EMV song launch at Radio Mirchi
“ఓ చిన్న నవ్వే చాలు పదా పలకరిద్దాం…“ అంటున్న `ఎంత మంచివాడవురా`
నందమూరి కల్యాణ్ రామ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ `ఎంత మంచివాడవురా`. ‘శతమానం భవతి’ చిత్రంతో జాతీయ పురస్కారాన్నిగెలుచుకున్న సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఆడియో రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఆదిత్యా మ్యూజిక్ సంస్థ తొలిసారిగా చిత్ర నిర్మాణ రంగంలోకి దిగి ఆదిత్యా మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
జాతీయ అవార్డ్ గ్రహీత మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్ సంగీత సారథ్యం వహిస్తోన్న ఈ సినిమాలో మూడో పాటను చిత్ర యూనిట్ రేడియో మిర్చిలో శుక్రవారం విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో నందమూరి కల్యాణ్ రామ్, డైరెక్టర్ సతీశ్ వేగేశ్న, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి పాల్గొన్నారు.
“ఓ చిన్న నవ్వే చాలు పదా పలకరిద్దాం
ఓ చిన్న మాటే చాలు.. బంధాలల్లుకుందాం
ఏ ఊరు మీదే పేరు.. అడిగి తెలుసుకుందాం
ఎవరైనా మనవారేగా.. వరస కలుపుకుందాం………“
అంటూ కూల్‌గా ఈ పాట ఉంది. మనుషుల మధ్య బంధాలను నిలుపుకోవాలని, కాబట్టి ప్రతి ఒక్కరితో కలిసిపోవాలని అర్థం చెప్పేలా పాట ఉంది.
పెళ్లి సందర్భంలో వచ్చే ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా.. అనురాగ్ కులకర్ణి, గీతా మాధురి పాడారు.
ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 15న విడుల చేస్తున్నారు.
నటీనటులు:
నందమూరి కల్యాణ్ రామ్, మెహరీన్, వి.కె.నరేశ్, సుహాసిని,శరత్‌బాబు,తనికెళ్ల భరణి, పవిత్రా లోకేశ్, రాజీవ్ కనకాల, వెన్నెల కిశోర్, ప్రవీణ్, ప్రభాస్ శ్రీను తదితరులు
సాంకేతిక నిపుణులు:
రచన, దర్శకత్వం: సతీశ్ వేగేశ్న
నిర్మాణం: ఆదిత్య మ్యూజిక్ (ఇండియా ) ప్రైవేట్ లిమిటెడ్
నిర్మాతలు : ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా
సమర్పణ :శివలెంక కృష్ణ ప్రసాద్,
సినిమాటోగ్రఫీ: రాజ్ తోట
సంగీతం: గోపీ సుందర్
ఎడిటింగ్:
తమ్మిరాజు
ఆర్ట్: రామాంజనేయులు
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: రషీద్ ఖాన్