Crore of sarees for Batukamma fest

కోటి బతుకమ్మ చీరలు
తెలంగాణ ఆడ పడుచులు ఎప్పుడెప్పుడా అని ఎదరుచూసే బతుకమ్మ పండుగ రానే వస్తోంది. ఇక, బతుకమ్మ పండుగను పురస్కరించుకొని ప్రతీ ఏడా మహిళలకు తెలంగాణ సర్కార్ చీరలు పంపిణీ చేస్తుండగా.. ఈ ఏడాది 1.02 కోట్ల మంది మహిళలకు ఉచితంగా చీరలను అందజేయాలని నిర్ణయించారు. సెప్టెంబర్ 28వ తేదీ నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభం కానుండగా.. 23వ తేదీన చీరల పంపిణీ ప్రారంభించి.. 27వ తేదీ లోగా పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
మాసబ్‌ట్యాంక్‌లో ఉన్న సీడీఎంఏ కార్యాలయంలో బతుకమ్మ చీరల ప్రదర్శన గురువారం జరిగింది. ప్రదర్శనను మంత్రి కేటీఆర్ సందర్శించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ… 24 వేల పైచిలుకు మగ్గాలు పనిచేసి 100 డిజైన్లతో కోటి చీరలు జిల్లాలకు సరఫరా చేసి 23వ తేదీ నుంచి పంపిణీకి అధికారులు సిద్ధం చేశారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సరం కోటి చీరలను పంపిణీ చేస్తామని ఆయన వెల్లడించారు. గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పంపిణీ కార్యక్రమాలను ప్రారంభిస్తారని వెల్లడించారు. 18 సంవత్సరాలు పైబడి తెల్లరేషన్ కార్డు కలిగి ఉన్న ఆడ బిడ్డలందరికీ చీరలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. బతుకమ్మ చీరలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.313 కోట్లు ఖర్చు చేసింది. బతుకమ్మ చీరలతో నేతన్నలకు ఉపాధి కల్పిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సరం కోటి చీరలను పంపిణీ చేస్తామని ఆయన వెల్లడించారు. బతుకమ్మ చీరలతో చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నామని, 10 లక్షల వరకు 9 మీటర్ల చీరలు.. 6 మీటర్లతో 90 లక్షల చీరలు తయారు చేసినట్లు వెల్లడించారు. అంతేగాక బతుకమ్మ చీరలు మార్కెట్లో సైతం దొరికేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి కేటీఆర్పేర్కొన్నారు.
చీరల నాణ్యతలోనూ ప్రభుత్వం రాజీపడడంలేదని .. నాణ్యతతో పాటు సరికొత్త డిజైన్లలో చీరలను తయారు చేస్తున్నారని. దాదాపు వంద డిజైన్లలో బతుకమ్మ చీరలను తయారు చేస్తుండగా.. ఒక్కో చీరకు సగటున రూ.280 ఖర్చు చేస్తున్నారని అన్నారు.ఇదివరకు మరమగ్గ కార్మికులకు నెలకు రూ.8వేల నుంచి రూ.12వేలు మాత్రమే వచ్చింది. బతుకమ్మ చీరల తయారీ కారణంగా నెలకు రూ.16వేల నుంచి రూ.20వేల దాకా వస్తోంది. ఈ మంచి ఉద్దేశంతో ప్రభుత్వం మూడేళ్ల కిందట ఈ కార్యక్రమం ప్రారంభించింది. రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన యువతులు, మహిళలకు చీరలు ఇస్తోంది. ఈ ఏడాది కోటి 2వేల మందికి ఇవ్వబోతోంది. మొత్తం 16000 కుటుంబాలు, 26000 మర మగ్గాల్ని వాడి… ఈ చీరల్ని తయారుచేశాయి.
ఇక మరి ఇదిలా ఉంటే… గత ఏడాది ఇచ్చిన బతుకమ్మ చీరల మీద చాలానే విమర్శలు వచ్చాయి. ఇలాంటి చీరలు కట్టి కవితమ్మ బతుకమ్మ ఆడుద్దా అని కొందరు ఆడవాళ్లు ఏకంగా పాటకూడా పాడి మరి చూపించారు. మరి ఈ ఏడాది దీని పై సర్కారు జాగ్రత్తలు బానే తీసుకుంది కాని మరి అవి తీసుకున్నాక ప్రజల అభిప్రాయం ఎలా ఉంటుందో వేచి చూడాలి. నాణ్యత, చీర రంగులు వాటన్నిటి పై ఎలాంటి స్పందన వస్తుందీ ఆ చీరల సంగతేంటో మరో రెండు రోజుల్లో తెలుస్తుంది.