Donga movie review
ప్రేక్షకుల మనసులను దోచుకున్న దొంగ- దొంగ
నటీనటులు : కార్తీ, జ్యోతిక, నిఖిల విమల్, సత్య రాజ్,సీత, ఇళవరసు తదితరులు.
దర్శకత్వం : జీతూ జోసెఫ్
నిర్మాతలు : రావూరి వి శ్రీనివాస్
సంగీతం : గోవింద వసంత
సినిమాటోగ్రఫర్ : ఆర్ డి రాజశేఖర్
కార్తీ హీరోగా జ్యోతిక, సత్యరాజ్ ప్రధానపాత్రలలో దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన సస్పెన్సు అండ్ క్రైమ్ థ్రిల్లర్ దొంగ. తమిళ చిత్రం తంబీ సినిమాకి డబ్బింగ్ గా ఈ మూవీ విడుదలైంది,ఈ సినిమా రెస్పాన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
కథ:
గోవాలో చిన్న చిన్న దొంగతనాలు, చీటింగ్ లు చేస్తూ తన జీవితాన్ని హ్యాపీ గా గడిపేస్తాడు విక్కీ(కార్తీ). 15ఏళ్లుగా తప్పిపోయిన కొడుకు శర్వా కోసం వెతుకుతున్న తండ్రి జ్ఞాన మూర్తి(సత్య రాజ్) అక్క పార్వతి(జ్యోతిక) ల డబ్బున్న కుటుంబంలోకి ఒక గోవా పోలీస్ ఆఫీసర్ జీవానంద్(ఇళవరసు) డబ్బుకోసం విక్కీనీ కన్విన్స్ శర్వాగా అతనిని ప్రవేశ పెడతాడు.
మరి శర్వా గా జ్ఞాన మూర్తి కుటుంబంలోకి వెళ్లిన విక్కీ అక్కడ ఎదుర్కున్న పరిస్థితులు ఏమిటి?
ఆ కుటుంబం అతనిని నమ్మిందా?
శర్వా గా ఆ ఫ్యామిలీ లో ఎలా కలవగలిగాడు.?
ఇంతకి శర్వా ఏమైయ్యాడు? చివరికి విక్కీ, పార్వతి, జ్ఞాన మూర్తిల కథ ఎలా ముగిసింది? అనేది మిగతా కథ.
విశ్లేషణ:
ఖైదీ లాంటి సస్పెన్సు థ్రిల్లర్ తరువాత వస్తున్న చిత్రం కాబట్టి ఈ సినిమా పై అభిమానులు మంచి అంచనాలను పెట్టుకున్నారు,అయితే ఆ అంచనాలను సినిమా అందుకుందా అంటే.?కొంతవరకు అందుకుంది అని చెప్పొచ్చు.కార్తీ సినిమా అంటేనే డిసప్పాయింట్ చేయదు అనే నమ్మకానికి వచ్చారు దాదాపు ప్రేక్షకులు అందరూ.కార్తీ నటన ఆ పాత్రకు న్యాయం చేసింది.ఫస్ట్ హాఫ్ లో కార్తీ తన కామెడీ టైమింగ్ తో నవ్వులు పంచగా, సెకండ్ హాఫ్ మొత్తం తన మార్క్ యాక్షన్ మరియు ఎమోషన్స్ తో ఆకట్టుకున్నారు.
ఈ మూవీలో హీరో కార్తీ శర్వా తండ్రి పాత్ర చేసిన సత్యరాజ్ మూవీకి ప్రధాన ఆకర్షణగా నిలిచారు.ఇక కార్తీ అక్క పాత్ర చేసిన జ్యోతిక కు ఫస్టాఫ్ లో అంత స్కోప్ లేకపోయినా,సెకండాఫ్ లో మాత్రం ఎమోషనల్ సీన్స్ తో ఆమె నటన ఆకట్టుకుంటుంది.
హీరోయిన్ నిఖిల విమల్ నటన సహజంగా ఉంది.
జ్యోతిక ట్యూషన్ స్టూడెంట్ గా చిన్నా అనే పాత్ర చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ కామెడీ తో ఆకట్టుకున్నాడు.
కొంచెం స్లోగా మొదలైన దొంగ మూవీ ఆసక్తికరంగా సాగుతూ నడిచింది. అసలు శర్వా ఏమాయ్యాడు అనే సస్పెన్సు రివీల్ కాకుండా క్లైమాక్స్ వరకు కథను చాలా ఆసక్తికరంగా నడిపించాడు,
క్లైమాక్స్ ను అద్భుతమైన ట్విస్ట్ లతో తెరకెక్కించారు దర్శకుడు.
గోవింద వసంత పాటలు ఆకట్టుకున్నప్పటికీ బీజీఎమ్ పర్వాలేదనిపిస్తుంది,
ఆర్ డి రాజశేఖర్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది.
దర్శకుడు జీతూ జోసెఫ్ ఒక క్రైమ్ థ్రిల్లర్ ని తెరకెక్కించడంలో చాలా వరకు సక్సెస్ అయ్యారు. ఒక చిన్న పాయింట్ చుట్టూ సస్పెన్సు క్రియేట్ చేసి నడిపిన విధానం బాగుంది.
Rating : 3/5