Director Bobby Interview Photos
ఇవాళ బాగుంది అంటే రేపు వంద క్వశ్చన్ లతో దిగుతాడు ఆయన – రవీంద్ర బాబీ
విక్టరీ వెంకటేష్, అక్కినేనీ నాగచైతన్య కాంబినేషన్ లో దర్శకుడు రవీంద్ర బాబీ దర్శకత్వంలో లో వస్తున్న చిత్రం “వెంకీమామ” డిసెంబర్ 13న రిలీజ్ కి సిద్ధంగా ఉంది,ఈ సందర్భంగా దర్శకుడు బాబీ మీడియాతో మాట్లాడారు.
జై లవకుశ టైమ్ లో కొన్ని స్క్రిప్ట్ లు అనుకుంటే కోన వెంకట్ గారు వచ్చి,బాబీ వెంకటేష్ గారు ,చైతూ కాంబినేషన్ లో సినిమా సురేష్ బాబు గారు సినిమా అనుకుంటున్నారు వాళ్లదగ్గర ఒక పాయింట్ ఉంది వెళ్ళు విని అని చెప్పినప్పుడు.వాళ్ళ దగ్గర లైన్ ఉంటే వద్దులెండి సర్ నా పాయింట్ తో వెళ్తాను అని చెప్పాను,
పాయింట్ ఉంది ఒకసారి వెళ్ళు విను నచ్చితే చెయ్,లేకపోతే నో చెప్పేయ్ అని చెప్పిన్నప్పుడు వెళ్లి వినగానే నాకు ఆ కాంబినేషన్ నచ్చింది బట్ ఆ కథ ఏటో వెళ్ళిపోతుంది,బాగాలేదు అని చెప్తే ఫీల్ అవుతారని ఏమి చెప్పకుండా బయట తప్పించుకుని తిరుగుతున్న,ఒక రోజు సురేష్ బాబు గారు కాల్ చేసి మాట్లాడగానే,
ఆ పాయింట్ మీద నా రైటర్స్ తో వర్క్ చేసినప్పుడు కంప్లీట్ గా ఒక వేరే కథ వచ్చింది అది సురేష్ బాబు గారికి చెప్పినప్పుడు బాగా నచ్చింది.
ఆయన బాగుంది అని చెప్పితే నెక్స్ట్ డే ఒక 100 క్వశ్చన్ ల తో దిగుతాడు అని ఆయనతో స్టార్ట్ చేసిన తర్వాత అర్థమైంది.
ఆయన లాజిక్ లేకుండా ఏది అడిగేవారు కాదు,చాలా పాజిటివ్ గా ఉండేది ఆయనతో డిస్కషన్.
సినిమా బాక్డ్రాప్ సీరియస్ గా ఉంటుందా.?
సీరియస్ గా ఏముండదు అండి,కంప్లీట్ ఫన్ ,ఏమోషన్,మాస్ ఎలివెంట్స్ అని సమానంగా ఉంటాయి.
ఇద్దరూ మామా-అల్లుళ్లు ను డీల్ చేశారు ఏమనిపించింది.?
అది ఒక బాధ్యత అని చెప్పొచ్చు అండి,ఇది రామానాయుడు గారి డ్రీమ్ అని దిగిన తర్వాత తెలిసింది. సురేష్ బాబు గారు ఈ మాట చెప్పినప్పుడు ఆ రాత్రి ఒక హై వచ్చింది.
ప్రతీది లాస్ట్ మినిట్ లో ఒకే అయింది అని చైతన్య గారు చెప్పారు,ఓన్లీ హీరోహిన్స్ విషయంలోనేనా ఇంకేమైనా.?
సురేష్ బాబు గారు మాకు ఒక హెడ్ మాస్టర్ లాగా,చాలా క్వశ్చన్ లు వేస్తారు ఆన్సర్స్ మనం చెప్పాలి,ఏదైనా చేసేముందు వీపరితమైన డౌట్ ఉంటుంది,అందువలన కొంచెం డీలే అవుతుంది, ఫైనల్ గా ఆ డీలే మనకు అంతా మంచే జరుగుతుంది.
సురేష్ బాబు గారితో సఫర్ అయ్యారు.?
లేదు,ఎంజాయ్ చేసాను,ఆయనకున్న ఎడ్యుకేషన్ వలన స్మూత్ గా ఉంటుంది ఆయన ట్రీట్మెంట్ మనతో పాటు తెలివిగా ఒక రైటర్ లా కూర్చుని తెలివిగా ఒక ప్రశ్న వేసేసి మనవైపు చూస్తుంటారు.అలా ఉంటుంది ఆయనతో జర్నీ,నేను చాలా నేర్చుకున్న ఆయన దగ్గర నుండి.
ఈ సినిమా నాగార్జున గారు చూసారా,ఎప్పుడైనా సెట్స్ లోకి వచ్చారా.?
చూడలేదు అండి,చూపిస్తాం,ఆడియన్స్ కంటే ముందే చూస్తారు,ఎప్పుడు సెట్స్ కి రాలేదు,ఈ సినిమాకే చైతు చేస్తున్న ఏ ఫిల్మ్ కి కూడా ఆయన ఇన్వాల్ అవ్వరు అంట.
మీ కెరియర్ ఎలా ఉంది అండి.?
చాలా హ్యాపీగా ఉంది ఉండి, రైటర్ గా మొదలు పెట్టి ఇప్పటివరకు మంచి ప్రాజెక్ట్స్ చేసాను చాలా హ్యాపీ.
కాశ్మీర్ లో షూట్ చేశారు కదా అంత కీలకమైన సీనా.?
కథలో రాసుకున్నప్పుడే కాశ్మీర్ అని రాసుకున్నాం, అక్కడ మంచి పీపుల్ తగిలారు,వాళ్ళ సపోర్ట్ తోనే అక్కడే ఒక ఇంపార్టెట్ సీక్వెన్స్ చేసాం.
థమన్ బాగా ఎమోషనల్ ఫీల్ అయ్యా అని చెప్పారు ఈ సినిమా గురించి.?
ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చూపించినప్పుడు బాగా నవ్వాడు,సెకండాఫ్ చూపించగానే ఒక 5 నిమిషాలు నన్ను మాటలతో పొగిడి నన్ను పట్టుకుని ఏడ్చాడు.
సురేష్ బాబు గారు ఫ్యామిలీ ఎలా ఫీల్ అయ్యారు.?
ఈ సినిమాలో ఇప్పటివరకు ఈ ఫ్రేమ్ తియ్యమని,ఈ ఫ్రేమ్ యాడ్ చెయ్యమని చెప్పలేదు,
దగ్గుపాటి ఫ్యామిలీ కి,అక్కినేని ఫ్యామిలీ మంచి గిఫ్ట్ ఈ సినిమా,మామా-అల్లుళ్లు ఏమోషన్స్ ప్లస్ ఈ సినిమాకి.