Danda Kadial Song Lyrical Video Release from Dhamaka
Lyrical Video Of Dandakadiyal Song From Mass Maharaja Ravi Teja, Trinadha Rao Nakkina, TG Vishwa Prasad’s “DHAMAKA” Released
Mass Maharaja Ravi Teja and Trinadha Rao Nakkina’s mass action entertainer Dhamaka is going to be a musical hit, before the release of the movie. Music director Bheems Ceciroleo scored an album consisting of different tunes. The album has class as well as mass beats. Today, they released the much-hyped fifth song Dandakadiyal.
Bheems Ceciroleo has once again proved that he is too good at composing mass and folk numbers. Already the movie has a chartbuster folk number Jinthaak which is close to 40 million views. Dandakadiyal is going to be another sensational song from the movie.
Bheems scored, sang and also penned lyrics for this oora mass folk number. Alongside him, Sahithi Chaganti and Mangli crooned the song enthusiastically. The visuals are also so pleasing and Ravi Teja’s dances are an eye-feast, wherein Sreeleela tried to match his grace and energy. Particularly, the mass moves on the cot are next level. Choreography for the song was done by Jani master.
The movie is produced lavishly by TG Vishwa Prasad. Vivek Kuchibhotla is the co-producer of the movie being made under the banners- People Media Factory & Abhishek Aggarwal Arts.
Prasanna Kumar Bezawada has penned the story, screenplay, and dialogues for the film, while Karthik Ghattamaneni handles the cinematography.
The movie is slated for a grand release worldwide on December 23rd.
Cast: Ravi Teja, Sreeleela
Technical Crew:
Director: Trinadha Rao Nakkina
Producers: TG Vishwa Prasad
Banners: People Media Factory, Abhishek Aggarwal Arts
Co-Producer: Vivek Kuchibhotla
Story, Dialogues: Prasanna Kumar Bezawada
Music Director: Bheems Ceciroleo
Cinematography: Karthik Ghattamaneni
Fights: Ram-Lakshman
Production Designer: Srinagendra Tangala
PRO: Vamsi Shekar
మాస్ మహారాజా రవితేజ, త్రినాధరావు నక్కిన, టిజి విశ్వ ప్రసాద్ ల “ధమాకా” నుండి దండ కడియాల్ సాంగ్ లిరికల్ వీడియో విడుదల
మాస్ మహారాజా రవితేజ , త్రినాథరావు నక్కిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ధమాకా సినిమా విడుదలకు ముందే మ్యూజికల్ హిట్ అయ్యింది. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో విభిన్న ట్యూన్ లతో కూడిన ఆల్బమ్ ను స్కోర్ చేశాడు. ఆల్బమ్ లో క్లాస్, మాస్ బీట్స్ ఉన్నాయి. ఈ రోజు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐదవ పాట ‘దండ కడియాల్ ‘ను విడుదల చేశారు.
భీమ్స్ సిసిరోలియో మాస్ , ఫోక్ నెంబర్స్ ని కంపోజ్ చేయడంలో తన మార్క్ ని మరోసారి నిరూపించుకున్నాడు. ఇప్పటికే ఈ చిత్రంలో చార్ట్‌బస్టర్ ఫోక్ నంబర్ గా జింతాక్ పాట నిలిచింది. ఇది దాదాపు 40 మిలియన్ల వ్యూస్ ని సాధించింది. దండకడియాల్ సినిమాలోని మరో సెన్సేషనల్ సాంగ్ కానుంది.
ఈ ఊర మాస్ ఫోక్ నెంబర్ ని భీమ్స్ స్కోర్ చేసి పాడటమే కాకుండా సాహిత్యం కూడా రాశారు. అతనితో పాటు సాహితీ చాగంటి, మంగ్లీ ఈ పాటను ఉత్సాహంగా పాడారు. విజువల్స్ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి. రవితేజ డ్యాన్స్‌లు కన్నుల పండువగా ఉన్నాయి, ఇందులో శ్రీలీల రవితేజ గ్రేస్, ఎనర్జీని మ్యాచ్ చేయడానికి ప్రయత్నించింది. ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.
టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత.
ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే , సంభాషణలు అందించగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు.
డిసెంబర్ 23న ‘ధమాకా’ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో విడుదల కానుంది.
తారాగణం: రవితేజ, శ్రీలీల
సాంకేతిక విభాగం:
దర్శకత్వం: త్రినాధరావు నక్కిన
నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్
బ్యానర్లు: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
కథ, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగాల
పీఆర్వో: వంశీ-శేఖర్