Events
-
Dhamaka success Event New Photos
‘ధమాకా’ని మాసీవ్ బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులు, అభిమానులకు కృతజ్ఞతలు: ధమాకా మాస్ మీట్ లో ధమాకా చిత్ర యూనిట్ మాస్ మహారాజా రవితేజ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్ టైనర్ ”ధమాకా’. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ గ్రాండ్ నిర్మించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందిన ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ధమాకా’ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి మాసీవ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ధమాకా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ గా మాస్ మీట్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. మాస్ మీట్ లో మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ.. ధమాకాలో పని చేసిన టెక్నిషియన్స్ అందరికీ కంగ్రాట్స్. ఎడిటర్ ప్రవీణ్ పూడి, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర, ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ థాంక్స్. అద్భుతమైన వర్క్ చేశారు. డీవోపీ కార్తిక్ ఘట్టమనేని ఎక్స్ లెంట్ విజువల్స్ ఇచ్చారు. సినిమాలో అందరం అందంగా వున్నామంటే దానికి ప్రధాన కారణం కార్తిక్ కెమరా పనితనం. ఈ సినిమా విజయానికి మొట్టమొదటి కారణం.. మా మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరిలియో. సాలిడ్ సౌండ్ ఇచ్చాడు. ఈ సినిమా తో నెక్స్ట్ లెవల్ కి వెళ్తాడు. ధమాకా సక్సెస్ కి రెండో కారణం .. పీపుల్స్ మీడియా మీడియా ఫ్యాక్టరీ. వాళ్ళు ప్రమోట్ చేసిన విధానం, వారి పాజిటివిటీ చాలా ఆనందాన్ని ఇచ్చింది. విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు అద్భుతమైన వ్యక్తులు. చాలా పాజిటివ్ గా వుంటారు. ఈ బ్యానర్ లో చాలా సినిమాలు రావాలి సూపర్ హిట్లు కావాలి. నేను కూడా ఈ బ్యానర్ లో వరుసగా సినిమాలు చేస్తాను. బ్యానర్ అంత నచ్చింది. విశ్వప్రసాద్ , వివేక్ గారికి కంగ్రాట్స్. భరణి గారు, తులసీ గారు చమ్మక్ చంద్ర, జయరాం గారు, చిరాగ్ అందరూ అద్భుతంగా చేశారు. రావు రమేష్, ఆది ధమాకాలో మరో హైలెట్. పాత సినిమాల్లో రావు గోపాల్ రావు, రామలింగయ్య గారిలా అద్భుతంగా వినోదం పంచారు. ఈ సినిమాకి మరో ఆకర్షణ మా అందమైన హీరోయిన్ శ్రీలీల. అందం, ప్రతిభ,అభినయం అన్నీ వున్నాయి. ఇక డ్యాన్స్ ఐతే సూపర్. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే తను పెద్ద స్టార్ కాబోతుంది. ఈ విజయానికి మరో కారణం డైలాగ్ రైటర్ ప్రసన్న కుమార్. డైలాగులు అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే ఇంద్ర సినిమా స్పూఫ్ , పల్సర్ బైక్ పాట ఐడియా కూడా ప్రసన్నదే. రామజోగయ్య శాస్త్రి గారు, కాసర్ల శ్యామ్ చాల మంచి సాహిత్యాన్ని అందించారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. ధమాకా సినిమాకి డ్రైవర్ దర్శకుడు త్రినాథరావు, నేను కండక్టర్ ని(నవ్వుతూ). త్రినాథరావు, ప్రసన్న కాంబో ఎప్పుడూ హిట్టే. సెకెండ్ హ్యాట్రిక్ లోకి ఎంటర్ అయ్యారు. అదీ కొట్టేయాలి. అందరినీ ఇలానే ఎంటర్ టైన్ చేయాలి. ధమాకాకి అభిమానులు చేసిన హడావిడి ఇంతా అంతా కాదు. పండగ చేసుకొని రెండేళ్ళు అయ్యింది. మళ్ళీ ఇప్పుడు పండగ. ఇకపై పండక్కి గ్యాప్ ఇవ్వొద్దు. పండగమీద పండగ చేసుకోవాలి. మీ సపోర్ట్ ఇలానే కొనసాగాలి. అందరికీ కృతజ్ఞతలు’’ తెలిపారు. హరీష్ శంకర్ మాట్లాడుతూ… పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారికి అభినందనలు. ధమాకాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. వివేక్ గారికి కంగ్రాట్స్ ఈ మధ్య కాలంలో ఇలాంటి ప్రమోషన్స్ చూడలేదు. ధమాకాని అద్భుతంగా ప్రమోట్ చేశారు. అలాగే ఈ మధ్య కాలంలో ఇలాంటి వేడుకలు చూడలేదు. ఎందుకంటె ఈ మధ్య కాలంలో ఇలాంటి హిట్టు చూడలేదు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. రవితేజ అన్నయ్య సినిమా హిట్ అయితే నా సినిమా హిట్ అయినట్లే వుంటుంది. ధమాకాతో నలుగురు స్టార్లు అయ్యారు. త్రినాథరావు స్టార్ డైరెక్టర్ అయ్యాడు. ప్రసన్న స్టార్ రైటర్ అయ్యాడు. బీమ్స్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. శ్రీలీల స్టార్ హీరోయిన్ అయ్యింది. రవితేజ అన్నయ్య ని మాస్ మహారాజా అని పిలుచుకునే వాడిని. సుమ గారికి ఓ వేడుకలో అలా పిలవమని చెప్పాను. దాన్ని మీరంతా ముందుకు తీసుకెళ్తున్నారు. చాలా ఆనందంగావుంది. నేను ఈ స్టేజ్ లో వుండడానికి కారణం రవితేజ అన్నయ్యే. దర్శకుడి గా షాక్ తో జన్మనిచ్చి మిరపకాయ్ తో పునర్జన్మ ఇచ్చింది ఆయనే. అన్నయ్య ఒరిజినల్ పేరు రవిశంకర్ రాజు. ఈ రవి శంకర్ లేకపోతే ఈ హరీష్ శంకర్ లేడు. లవ్ యూ అన్నయ్య. కొందరు ఎంటర్ టైన్ మెంట్, పాటలు వుంటే సరిపోదని అన్నారు. అలాంటి వారందరికీ గట్టి సమాధానమే ధమాకా కలెక్షన్స్. ఇక్కడితో ధమాకా వేడుకలు మొదలౌతాయి. ఇండస్ట్రీ షాక్ అయ్యే కలెక్షన్స్ పది రోజుల్లో సంతరించుకోబోతుంది. ధమాకా టీం అందరికీ అభినందనలు. ఎన్ని ఒత్తిళ్ళు తో థియేటర్ లోకి అడుగుపెట్టిన ప్రేక్షకుడికి అన్నీ మర్చిపోయేలా చేసే వన్ అండ్ ఓన్లీ హీరో మాస్ మహారాజ్. నా మాటలు గుర్తుపెట్టుకోండి. ధమాకా సెలబ్రేషన్స్ ఈ రాత్రి నుండే మొదలౌతున్నాయి’’ అన్నారు. దర్శకుడు త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ.. తమ్ముళ్ళు.. మీకు తెలియకుండానే రోజు ధమాకాని మీతో పాటే థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తున్నాను. ధమాకా సమిష్టి కృషి. ఎంతో మంది కష్టపడితే ఈ రోజు ధమాకాని ఎంజాయ్ చేస్తున్నాం. ఇంతమంది పని చేయాలంటే ఒక శక్తి వుండాలి. ఆ శక్తి పేరు.. రవితేజ గారు . ఆయన తీసుకున్న నిర్ణయం ఇంత మందికి పని ఇస్తుంది, అన్నం పెడుతుంది. సినిమాలో భాగమైన అందరి తరపున మాస్ మహారాజా రవితేజ గారికి మరోసారి కృతజ్ఞతలు. ధమాకా ఒక్కరి విజయం కాదు .. మన అందరి విజయం. ధమాకా విజయాన్ని రవితేజ ఫ్యాన్స్ అందరికీ అంకితం చేస్తున్నాను.’’ అన్నారు. శ్రీలీల మాట్లాడుతూ.. ప్రేక్షకులు, అభిమానులే ధమాకా టైటిల్ కి న్యాయం చేయగలరని ప్రీరిలీజ్ ఈవెంట్ లో చెప్పాను. అలాగే మీరు చేశారు. అందరికీ కృతజ్ఞతలు. ఇండస్ట్రీలో ఇది నా రెండో అడుగు. పెద్ద బ్లాక్ బస్టర్ చేశారు. మీ అభిమానం ఇలానే వుండాలి. రవితేజ గారు బంగారం. నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు’’ తెలిపారు. నిర్మాత టిజి విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. ‘ధమాకా ని మాసీవ్ బ్లాక్ బస్టర్ చేసిన మాస్ మహారాజా అభిమానులకు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు. రవితేజ గారితో మరిన్ని ప్రాజెక్ట్స్ చేయాలని ఎదురుచూస్తున్నాం. త్రినాథరావు, ప్రసన్న, శ్రీలీల.. మా ప్రొడక్షన్ టీం.. ధమాకాకి పనిచేసిన అందరికీ కృతజ్ఞతలు’’ తెలిపారు కె రాఘవేంద్రరావు మాట్లాడుతూ..ఆనాడు శ్రీ కృష్ణుడు ఫ్లూటు వాయిస్తే 16 వేలమంది గోపికలు వచ్చారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కార్తికేయ 2 లో కూడా ఒక ఫ్లూట్ వుంది. ఆ ఫ్లూట్ తో ఏం ఊదారో గానీ డబ్బులే డబ్బులు (నవ్వుతూ). రవితేజ డ్రమ్ము వాయిస్తేనే ఆ రోజుల్లో అల్లరి ప్రియుడు 250 రోజులు ఆడింది. ఇప్పుడు డ్రమ్ము వాయిస్తే థియేటర్లు దద్దరిల్లిపోయాయి. దర్శకుడు త్రినాథరావు డిజైన్ చేసిన రావు రమేష్, ఆది ట్రాక్ ధమాకే కొత్త కోటింగ్ తీసుకొచ్చింది. రవితేజ ఎవర్ గ్రీన్. శ్రీలీలతో పాటు ధమాకా టీం అందరికీ కంగ్రాట్స్” తెలిపారు. ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ఈ మధ్య కాలంలో ఓటీటీలో ఎప్పుడు వస్తుందని అడగని సినిమా ధమాకా. ప్రతి వాళ్ళు థియేటర్ లో వెళ్లి ధమాకా చూస్తున్నారు. నాలుగు రేటింగు వచ్చే సినిమా రాయొచ్చు, ఐదు వందల కోట్లు వచ్చే సినిమా రాయొచ్చు. కానీ ప్రేక్షకులు తెరమీదకు వెళ్లి షర్టులు విప్పి డ్యాన్సులు చేసే మళ్ళీ ఇంలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తామేమో తెలీదు. ఈ మ్యాజిక్ కి కారణం రవితేజ అన్న ఫ్యాన్స్. ధమాకని బ్లాక్ బస్టర్ చేసింది ఆయన అభిమానులే. ఈ సినిమా అవకాశం ఇచ్చిన రవితేజ గారికి పీపుల్ మీడియాకి కృతజ్ఞతలు. ఈ యేడాది చివర్లో ఒక జెండా ఎగరబోతుంది దాని పేరు ధమాకా అని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పా. ఆ జెండాని ఎగరేసిన మీ అందరికీ కృతజ్ఞతలు’’ తెలిపారు. భీమ్స్ సిసిరిలియో మాట్లాడుతూ.. మీ అందరికీ రుణపడి వుంటాను. రవితేజ గారితో పని చేయాలనీ నేను కల మాత్రమే కన్నాను. మీరంతా కోరుకున్నారు. అందుకే ఆరేళ్ళ తర్వాత ఐసియూ లో పేషెంట్ లా వున్న నన్ను తన రెండు భుజాల మీద ఎత్తి ప్రజల సమక్షంలో ఒక జాతీయ జెండా లా ... -
18pages Movie Success Meet Photos
*2022 వెనక్కు తిరిగి చూసుకుంటే టాప్ ఫైవ్ లవ్ స్టోరీస్ లో 18 పేజెస్ ఉంటుంది – నిఖిల్* కార్తికేయ-2 వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత నిఖిల్ సిద్దార్థ్ మరియు అనుపమ ... -
Chiru Chitrapuri Colony MIG Houses Opening Photos
సినీ కార్మికులకు అండగా నేనున్నాను – మెగాస్టార్ చిరంజీవి చిత్రపురి కాలనీలో సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస ... -
Koramenu Movie Pre Release Event Photos
సినిమా ఏ ఒక్కరినీ డిసప్పాయింట్ చేయదు.. ‘కొరమీను’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో ఆనంద్ రవి ఆనంద్ రవి కథానాయకుడిగా మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో ఫుల్ బాటిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పెళ్లకూరు ... -
Lucky Lakshman Movie Pre Release Event Photos
‘Lucky Lakshman’ is a family subject that the entire family can watch: Hero Sohel at pre-release event Talented actor and Bigg Boss Telugu fame ... -
Top Gear Movie Prerelease event Photos
ఈ “టాప్ గేర్” సినిమాతో ఆది కేరీర్ బ్రేకులు లేకుండా సాగిపోవాలి..”టాప్ గేర్” ప్రి రిలీజ్ ఈవెంట్ లో హీరో సందీప్ కిషన్ సినీ అతిరధుల సమక్షంలో గ్రాండ్ గా జరిగిన ... -
Valteruveerayya Team New Pics
‘వాల్తేరు వీరయ్య’ అంచనాలకు మించి వుంటుంది. బాబీ గొప్పగా, అందంగా చూపించాడు: గ్రాండ్ గా జరిగిన ప్రెస్ మీట్ లో మెగాస్టార్ చిరంజీవి – చిరంజీవి గారితో సినిమా అంటేనే ఆ ఎక్సయిట్మెంట్ వేరు : మాస్ మహారాజా రవితేజ -మనకు ఎన్నో సార్లు థియేటర్ లో పూనకాలు ఇచ్చిన చిరంజీవి గారికి తిరిగి చిరు కానుక గా ఇస్తున్న సినిమా వాల్తేరు వీరయ్య- దర్శకుడు బాబీ కొల్లి -చిరంజీవి, రవితేజ గారి కాంబినేషన్ లో సీన్లు గూస్ బంప్స్ తెప్పిస్తాయి – నిర్మాత వై రవిశంకర్ మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ అభిమానులకు, ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు తెప్పించడానికి సిద్ధంగా ఉంది. చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ ల పాత్రల ఇంట్రడక్షన్ గ్లింప్సెస్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ ఆల్బమ్ లోని బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి పాటలు ఇప్పటికే బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. తాజాగా వచ్చిన మూడవ సింగిల్ ‘వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్’ కూడా సంచలన విజయం సాధించింది. భారీ అంచనాలు వున్న వాల్తేరు వీరయ్య జనవరి 13, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యం చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. వాల్తేరు వీరయ్య కోసం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో వేసిన భారీ సెట్ లో గ్రాండ్ గా జరిగిన ఈ ప్రెస్ మీట్ లో… మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ తో పాటు చిత్ర యూనిట్ పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ఈ ప్రెస్ మీట్ చూస్తుంటే ఇదే ఒక ప్రీరిలీజ్ ఈవెంట్ లా వుంది. చాలా అద్భుతంగా వుంది. వాల్తేరు వీరయ్య సినిమాని అందరూ ప్రేమతో చేశారు. ఆ ప్రేమ వాల్తేరు వీరయ్య ప్రతి ఫ్రేమ్ లో ప్రతిబింబిస్తుంది. దర్శకుడు బాబీ కథ చెప్పినపుడు వినగానే నచ్చింది. ఇందులో కంటెంట్ బావుంది. కథపై వర్క్ చేసుకొని రమ్మన్నాను. బాబీ కథపై వర్క్ చేసుకొని వచ్చారు. మొత్తం వినగానే ఆ రోజే ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పాను. అదే నమ్మకంతో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఇంత భారీ బడ్జెట్ తో సినిమాని నిర్మించడం ఆనందంగా వుంది. మనల్ని ఎలా చూపిస్తే బావుంటుందో అభిమానికే బాగా తెలుసు. అలాంటి అభిమాని దర్శకుడు గా వస్తే తప్పకుండా సినిమా చేయాలని ఒక సినియర్ హీరో చెప్పిన మాట నాలో ఎప్పటినుండో నాలో నాటుకుపోయింది. బాబీ, వాళ్ళ నాన్నగారు ఎంత హార్డ్ కోర్ ఫ్యాన్సో నాకు తెలుసు. బాబీ ఈ కథతో వచ్చినపుడు తప్పకుండా గొప్పగా తెరపై ఆవిష్కరిస్తాడనే నమ్మకం. ఆ నమ్మకం ఈ రోజు నిజమైయింది. ఇప్పుడే సినిమా చూసి వస్తున్నాను. చాలా గొప్పగా అందంగా చూపించాడు బాబీ. గొప్ప ఎమోషనల్ జర్నీ. బాబీ కి అడ్వాన్స్ కంగ్రాట్స్. వాల్తేరు వీరయ్యపై ఎన్ని అంచనాలు పెంచుకున్నా దానికి మించే వుంటుంది. వాల్తేరు వీరయ్య సమిష్టి కృషి. నాతో సినిమా అంటేనే దేవిశ్రీ ఎక్సయింట్ మెంట్ వేరు. ఇందులో అన్నిపాటలు అద్భుతంగా ఇచ్చాడు. మాస్ , క్లాస్, హృదయాన్ని కట్టిపడేసి పాటలు అన్నీ ఇందులో వున్నాయి. ఇందులో కొన్ని ఎమోషనల్ సీన్స్ కంటతడి పెట్టిస్తాయి. చంద్రబోస్ చక్కని సాహిత్యం అందించారు. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఎక్స టార్దీనరీ వర్క్ చేశారు. అలాగే పీటర్ హెయిన్స్ కూడా ఎక్స్ లెంట్ వర్క్ చేశారు. ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ చాలా వండర్ ఫుల్ వర్క్ చేశారు. శేఖర్ మాస్టర్ నా బాడీ లాంగ్వేజ్ ని పట్టేశారు. ఇందులో గ్యాంగ్ లీడర్ రోజులని గుర్తు చేసే కొన్ని మూమెంట్స్ అద్భుతంగా కంపోజ్ చేశారు. పాటలన్నీ అద్భుతంగా వచ్చాయి. మా డీవోపీ ఎక్స్ లెంట్ వర్క్ చేశారు. ఫైటర్స్ తో కలసి ఎలాంటి డూప్ లేకుండా పని చేస్తున్నపుడు మా డీవోపీ ఆశ్చర్యపోయారు. ఇలా ఏ హీరో చేయరని చెప్పారు. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలీదు కానీ నాకు తెలిసిన విధానం ఇదే అని చెప్పాను. ఊర్వశి అద్భుతంగా ఫెర్ ఫార్మ్ చేసింది. బాస్ పార్టీ పాట కూడా జనాల్లోకి వెళ్ళిపోయింది. శ్రుతి హాసన్ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేసింది. సినిమాలో చాలా బ్యూటీఫుల్ గా వుంటుంది. సినిమా కోసం అందరూ ప్రేమతో పని చేశారు’’ అన్నారు. మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ.. చిరంజీవి గారికి నేను పెద్ద ఫ్యాన్ ని. అన్నయ్య తో సినిమా చేసినప్పుడు ఆ ఎక్సయిట్ మెంట్ వేరుగా వుంటుంది. బాబీ చెప్పిన కథ అద్భుతంగా వుంది. వాల్తేరు వీరయ్య ఓ పండగలా వుంటుంది’’ అన్నారు. దర్శకుడు బాబీ కొల్లి మాట్లాడుతూ.. చిరంజీవి గారితో సినిమా చేస్తున్నపుడు మన అభిమానం, ప్యాషన్ ఇవన్నీ పక్కన పెట్టిసి.. మనం ఆరాధించే దేవుడు, శక్తి, వ్యక్తి మన కళ్ళ ముందు వున్నపుడు సినిమాలో ఏం పెట్టాలో అన్నీ ఇందులో పెట్టేశాం. అన్నయ్య నన్ను ఓ తమ్ముడిలా చేయిపట్టి నడిపించారు. ఆయన కారణంగానే అద్భుతమైన కథ రెడీ అయ్యింది. సెకండ్ హాఫ్ మీద పని చేస్తున్నపుడు రవితేజ గారి లాంటి ఒక పాత్ర వుందని అన్నయ్య కి చెబితే.. ‘’బావుంది ఇదే చేస్తున్నాం’ అన్నారు. హ్యాట్సప్ టు యూ అన్నయ్య. కథ మొత్తం లాక్ అయిన తర్వాత రవితేజ గారికి చెప్పాను. కథ వినగానే సినిమాలో జాయిన్ అయిన రవితేజ గారికి కృతజ్ఞతలు. ఇలాంటి ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్స్ ని ఇచ్చిన మైత్రీ మూవీ మేకర్స్ కి కృతజ్ఞతలు. శ్రుతి హాసన్ పాత్ర అద్భుతంగా వుంటుంది. కేథరిన్ కూడా చక్కగా చేసింది. దేవిశ్రీ ప్రసాద్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చారు. విల్సన్ గారు వండర్ పుల్ డీవోపీ అందించారు. ప్రకాష్ గారు అద్భుతమైన ఆర్ట్ వర్క్ ఇచ్చారు. రామ్ లక్ష్మణ్ మాస్టర్ ఎక్స టార్డీనరీ ఫైట్స్ ఇచ్చారు. బోస్ గారు అద్భుతమైన లిరిక్స్ ఇచ్చారు. బాస్ పార్టీ సాంగ్ లో ఊర్వశి అద్భుతమైన ఫెర్ ఫార్మ్ చేసింది. శేఖర్ మాస్టర్ చిరంజీవి గారి గ్రేస్ కి తగ్గట్టు పాటలకు కొరియోగ్రఫీ ఇచ్చారు. డ్యాన్సులని ఫ్యాన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. రైటింగ్ డిపార్ట్ మెంట్ కి థాంక్స్. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. వాల్తేరు వీరయ్య మాస్ జాతర. మెగాస్టార్ వార్ కి వస్తే ఎలా వుంటుందో శంఖం ఊదితే ఎలా గూస్ బంప్స్ వస్తాయో .. ఒక ఎనిమిది నిమిషాల పాటు థియేటర్ మొత్తం పూనకాలని ఊరికే ట్యాగ్ పెట్టలేదని గట్టి నమ్మకంతో చెబుతున్నాను. పూనకాలు లోడింగ్ హైప్ కోసం పెట్టింది కాదు. మనకు ఎన్నో సార్లు పూనకాలు ఇచ్చిన అన్నయ్య కి తిరిగి చిరు కానుక గా ఇస్తున్న సినిమా ఇది’’ అన్నారు. నిర్మాత వై రవిశంకర్ మాట్లాడుతూ.. జీవితంలో ఇదో గొప్ప అవకాశం. మెగాస్టార్ చిరంజీవి గారు వేదికపై వుండగా మాట్లాడే అవకాశం రావడం వ్యక్తిగతంగా నాకు పెద్ద విజయం. అలాగే ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ గారిని సంప్రదించిన వెంటనే మరో ఆలోచన లేకుండా ‘అన్నయ్య సినిమా నేను చేస్తా’అని చెప్పిన మాస్ మహారాజ రవితేజ గారికి కృతజ్ఞతలు. చిరంజీవి, రవితేజ గారి కాంబినేషన్ లో కొన్ని సీన్లు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. నెక్స్ట్ లెవల్ లో వుంటాయి. శ్రుతి హాసన్ గారు ఇందులో అద్భుతంగా కనిపిస్తారు. బాస్ పార్టీ సాంగ్ లో చేసిన ఊర్వశి రౌతేలా కూడా చక్కగా వుంది. ఇందులో ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, నాజర్..లాంటి పెద్ద కాస్టింగ్ వుంది. బాబీ గారు బెస్ట్ టీం సెలెక్ట్ చేసుకున్నారు. సంక్రాంతి లాంటి పండక్కి ఎక్కడా రాజీ పడకుండా అద్భుతమైన గొప్ప సినిమా ఇచ్చినందుకు దర్శకుడు బాబీ గారికి చాలా థాంక్స్. ప్రకాష్ గారు అద్భుతమైన సెట్స్ వేశారు. విల్సన్ గారు, శేఖర్ మాస్టర్, రామ్ లక్ష్మణ్ మాస్టర్ అందరూ అద్భుతంగా చేశారు. దేవిశ్రీ ప్రసాద్ గారు ఈ చిత్రానికి నాలుగో పిల్లర్. మైత్రీ విజయంలో దేవిశ్రీ ఒక మెయిన్ పిల్లర్. మా సినిమాలన్నిటికీ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరున కృతజ్ఞతలు. మాస్ మహారాజ గారి ధమాకా చిత్రం బ్లాక్ బస్టర్ విజయం అవ్వడం మాకు ఎంతో సంతోషంగా వుంది. వాల్తేరు వీరయ్యలో ఆయన విశ్వరూపం చూస్తారు. ఇంద్ర సినిమా పాటలకి ఎంత పెద్ద పేరు వచ్చిందో ఆ పాటల రిక్రియేషనే మా వాల్తేరు వీరయ్య. గ్యాంగ్ లీడర్ సినిమాలో చిరంజీవి గారు ఎంత అందంగా వున్నారో దానికి రెండు రెట్ల అందంగా వాల్తేరు వీరయ్యలో వున్నారు. వాల్తేరు వీరయ్య కంటెంట్ ఎక్స్ టార్డీనరీ గా వుంటుంది.” అన్నారు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. వాల్తేరు వీరయ్య కంటెంట్ విన్నప్పుడు మళ్ళీ మెగా హిట్ అనిపించింది. ఇదో అద్భుతమైన సినిమా అనడానికి కారణం.. ఏ పాత్రలు ఎవరు వెయ్యాలో వాళ్ళే వేశారు. ఎక్స్ టార్డీనరీ క్యారెక్టరైజెన్స్. సంక్రాంతికి నిజమైన పండగ వాల్తేరు వీరయ్య. అందరూ ఎక్స్ టార్డీనరీ గా పని చేశారు. సినిమా పరిశ్రమలో నాకు మిత్రుడని చెప్పగలిగే ఏకైక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. ఆయనతో మళ్ళీ పని చేసే అవకాశం ఇచ్చిన బాబీకి కృతజ్ఞతలు. మైత్రీ మూవీ మేరక్స్ తో మళ్ళీ పని చేయడం అనందంగా వుంది.’’ అన్నారు. ...