Dr. M Mohan Babu and family meets PM Modi

సౌత్ ఇండియా ఆర్టిస్ట్ గానే ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలిసాం…
మంచు లక్ష్మీ
మంచు ఫ్యామిలీ ప్రధాని నరేంద్ర మోడీ ని కలిసిన కారణం పై రక రకాల వార్తలు హల్ చల్ చేసాయి. ఇందులో ఏ రాజకీయ కోణం లేదని మంచు లక్ష్మీ స్పష్టం చేసింది.
మంచు లక్ష్మి మోదీని కలవడానికి అసలు రీజన్ వేరే ఉంది.. రీసెంట్ గా బాలీవుడ్ యాక్టర్లంతా మోడీ ని కలిసిన విషయం తెలిసిందే. అప్పుడు కొంతమందిని మాత్రమే అవకాశం కలిగింది.
ఇప్పుడు ఆ అవకాశం సౌత్ ఇండియన్ యాక్టర్లకు రానుంది
మంచు లక్ష్మి ఆ బాధ్యతను తీసుకుని.. మోడీ నుంచి మాట కూడా తీసుకున్నారు. సౌత్ యాక్టర్లందరినీ కలుపుకొని అందరినీ రాష్ట్రపతి భవన్ కి తీసుకెళ్లి మోడీతో మీటింగ్ ను అరేంజ్ చేయబోతోంది మంచు లక్ష్మి. దీనంతటికీ రిప్రెజెంటివ్ గా ఉండి.. అన్నీ వ్యవహారాలు చూసుకోనున్నారు.
సౌత్ సినిమా ఇండియన్ సినిమా పై బలమైన ముద్రను వేస్తున్న తరుణంలో ఈ కలయిక కొత్త ఉత్సాహం నింపుతుంది ..