Swearing ceremony – Raj Bhavan

కేబినెట్ విస్తరణలో భాగంగా ఆదివారం రాజ్ భవన్ లో గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ఆరుగురు నూతన మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు. హరీశ్‌రావు, కె.తారకరామారావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పాల్గొన్నారు.