• Theater Standees With Mega Star Chiranjeevi's Massiest From Waltair Veerayya Unveiled

    Theater Standees With Mega Star Chiranjeevi’s Massiest From Waltair Veerayya Unveiled Movie buffs will have a blast for the Sankranthi in 2023 as they ...
  • I am proud to write a story that increases the value of the Legislature: Author Raghavendra Reddy

    ‘శాసనసభ’ విలువను పెంచే కథ రాయడం గర్వంగా వుంది: రచయిత రాఘవేంద్ర రెడ్డి  పొలిటిక‌ల్‌ జర్నలిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించి ఆ తరువాత సినీ జర్నలిస్ట్‌గా, పీఆర్‌ఓగా, శాటిలైట్‌ కన్స్‌ల్‌టెంట్‌గా సినీ పరిశ్రమలో అందరికి ...
  • Ravi Teja First Look s Waltair Veerayya Movie

    Mass Maharaja Ravi Teja’s First Look And Teaser From Mega Star Chiranjeevi, Bobby Kolli, Mythri Movie Makers Waltair Veerayya Unveiled Movie buffs will have ...
  • Jaan Say Director S Kiran Kumar Interview

    Story Is The Main Hero Of ‘Jaan Say’.. I Am Confident That Audience Will Enjoy The Film – Director S. Kiran Kumar     ...
  • Veera Simha Reddy Second Single- Suguna Sundari’s Lyrical Video On December 15th

    andamuri Balakrishna, Gopichand Malineni, Mythri Movie Makers Veera Simha Reddy Second Single- Suguna Sundari’s Lyrical Video On December 15th God of masses Natasimha Nandamuri ...
  • ధమాకా’ రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ ఇంటర్వ్యూ   ‘ధమాకా’ మాస్ యాక్షన్ హిలేరియస్ ఎంటర్ టైనర్.. ‘రౌడీ అల్లుడు’కి మరో వెర్షన్ లా వుంటుంది:  మాస్ మహారాజా రవితేజ, కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ధమాకా’. రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్  శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ భారీగా నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఇప్పటికే విడుదలైన ధమాకా పాటలు, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. డిసెంబర్ 23న ‘ధమాకా’ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో విడుదలౌతున్న నేపధ్యంలో ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించిన ప్రసన్న కుమార్ బెజవాడ విలేఖరుల సమవేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.   ‘ధమాకా’ జర్నీ ఎలా మొదలైయింది ?  వివేక్ గారు నేను కలసి ఒక సినిమా చేయాలని అనుకున్నాం. మొదట వాళ్లకి సైన్ చేశాను. అదే సమయంలో రవితేజ గారు నా వర్క్ నచ్చి అభినందించాలని పిలిచారు. తర్వాత చాలా రోజులు సరదాగా మాట్లాడుకున్నాం. నేను ఏదీ ఆశించలేదు. కొన్ని రోజుల జర్నీ తర్వాత ..’ఏదైనా వుంటే చెప్పు.. మనం చేద్దాం’ అని రవితేజ గారు అన్నారు.  దీంతో వర్క్ చేయడం స్టార్ట్ చేశాం. మొదట ఒక ప్రాజెక్ట్ అనుకున్నాం. అయితే వేరే కారణాలు వలన అది కురలేదు. తర్వాత ధమాకా కథ చెప్పాను. ఫస్ట్ సిట్టింగ్ లోనే రవితేజ గారికి నచ్చేసింది. వెంటనే చేసేద్దామని చెప్పారు. లాక్ డౌన్ కి ముందు ఈ కథ చెప్పాను. లాక్ డౌన్ లో స్క్రిప్ట్ వర్క్ అంతా కంప్లీట్ చేశాం.     రవితేజ గారిని ద్రుష్టిలో పెట్టుకొని ఈ కథ రాసుకున్నారా ?  రవితేజ గారిని ద్రుష్టిపెట్టుకొని ఆయన కోసమే రాసుకున్న కథ ఇది. ఆయన నుండి వరుసగా సీరియస్ సినిమాలు వస్తున్నాయి. రవితేజ గారి బలం ఎంటర్ టైన్ మెంట్. మా బలం కూడా అదే.  ఇద్దరం కలసి మంచి ఎంటర్ టైనర్ చేయాలని ధమాకా చేశాం.   డబుల్ ఇంపాక్ట్ అంటే డ్యుయల్ రోల్ నా ? ...
  • ‘నారప్ప’ రెవెన్యూ మొత్తం చారిటీకి ఇస్తాం. వెంకటేష్ బర్త్ డే సందర్భంగా డిసెంబర్13న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కరోజు మాత్రమే ‘నారప్ప’ షోలు వుంటాయి: నిర్మాత సురేష్ బాబు   విక్టరీ వెంకటేష్ బర్త్ డే కానుకగా డిసెంబర్13న ‘నారప్ప’ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. వెంకటేష్ కథానాయుకుడిగా, సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ నిర్మాణంలో  శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ‘నారప్ప’ కరోనా పరిస్థితుల నేపధ్యంలో ఓటీటీలో విడుదలై బిగ్గెస్ట్ హిట్ ని అందుకుంది. అయితే ‘నారప్ప’ ని బిగ్ స్క్రీన్ పై చూడాలని ఆశపడ్డారు అభిమానులు. ఇప్పుడు ‘నారప్ప’ థియేటర్స్ లో విడుదలౌతుండటంతో అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. ఈ నేపధ్యంలో నిర్మాత సురేష్ బాబు విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.   డిసెంబర్13 వెంకటేష్ బర్త్ డే. ప్రస్తుతం బర్త్ డే రోజుల్లో అభిమానులు, ప్రేక్షకుల కోసం సినిమాలు రీరిలీజ్ ని ఒక ఈవెంట్ లా చేసి విడుదల చేయడం మంచి పరిణామం. ఈ నేపధ్యంలో ఏ సినిమా వేద్దామని ఆలోచిస్తుంటే అభిమానులు నారప్పని థియేటర్ లో చూడాలనివుందని కోరారు. దీంతో బర్త్ డే సందర్భంగా ఒక రోజు థియేటర్ లో వేస్తామని అమెజాన్ కి రిక్వస్ట్ చేశాం. దానికి వారు అంగీకరించారు. రెవెన్యూ గురించి ప్రస్తావన వచ్చినపుడు.. ఇందులో వచ్చే రెవెన్యూ మేము తీసుకోమని చెప్పాం. ఇందులోఎంత రెవెన్యూ వచ్చినా ఆ మొత్తాన్ని చారిటీకే ఇచ్చేస్తాం.   ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా చారిటీల కోసం పని చేస్తున్నాను. విజ్ఞాన జ్యోతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కోసం ఎక్కువ సమయం పని చేస్తున్నాను. పిల్లల్ని చదివిస్తే దానికి కంటే మెరుగైన అభివృద్ధి ఈదేశానికి మరొకటి వుండదని భావిస్తాను. అలాగే పర్యావరణం కోసం కూడా కొంత పని చేస్తున్నాను. ఇటివల ఒక షో కి వెళ్ళినపుడు సినిమా పరిశ్రమలో ఓ టెక్నిషియన్ కి కొంత డబ్బు చారిటీ గా ఇచ్చాం. అయితే అన్ని విభాగాలకు అసోషియేసన్స్ వున్నాయి. సంక్షేమం కంటే అందరిలో స్కిల్ ని ఎలా పెంపొందించాలనే అంశంపై ద్రుష్టి పెట్టాల్సిన అవసరం వుందని భావిస్తాను. విద్య, తగిన నైపుణ్యం మెరుగైన జీవితాన్ని ఇస్తాయి.   నారప్ప తర్వాత మీడియాని కలవలేదు. చాలా అంశాలు పై మీ అభిప్రాయాన్ని చెప్పలేదు కదా ? నిజానికి నేను తక్కువ మాట్లాడానికి ప్రయత్నిస్తాను కానీ ఎక్కువ మాట్లాడేస్తాను.(నవ్వుతూ)ప్రతి అంశంపై అందరికీ కొన్ని అభిప్రాయాలు వుంటాయి. అయితే ఇది తప్పు అది ఒప్పు అని చెప్పడానికి లేదు. ఉదాహరణకు టికెట్ల రేట్లు సమావేశానికి ఎందుకు వెళ్ళలేదని బాలకృష్ణ గారు ఒక షోలో అడిగారు ఎక్కువ టికెట్ రేట్లు పెంచకూడదని నా వ్యక్తిగత నమ్మకం. కొన్ని సినిమాలకు పెంచుతారు. అది ఇండిపెండెంట్ సినిమాకి లాభం.  కానీ ఓవరాల్ గా పెంచకూడదని నా అభిప్రాయం. మధ్యతరగతి వారికి సినిమా ఎప్పుడూ అందుబాటులో వుండాలి.  కొందరు మరో లా ఆలోచిస్తారు. అవాతర్ టికెట్లు కొన్ని మల్టిఫ్లెక్స్ లో మూడు, ఐదు వేలకు అమ్ముతున్నారు. మధ్యలో ఒకసారి మల్టీ ప్లెక్స్ లో టికెట్ ధర 70 రూపాయిలు పెట్టారు. షోలు హౌస్ ఫుల్ అయ్యాయి. దాన్ని అలాగే కంటిన్యూ చేస్తే రెవెన్యూ పెంచవచ్చు. అయితే ఇందులో ఇది తప్పు అది ఒప్పు అని చెప్పడానికి లేదు. కొన్ని సార్లు చర్చలు వ్యక్తిగతంగా కూడా మారిపోతుంటాయి. అందరినీ కలిపి ఒక తాటిపై తీసుకురావడం కష్టం. అందుకే ప్రతి కంపెనీ ఒక ఇండస్ట్రీగా మారి తన నిబంధనలు ప్రకారం నడవడానికి ప్రయత్నిస్తుంటుంది.   నారప్ప సినిమా మొదట థియేటర్లోకి రాకపోవడానికి కరోనా నే కారణమా ? లేదా మంచి ఆఫర్ వలన ఓటీటీలో విడుదల చేశారా ? కరోనా ఒక సమస్య. జనం ఎంతమంది వస్తారో అనే భయం వుండేది. ఒకవేళ జనం రాకపోతే పెద్ద మొత్తంలో నష్టం వచ్చే అవకాశం వుంది. మా పార్ట్నర్ నిర్మాత కూడా వుండటం వలన ఈ నిర్ణయం తీసుకున్నాం. ఒకవేళ కేవలం సురేష్ ప్రొడక్షన్ ఒక్కటే వుంటే.. పొతేపోనీ థియేటర్ లోనే విడుదల చేద్దామనే నిర్ణయానికి వచ్చేవాళ్ళం. వెంకటేష్ మాత్రం దృశ్యం ఓటీటీకి ఇచ్చేసినా నారప్ప మాత్రం థియేటర్ లో విడుదల చేయమని చెప్పారు. ఫ్రాఫిట్ వచ్చింది. థియేటర్ లో విడుదల చేసుంటే ఇంకా ఎక్కువ ఫ్రాఫిట్ వచ్చేదేమో. దృశ్యం 2 హిందీ రిజల్ట్ చూసిన తర్వాత ఇలా అనిపించింది.   నారప్పని ఒక్క రోజు మాత్రమే థియేటర్ లో వేయడానికి కారణం ? ఇది అమెజాన్ ఇష్యూ. నాకు పర్శనల్ రిలేషన్ షిప్ తో ఒక్క రోజు ఇచ్చారు. వాళ్ళ బిజినెస్ వాళ్లకి వుంది. అమ్మిన వారంతా ఒక రోజు అడిగి బావున్న తర్వాత మరో వారం ఇవ్వండని అడిగితే.. వాళ్ళ బిజినెస్ కూడా జరగాలి కదా.   ‘నారప్ప’ విషయంలో ఎలాంటి ఫీడ్ బ్యాక్ వచ్చింది ? వెంకటేష్ ఇలాంటి రోల్ ఎప్పుడూ చేయలేదు. ఇదే పెద్ద ఛాలెంజ్. చాలా కష్టమైన యాక్షన్. వెంకటేష్ తన పెర్ ఫార్మ్మెన్స్ పట్ల చాలా తృప్తిగా వున్నారు.   నారప్ప, దృశ్యం 2 థియేటర్స్ లోకి రాలేదు కదా.. ఏదైనా రిగ్రట్ ఉందా ? చిన్న  రిగ్రేట్ వుంది. రెండు సినిమాలు బావున్నాయి. థియేటర్స్ లో బాగా ఆడేవి. డబ్బు కూడా అంతే వచ్చేదేమో. కానీ అప్పటి కరోనా సమయంలో పరిస్థితి అందోళన కరంగా వుండేది.  ...
  • శాసనసభ చిత్రం నటుడిగా నాకు గుర్తింపు తెస్తుంది రక్తకన్నీరు నాగభూషణం మనవడు, దర్శకుడు మీర్ తనయుడు అబీద్ భూషణ్ నటిస్తున్న తాజా చిత్రం శాసనసభ. ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానున్న ...
  • కళ్యాణ్ అమ్యుస్మెంట్ పార్క్ నిర్మించడం దేవుడు ఇచ్చిన వరం. నందమూరి బాలకృష్ణ గారితో ‘రామానుజాచార్య’ని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాం: నిర్మాత సి. కళ్యాణ్ ఇంటర్వ్యూ ”నందమూరి బాలకృష్ణ గారితో ‘రామానుజాచార్య’ ...