Chief Minister K Chandrasekhar Rao went to Somajiguda Yashoda Hospital

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వైద్య పరీక్షల నిమిత్తం సోమాజిగూడ యశోద హాస్పిటల్ కు వెళ్లారు. ముఖ్యమంత్రికి యాంజియోగ్రామ్, సిటీ స్కాన్‌తో పాటు ఇతర వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం ముఖ్యమంత్రి అధికార నివాసం ప్రగతి భవన్ కు చేరుకున్నారు. సిఎం కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, కుమారుడు కేటీఆర్, మనుమడు హిమాన్షు, కూతురు కవిత, అల్లుడు అనిల్, మంత్రి హరీశ్‌రావు, ఎంపీ సంతోష్ కుమార్‌తో పాటు పలువురు ఉన్నారు