Director T.Santhosh Interview photos
నాకు వేరే లాంగ్వేజ్ లో కూడా సినిమాలు వచ్చాయి కానీ నేను చేయలేదు- టి.ఎన్ సంతోష్
నిఖిల్ సిద్దార్థ్ ,లావణ్య త్రిపాఠి జంటగా నటించిన అర్జున్ సురవరం రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ ను సంపాదించుకుంది.ఈ సందర్భంగా డైరెక్టర్ టి.ఎన్. సంతోష్ మీడియా కృతజ్ఞతలు తెలుపుతూ మాట్లాడారు.
తెలుగు సినిమా చేశారు కదా తెలుగు నేర్చుకోలేదా.?
తెలుగు బాగా అర్ధమవుతుంది, కానీ ఇంత గొప్ప భాషను మాట్లాడుతూ నాశనం నాకు ఇష్టం లేదు,నాకు చెన్నయ్ కంటే కూడా హైదరాబాద్ చాలా ఇష్టం.ఇక్కడ పీపుల్ సినిమా టీం అంతలా నచ్చింది.నిఖిల్ ప్రొడ్యూసర్ మంచి సపోర్ట్ చేశారు.
ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు నిఖిల్ ఒక చాక్లెట్ బాయ్ లా ఉన్నాడు ఈ సినిమాని క్యారీ చెయ్యగలడా అనుకున్నాను కానీ స్క్రీన్ మీద చూసినప్పుడు అలాంటి డౌట్స్ ఏమి లేవు చాలా బాగా చేసాడు,ఈ సినిమా కోసం 15 kgs పెరిగాడు.
నాకు తెలుసు సినిమా ఎలా ఉంటే తెలుగు ఆడియన్స్ లవ్ చేస్తారు అని,
మిగతా వాటితో పోలిస్తే పైరసీ ఇక్కడే తక్కువగా ఉంటుంది.
సినిమా కూడా అక్కడ 100 కోట్లు సాధిస్తే ఇక్కడ 200 కోట్లు సాధిస్తుంది.
నాకు వేరే లాంగ్వేజ్ లో కూడా సినిమాలు వచ్చాయి కానీ నేను చేయలేదు కన్నడ లో కూడా వచ్చింది.
నాకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం.
ఒరిజినల్ సినిమాలో లేనివి ఇక్కడ కొన్ని యాడ్ చేసాం.
మురగదాస్ గారితో మీ అసోసియేషన్
ఆయనతో రెండు సినిమాలకు వర్క్ చేసాను 7th సెన్స్ ,తుపాకీ ఈ కథ పాయింట్ ఆయనకి తెలుసు 1st టైం తమిళ్ రిలీజ్ అయ్యాక చూసి ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.
ఈ సినిమా చూసి తెలుగులో కూడా రిమేక్ చెయ్ బాగుంటుంది ఆయనే చెప్పారు.
నెక్స్ట్ తెలుగు సినిమా చేస్తారా తమిళ్ సినిమా చేస్తారా.?
తెలుగు సినిమా అనుకుంటున్నాను,
బై లింగ్వగల్ అయితే ఇంకా మంచిది.
సినిమా రిలీజ్ లేట్ అయింది కదా మీకు ఏమనిపించింది.?
కొంచెం బాధ అనిపించింది, అలానే మాకు ప్రాబ్లమ్ కూడా తెలుసు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిన హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్న.
నిఖిల్ చెప్పాడు నేను డైరెక్టర్ తో కొన్నిసార్లు గొడవ పడ్డాను అని.?
అది ఫైట్ కాదు,నిఖిల్ క్వశ్చన్స్ చేసేవాడు ఇది రీమేక్ కాబట్టి నేను కూడా ఆన్సర్ ఇచ్చేవాణ్ణి, అలా ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉండేది అది చాలా మంచిది, ఆయన అడిగిన ప్రతిసారి నేను పాజిటివ్ గా తీసుకున్నాను.మేము సినిమా కోసం గొడవ పడ్డాము,మేము పర్శనల్ గా మంచి ఫ్రెండ్స్.
నెక్స్ట్ సినిమా విషయం గురించి.?
ఇంకా డిస్కషన్ జరుగుతుంది,కాన్ఫర్మ్ అయ్యాక అతి త్వరలో చెప్తాను.
ఏ జోనర్ లో చేయబోతున్నారు .?
సినిమా రిలీజ్ అయ్యాక కంప్లీట్ సబ్జెక్ట్ చెప్తాను మీకు.