Donga First Look Posters
Angry Hero Karthi’s Latest Emotional Film ‘Donga’
Angry Hero Karthi has scored an Emotional Hit with recently released ‘Khaidi’. Now he is coming as ‘Donga’ to score another Super Success. Karthi’s latest which is being made as an Emotional film Produced by Viacom 18 Studios and Parallel Minds Production under the Direction of Jeethu Joseph is titled as ‘Donga’. The first look poster of the film is unveiled by the team on Friday. Viacom 18 Studios, Suraj Sadaana are producing this flick. Makers are planning to release the film in December. Karthi’s sister-in-law, Hero Suriya’s wife Jyothika is doing a crucial role in this film.
‘Khaidi’ is the film which marks the turning point in Megastar Chiranjeevi’s career. Recently Karthi has scored Blockbuster titled ‘Khaidi’. Now he is coming as ‘Donga’, which is the title of Megastar’s another film. It is strange coincidence that in the past too, Megastar did ‘Donga’ after his ‘Khaidi’.
Angry Hero Karthi, Jyothika, Sathya Raj will be seen in lead roles.
Cinematography: RD Rajasekhar, Music: Govind Vasantha, Producers: Viacom 18 Studios, Suraj Sadaana, Direction: Jeethu Joseph
యాంగ్రీ హీరో కార్తీ లేటెస్ట్ ఎమోషనల్ మూవీ ‘దొంగ’
యాంగ్రీ హీరో కార్తీ ఇటీవల విడుదలైన ‘ఖైదీ’ చిత్రంతో ఎమోషనల్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘దొంగ’గా మరో ఘనవిజయాన్ని అందుకునేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు కార్తీ. వయాకామ్ 18 స్టూడియోస్, ప్యారలల్ మైండ్స్ ప్రొడక్షన్ పతాకాలపై జీతు జోసెఫ్ దర్శకత్వంలో ఎమోషనల్ మూవీగా రూపొందుతున్న చిత్రానికి ‘దొంగ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఈ చిత్రాన్ని వయాకామ్ 18 స్టూడియోస్, సూరజ్ సదానా నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని డిసెంబర్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో కార్తీ వదిన, హీరో సూర్య సతీమణి జ్యోతిక ఓ కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌ని మలుపు తిప్పిన ‘ఖైదీ’ టైటిల్‌తో కార్తీ ఇటీవల బ్లాక్‌బస్టర్ హిట్‌ని అందుకున్నారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి మరో సినిమా ‘దొంగ’ టైటిల్‌తో వస్తున్నారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ‘ఖైదీ’ తర్వాత ‘దొంగ’ సినిమా చేయడం విశేషం.
యాంగ్రీ హీరో కార్తీ, జ్యోతిక, సత్యరాజ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆర్.డి.రాజశేఖర్, సంగీతం: గోవింద్ వసంత, నిర్మాతలు: వయాకామ్ 18 స్టూడియోస్, సూరజ్ సదానా, దర్శకత్వం: జీతు జోసెఫ్.