Different ways for different things…. Honey baby…?
దేనిదారి దానిదే అంటున్న హని బేబి
‘కృష్ణగాడి వీరప్రేమగాథ, మహానుభావుడు, రాజా ది గ్రేట్’’ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌లు ఖాతాలో వేసుకుంది మెహ్రీన్. ఆ ఎఫెక్ట్ తోనే అమ్మడు మరిన్ని ఆఫర్స్ అందిపుచ్చుకొని సినిమా వెంట సినిమాని ట్రాక్‌లో పెట్టింది. ఈ క్రమంలోనే మెహ్రీన్‌కు జవాన్, కేరాఫ్ సూర్య రూపంలో రెండు పరాజయాలు ఎదురయ్యాయి. అయినా సరే మెహ్రీన్ ‘‘పంతం, నోట’’ చిత్రాల్లో కథానాయికగా కన్ఫర్మ్ అయింది.
తాను కష్టంతో పాటు విధిని కూడా బాగా నమ్ముతానని అంటోంది కథానాయిక మెహ్రీన్. ‘చిన్నప్పుడు ఎక్కువగా ప్రాక్టికల్ గానే ఉండేదాన్నని. అయితే, తర్వాత కాలంలో అనుకోకుండా నేను ఆర్టిస్టుని కావడం.. ఈ సక్సెస్.. ఇవన్నీ చూశాక కచ్చితంగా విధిని కూడా నమ్మడం మొదలుపెట్టాను. మనకి ఎలా రాసి వుంటే అలా జరుగుతుందన్న విషయాన్ని బలంగా నమ్ముతున్నాను. అలాగని కష్టపడకుండా మాత్రం ఉండను. దేని దారి దానిదే’ అని చెప్పింది.
ఇలా రవితేజ, సాయి ధరమ్ తేజ్, గోపీచంద్, శర్వానంద్, వరుణ్ తేజ్ వంటి యంగ్ హీరోలతో వరుస సినిమాలు చేసిన మెహ్రిన్, ఆ తర్వాత నటించిన సినిమాలు వరుసగా ప్లాపులు అవడంతో టాలీవుడ్ ఐరెన్‌లెగ్ హీరోయిన్ అన్న ముద్ర కూడా వేయించుకుంది. ఈ ఏడాది ఆరంభంలో వెంకీ, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ కాంబినేషన్లో వచ్చిన ఎఫ్ -2 సినిమా సూపర్ హిట్ అవ్వడంతో మెహ్రీన్‌కు క్రేజ్ వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఎఫ్-2 హిట్ అయినా మెహ్రీన్ దశ మారలేదు. గోపీచంద్ సరసన ఒక సినిమా, నాగ శౌర్య సరసన ఐరా క్రియేషన్స్‌లో మరో సినిమాలో మెహ్రీన్ నటిస్తోంది. కానీ ఎఫ్ 2 పుణ్యమా అని ఆమె రేటు మాత్రం పెంచేసింది. ఇంతకు ముందు వరకు సినిమాకు 50 లక్షలు డిమాండ్ చేసే ఆమె ఇప్పుడు మరో 30 లక్షలు పెంచి మొత్తం 80 లక్షలు డిమాండ్ చేస్తోందట.