EnthaManchivaadavuraa Sankranthi 2020

Nandamuri Kalyanram’s #EnthaManchivaadavuraa will be releasing for Sankranthi 2020. Directed by Satish Vegesna. Produced by Umesh Gupta & Subhash Gupta. Mehreen is the leading lady. Presented by Sivalenka Krishna Prasad.
రాజమండ్రి పరిసరాల్లో భారీ ఎత్తున షూటింగ్ జరుపుకొంటున్న
`ఎంత మంచివాడవురా`
డైనమిక్ హీరో నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా ఆదిత్య మ్యూజిక్ ఫిల్మ్స్ సంస్థ భారీగా తెరకెక్కిస్తున్న చిత్రం `ఎంత మంచివాడవురా`. ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మాతలు. శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రానికి సమర్పకులు. `శతమానం భవతి`తో జాతీయ పురస్కారం అందుకున్న సతీష్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మెహరీన్ కథానాయిక.
చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఉమేష్ గుప్తా, చిత్ర సమర్పకులు శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ “సినిమా చాలా బాగా వస్తోంది. ఆగస్టు 26 నుంచి రాజమండ్రి, పెండ్యాల, పురుషోత్తమపట్నం, వంగలపూడి, తొర్రేడు, కొవ్వూరు, కోటిపల్లి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నాం. ఈ నెల 25 వరకు ఈ షెడ్యూల్ ఉంటుంది. ఏకధాటిగా జరుగుతున్న ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాం. హీరో, హీరోయిన్లతో పాటు ప్రధాన తారాగణం అంతా పాల్గొంటున్నారు. తొర్రేడులో రూ.35 లక్షల వ్యయంతో భారీ జాతర సెట్ వేశాం. అక్కడ కల్యాణ్‌రామ్, నటాషా దోషి (`జై సింహా` ఫేమ్)పై ఒక సాంగ్ షూట్ చేశాం. ఈ చిత్రీకరణలో 50 మంది డ్యాన్సర్లు, 500 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారు. అలాగే పెండ్యాలలోని ఇసుక ర్యాంపల మధ్య భారీ ఎత్తున తెరకెక్కించిన యాక్షన్ ఎపిసోడ్ సినిమాకు హైలైట్ అవుతుంది. వంగలపూడి సమీపంలో గోదావరిలో 16 బోట్లతో తెరకెక్కించిన ఉత్కంఠభరితమైన క్లైమాక్స్ అల్టిమేట్‌గా ఉంటుంది. జనవరి 15న సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేస్తాం“ అని అన్నారు.
దర్శకుడు సతీష్ వేగేశ్న మాట్లాడుతూ “ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రాజమండ్రి పరిసరాల్లోని అందాలను మా `ఎంత మంచివాడవురా`లో మరోసారి చూపించబోతున్నాం. అక్టోబర్ 9 నుంచి 22 వరకూ హైదరాబాద్‌లో మూడో షెడ్యూల్ ఉంటుంది. ఆ తర్వాత నాలుగవ షెడ్యూల్లో కేరళ, కర్ణాటకల్లో కొన్ని ప్రధాన సన్నివేశాలను తెరకెక్కిస్తాం. దాంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. కల్యాణ్‌రామ్‌గారి చిత్రాల్లో భారీ చిత్రంగా ఈ సినిమా నిలుస్తుంది“ అని అన్నారు.
నటీనటులు:
నందమూరి కల్యాణ్ రామ్, మెహరీన్, వి.కె.నరేశ్, సుహాసిని, శరత్‌బాబు, తనికెళ్ల భరణి, పవిత్రా లోకేశ్, రాజీవ్ కనకాల, వెన్నెలకిశోర్, ప్రవీణ్, ప్రభాస్ శ్రీను తదితరులు
సాంకేతిక నిపుణులు
రచన, దర్శకత్వం: సతీశ్ వేగేశ్న,
నిర్మాతలు : ఉమేశ్ గుప్తా, సుభాష్ గుప్తా,
సమర్పణ :శివలెంక కృష్ణ ప్రసాద్,
సినిమాటోగ్రఫీ: రాజ్ తోట,
సంగీతం: గోపీ సుందర్,
ఎడిటింగ్: తమ్మిరాజు,
ఆర్ట్: రామాంజనేయులు,
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: రషీద్ అహ్మద్‌ఖాన్.