Error500 Movie Trailer Launch Photos
గ్రాండ్ గా జరిగిన మైత్రేయ మోషన్ పిక్చర్స్యు, జస్వంత్ పడాల (జెస్సీ), సాందీప్ మైత్రేయ ‘ERROR 500” ట్రైలర్ లాంచ్ ఈవెంట్
మైత్రేయ మోషన్ పిక్చర్స్యు పతాకంపై యు.బాలరెడ్డి (ఇన్ఫోసిటీ బిల్డర్స్) నిర్మాతగా యువ నటుడు జస్వంత్ పడాల (జెస్సీ), నక్షత్ర త్రినయని ప్రధాన పాత్రలలో నూతన దర్శకుడు సాందీప్ మైత్రేయ ఎన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ERROR500’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ జరిగింది. దర్శకుడు వి. ఎన్ ఆదిత్య , హీరో ఆకాష్ పూరితో పాటు బిగ్బాస్ రవి, సోహెల్, సిరి, కాజోల్, నేహా చౌదరి, అర్జున్ కళ్యాణ్ తదితరులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు వి. ఎన్ ఆదిత్య మాట్లాడుతూ.. ఈ సినిమా రిలీజ్ ప్లాన్ ఏమిటని సాందీప్ గారిని అడిగాను. సంతోషం సురేష్ గారు చూసారని చెప్పారు. మరో ఆలోచన లేకుండా మీ సినిమా చాలా సేఫ్ హాండ్స్ లో వుందని చెప్పాను. సురేష్ గారు వండర్ ఫుల్ డిస్ట్రిబ్యూటర్. ఆయన జడ్జ్ మెంట్ బావుంటుంది. ‘ERROR500’ జెస్సికి యాప్ట్ టైటిల్. ఒకేసారి మల్టిపుల్ పనులు చేయగలడు. నేను రెగ్యులర్ గా బిగ్ బాస్ షో చూస్తాను. అందులో నాకు నచ్చినవారంతా ఈ వేడుక లో వుండటం ఆనందంగా వుంది. ఈ స్టేజ్ పైకి వస్తుంటే సడన్ గా ఆదిత్య 369 గుర్తుకు వస్తోంది. కాలానికి వెనక్కి వెళ్లి బిగ్ బాస్ సీజన్ 5, ముందుకు వెళ్లి టాలీవుడ్ ఇండస్ట్రీ ఫ్యూచర్ ని చూస్తున్నట్లు అనిపించింది. ‘ERROR500’ ట్రైలర్ బ్రిలియంట్ గా వుంది. జెస్సి, సాందీప్ టీం అందరికీ ఆల్ ది బెస్ట్” తెలిపారు.
జెస్సీ మాట్లాడుతూ..‘ERROR500’ కోసం చాలా హార్డ్ వర్క్ చేశాం. సినిమా అద్భుతంగా వచ్చింది. మా నిర్మాతలు ఎంతో నమ్మకంగా ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాని నిర్మించారు. వారి నమ్మకాన్ని నిర్మబెట్టుకుంటాం. దర్శకుడు సాందీప్ యూనిక్ కథతో రూపొందించారు. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఫణి కళ్యాణ్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ వేడుకకి విచ్చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు” తెలిపారు.
దర్శకుడు సాందీప్ మాట్లాడుతూ.. జెస్సికి సినిమాలంటే చాలా ప్యాషన్. చాలా అంకిత భావంతో ఈ సినిమా చేశాడు. ట్రైలర్ లానే సినిమా కూడా చాలా వైవిధ్యంగా వుంటుంది. ఫణి కళ్యాణ్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. సురేష్, విఎన్ ఆదిత్య, ఆకాష్ పూరి, ఇక్కడ వచ్చిన అందరికీ పేరు పేరునా థాంక్స్’ తెలిపారు.
ఫణి కళ్యాణ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి శశాంక్ శ్రీరామ్ & ప్రశాంత్ మన్నె సినిమాటోగ్రఫీ, గ్యారీ బిహెచ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.
నటీనటులు : జస్వంత్ పడాల (జెస్సీ), నక్షత్ర త్రినయని, త్రినాధ్ వర్మ, రాజీవ్ కనకాల, సంజయ్ స్వరూప్ , రోహిణి హట్టంగడి, మొహమ్మద్ సమద్ , ప్రమోదిని, నామిన తారా, బేబీ సియా, స్వాతి, బబ్లూ మాయ తదితరులు
టెక్నికల్ టీమ్ :
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం – సాందీప్ మైత్రేయ ఎన్
నిర్మాత : యు. బాలరెడ్డి (ఇన్ఫోసిటీ బిల్డర్స్)
ప్రొడక్షన్ హౌస్ – మైత్రేయ మోషన్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్
సినిమాటోగ్రఫీ – శశాంక్ శ్రీరామ్, ప్రశాంత్ మన్నె
కాస్టింగ్ డైరెక్టర్ – సాందీప్ మైత్రేయ ఎన్
సంగీతం – ఫణి కళ్యాణ్
ఎడిటర్ – గ్యారీ బిహెచ్
డైలాగ్స్ – రాకేందు మౌళి, సాందీప్ మైత్రేయ ఎన్
యాక్షన్ – రబిన్ సుబ్బు
కొరియోగ్రఫీ – సాందీప్ మైత్రేయ ఎన్
కాస్ట్యూమ్ డిజైనర్ – అనూష మైత్రేయ
ఆర్ట్ డైరెక్టర్ – నాని , రత్నవాస్
పీఆర్వో: తేజస్వి సజ్జా