Excess or drought for Andhra
ఆంధ్రాకి అతివృష్టి- అనావృష్టి
తెలంగాణా ఉద్యమానికి ముందు తెలంగాణా నేతలు ఎప్పుడూ ఒక మాట అనేవారు. ఉమ్మడి ఆంధ్రా ఉన్నంత వరకు కూడా అక్కడ జరిగే అతివృష్టికి, అనావృష్టికి ఉమ్మడి రాష్ట్రంలోని డబ్బులు తీసి ఖర్చుపెట్టేవారని దాని వల్ల మనం నష్టపోతున్నాం అంటూ నేతలు ఉపన్యాసాలు ఇచ్చినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మొన్నటి వరకు ఆంధ్రాలో కరువు 2009లో కృష్ణాలో భారీ వరదలు వచ్చాయి. ఆ తర్వాత మళ్లీ వరదలు, వర్షాలు లేవు. కరువు మొదలైంది. పంటలు పరంగా నష్టం ఇలా రక రకాల సమస్యలు మొదలయ్యాయి. 2014 నుంచి 2019 వరకు కూడా అదే జరిగింది. ప్రభుత్వం మారింది. ఇప్పుడు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీవాళ్లు ఆనందపడిపోతున్నారు. గతంలో రాజశేఖర్‌రెడ్డి ఉన్నప్పుడు వర్షాలు వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు జగన్ వచ్చాక వర్షాలు వస్తున్నాయి అని. ఇలా వర్షాలు, వరదలు రావడం వల్ల కొత్తగా పంటవస్తది. అలాగే నష్టం కూడా అదే స్థాయిలో జరుగుతుంది. ఒక్క రాయలసీమ జిల్లాలో మాత్రమే 650కోట్ల వరకు నష్టం జరిగింది. అదే సందర్భంగా గోదావరి వరదలుగాని, కృష్ణవరదలు గాని ఇచ్చే పరిహారాలు అంటే ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగలేదు కాని. పొలాలకు వచ్చే పంట నష్టం వాటిల్లింది. పెద్ద ఎత్తున నష్టం జరిగింది. అందులో నామినల్‌గా ఇచ్చేది వేరు. పంటలైతే పెరుగుతాయి కాని నష్టం మాత్రం చాలానే ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్‌కి ఒకరకంగా చెప్పాలంటే శాపం అనే చెప్పాలి. అయితే ఆంధ్రాకి అతివృష్టి, లేదంటే అనావృష్టి. ఈ రెండిటి మధ్య నలుగుతున్న వేళ అతి వృష్టి వచ్చినప్పుడు ఆ నీళ్ళను మళ్లించుకునేటటువంటి ప్రకియలోనే మేం గొప్ప చేశాం మేం గొప్ప చేశాం అంటూ ఈ రోజు వరకు ఏది తెమల్చకుండా చేసింది . ప్రకృతి ఏదైతే విధ్వంసం సృష్టించిందో అది తుఫాన్ల ద్వారా విధ్వంసం రాలేదు. వరదలు ద్వారా వర్షాల ద్వారా వచ్చాయి. ఆ నీటిని ఒడిసిపట్టి వాడుకునే అవకాశం లేకుండా సముద్రంలోకో పొలాలకు పొయ్యడం. దీనికి సంబంధించి ఒక మెకానిజమ్ శాశ్వత ప్రయత్నమనేది ఇప్పటికైనా చెయ్యాలి. ఇటీవలె జరిగిన మీటింగ్‌లో జగన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ …నిన్న అక్కడ చెప్పుకొచ్చారు. వరదలకు గోడలు కట్టాలి అని. కాని వీలైనంత త్వరగా దీనికి ఒక స్థిరమైన ప్రణాళికను చెయ్యాలి. కృష్ణానదిలో ఇప్పుడు వరదలు వస్తే శాశ్వత ప్రణాళిక అనేది ముఖ్యంగా చెయ్యాలి. రెండోది భగీరధ, కాకతియాలో కరువు వచ్చినప్పుడు నీళ్లను ఎలా అయితే నిలవ పెట్టుకుంటున్నారో ఆ విధమైనది వాటర్ గ్రిడ్ చేస్తే మంచిది. ఈ విధమైనటువంటి నీటిని ఒడిసి పట్టుకోడానికి చెరువులు గాని, కాలవలుగాని, ట్యాంకులుగాని పట్టుకుని పెట్టుకుంటేగాని భవిష్యత్తులో కరువుని కూడా ఎదుర్కోవడం జరుగుతుంది. కష్టాలొచ్చినప్పుడు దాన్ని వాడుకోవడం అనేది సాధ్యపడుతుంది. ఈ విషయంలో నాయకులు ఒకరినొకరు ఎత్తిచూపుకోవడం అనేది పక్కన బెట్టి పక్కా ప్రణాళికతో చేస్తే బావుంటుందని అందరూ భావిస్తున్నారు.