Chief Minister K. Chandrasekhar Rao’s Pragati Bhavan

నిజామాబాద్ నగరంలో మౌలిక వసతులను మరింతగా మెరుగుపరచడం, ప్రజలకు సౌకర్యవంతంగా అన్ని రంగాలను అభివృద్ధి పరిచి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడం ..అనే అంశాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు ప్రగతి భవన్ లో ఆదివారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సత్వరమే పనులు పూర్తి చేయాలని ఈ సందర్భంగా సీఎం పలు ఆదేశాలు జారీ చేశారు