Dhamaka Author Prasanna Kumar Bejawada Interview

ధమాకా’ రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ ఇంటర్వ్యూ
‘ధమాకా’ మాస్ యాక్షన్ హిలేరియస్ ఎంటర్ టైనర్.. ‘రౌడీ అల్లుడు’కి మరో వెర్షన్ లా వుంటుంది:
మాస్ మహారాజా రవితేజ, కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ధమాకా’. రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ భారీగా నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఇప్పటికే విడుదలైన ధమాకా పాటలు, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. డిసెంబర్ 23న ‘ధమాకా’ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో విడుదలౌతున్న నేపధ్యంలో ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్లే, సంభాషణలు అందించిన ప్రసన్న కుమార్ బెజవాడ విలేఖరుల సమవేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
‘ధమాకా’ జర్నీ ఎలా మొదలైయింది ?
వివేక్ గారు నేను కలసి ఒక సినిమా చేయాలని అనుకున్నాం. మొదట వాళ్లకి సైన్ చేశాను. అదే సమయంలో రవితేజ గారు నా వర్క్ నచ్చి అభినందించాలని పిలిచారు. తర్వాత చాలా రోజులు సరదాగా మాట్లాడుకున్నాం. నేను ఏదీ ఆశించలేదు. కొన్ని రోజుల జర్నీ తర్వాత ..’ఏదైనా వుంటే చెప్పు.. మనం చేద్దాం’ అని రవితేజ గారు అన్నారు. దీంతో వర్క్ చేయడం స్టార్ట్ చేశాం. మొదట ఒక ప్రాజెక్ట్ అనుకున్నాం. అయితే వేరే కారణాలు వలన అది కురలేదు. తర్వాత ధమాకా కథ చెప్పాను. ఫస్ట్ సిట్టింగ్ లోనే రవితేజ గారికి నచ్చేసింది. వెంటనే చేసేద్దామని చెప్పారు. లాక్ డౌన్ కి ముందు ఈ కథ చెప్పాను. లాక్ డౌన్ లో స్క్రిప్ట్ వర్క్ అంతా కంప్లీట్ చేశాం.