ప్రతి మహిళా గర్వపడే సినిమా `ఇ.టి.- ప్రియాంకా మోహన్ ఇంటర్వ్యూ
కన్నడ, తమిళ చిత్రాల్లో నటించిన ప్రియాంకా మోహన్ తెలుగులో నానితో ‘గ్యాంగ్ లీడర్’, శర్వానంద్‌తో శ్రీకారం చిత్రాల్లో నటించింది. ఈ సినిమాలు తనకు పెద్దగా పేరు రాకపోయినా తమిళంలో శివకార్తియేషన్ తో చేసిన ` డాక్టర్` సినిమా చక్కటి గుర్తింపు తెచ్చింది. తెలుగులోనూ అది విడుదలైంది. ఇప్పుడు తమిళంలో `సూర్యతో ఇ.టి.(ఎవరికీ తలవంచడు) సినిమా చేసింది. సూర్య నటించిన యాక్షన్ థ్రిల్లర్ `ఇటి`. పాండిరాజ్ దర్శకత్వం వహించారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించారు. టాలీవుడ్ కు చెందిన ప్రముఖ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను విడుదల చేస్తోంది. తమిళ వెర్షన్‌తో పాటు తెలుగులోనూ ఈ చిత్రం మార్చి 10 విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్ వచ్చిన ఆమె మీడియాలో పలు విషయాలు పంచుకుంది.
నాని, శర్వానంద్‌తో సినిమాల్లో మీరు చేసింది పవర్ఫుల్ పాత్ర కాదు. మరి ఇ.టి., సినిమాలో ఎలాంటి పాత్ర ఎలావుంటుంది?
కరెక్టే. కానీ ఇ.టి.లో మహిళలు నా పాత్రను స్పూర్తితీసుకుంటారని చెప్పగలను. నాది చాలా వరర్ఫుల్ రోల్. రెండు వేరియేషన్స్ నా పాత్రలో వున్నాయి. ఇంటర్వెల్‌కు ముందు చాలా హ్యాపీగా ఉండే పాత్ర నాది. సెకండాఫ్‌లో ఓ పర్పస్ కోసం తను ఏవిధంగా మారింది? అనేది పాయింట్. సూర్యకు నాకూ సమానస్థాయిలో పాత్ర వుంటుంది. కథ విన్నప్పుడే నాకు బాగా నచ్చింది.
ఇ.టి.లో అవకాశం ఎలా వచ్చింది?
నేను తమిళంలో `డాక్టర్` సినిమా చేశాను. ఆ తర్వాత అదే హీరోతో డాన్ చేశారు. అప్పుడు నాకు ఈ ఆఫర్ వచ్చింది. డాక్టర్ రిజక్ల్ చూశాక ఇ.టి. అకాశం వచ్చింది.
ఇ.టి.కథలో మిమ్మల్ని అంతా ఆకర్షించిన అంశం ఏమిటి?
ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తోపాటు చక్కటి లవ్ స్టోరీ కూడా వుంది. నా పాత్ర గురించి చెప్పగానే చాలా ఇంప్రెస్ అయ్యాను. ఇప్పటి పరిస్థితులలో బాధ్యతగల పాత్ర అది. చాలామంది ఆడవాళ్ళు ఇలాంటివి ఫేస్ చేస్తున్నారు. అందుకే సొసైటీకి నా పాత్ర బాధ్యతగా భావించాను. మహిళలను ఎడ్యుకేట్ చేస్తోంది. అందుకే నా పాత్రను ప్రాపర్‌గా చేయాలని ముందుకు వచ్చాను. నా పాత్రకు ఓ అర్థం కూడా వుంటుంది. దర్శకుడు చ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేయాలని చేశాను.
ట్రైలర్లో మొదటి భాగం కమర్షియల్‌గా రెండో భాగంలో ఎమోషన్స్‌గా వున్నాయి. ఈ రెండు ఎలా మిళితం య్యాయని మీరు అనుకుంటున్నారు?
ఇది దర్శకుడి ఆలోచన నుంచి వచ్చింది. కథ రాసుకున్నాకే హీరోయిన్‌కు ప్రాధాన్యత వుంది కాబట్టి ఆ తర్వాత ఇది నాకు చెప్పారు. ఇందులో పాటలు కూడా వున్నాయి. కానీ అంతకంటే సొసైటీపై బాధ్యత కూడా నాపాత్రపైవుంటుంది. అందుకే నచ్చింది.
ఎవరికీ తలవంచడు కాప్షన్ మీకా? హీరోకా?
అది హీరోకేకాదు నాకూ వర్తిస్తుంది. సినిమా చూశాక సొసైటీలో అందరికీ వర్తిస్తుందని అనిపిస్తుంది. మనం న్యాయంగా వుంటే ఎవరికీ తలవంచాల్సిన పనిలేదనే పాయింట్ ఇందులో చూపించారు. సినిమా చూస్తే ప్రతివారూ పురుషులతోసహా అందరూ కనెక్ట్ అవుతారు.
తెలుగులో రెండు సినిమాలు పరాజయం పాలయ్యాయి. మరి మీ కెరీర్ ఎలా ఉంది?
తమిళంలో ముందు డాక్టర్ చేశా. అది బ్లాక్ బస్టర్ హిట్. నా కెరీర్‌కు అది గుడ్ సైన్ ఇచ్చింది. ఇ.టి. సినిమా కూడా అంతకంటే గుర్తింపు ఇస్తుంది. బాష బేరియర్ వుండదు అంటారు. ఏమంచి సినిమా చేసినా ప్రేక్షకులు ఆదరిస్తారనే డాక్టర్ తెలుగులోనూ విడుదలై చూపించింది. అదేవిధంగా పుష్పకూడా చిత్తూరు యాస నార్త్‌లో తెలీదు. కానీ డబ్బింగ్లో ఆకట్టుకునేలా చెప్పడంతో అక్కడ నీరాజనాలు పలికారు. తెలుగులో ఆడకపోయినా తమిళంలో నాకు మంచి గుర్తింపు వుంది. ఇ.టి. రెండు చోట్ల ఆ గుర్తింపు తెస్తుందని నమ్ముతున్నాను.
సీనియర్ నటుడిగా సూర్య నుంచి మీరేమి గ్రహించారు?
చాలా విషయాలు ఆయన్నుంచి నేర్చుకున్నారు. తను వర్సటైల్ యాక్టర్. ప్రతిరోజూ షాట్ లో కొత్త విషయాలు చెప్పేవారు. ఆయనకు సమాజ దృక్పథం చాలా వుంది. వెరీ జంటిల్మేన్. కష్టపడే తత్వం ఆయనది. దానికితోడు అంకిత భావం వుంది. అలాగే నటనాపరంగా ఓ సీన్ వుంటే, దాని ముందుగా ఆయనతో చర్చించి ఇలా చేయవచ్చని సూచన చేసేకా నటించేదాన్ని. అప్పుడు నటిగా చాలా కంఫర్టబుల్ వుంది నాకు.
పాండ్ రాజ్ ఫ్యామిలీ సినిమాలు తీశారు? ఆయన సినిమాలో నటించడం ఎలా అనిపించింది?
అది దర్శకుడి బలం. ఒక్కో దర్శకుడిలో ఒక్కో దృక్పోణం వుంటుంది. అలాంటిది ఆయన జోనర్ నుంచి కాస్త బయటకు వచ్చి చేసిన సినిమా ఇది. నేషనల్ అవార్డు దర్శకుడు. వారి సినిమాలో నటిండచం చాలా హ్యాపీగా వది.
సూర్య ఇంతకుముందు రెండు సినిమాలు ఓటీటీలో అనూహ్య ఆదరణ పొందాయి. అలాంటి టైంలో ఈ సినిమా థియేటర్లో రాబోతుంది. మీకేమనిపిస్తుంది?
ఆయన సినిమాలతో నేను పోల్చలేను. ప్రతి వారికి ఆయన సినిమాల గురించి తెలుసు. నేను అందులో భాగమైనందుకు గర్వంగా వుంది.
సంగీతపరంగా ఎలా వుంది?
ఇమాన్ చక్కటి బాణీలు సమకూర్చారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ బాగా చేశారు. ఇది కమర్షియల్ సినిమా అయినా సోషల్ మెసేజ్ వుంది.
మహిళగా సొసైటీకి ఏం చెప్పదలిచారు ఈ సినిమాలో?
ఇందులో కోర్ పాయింట్ వుంది. అది అందరికీ రిలేటెడ్ అవుతుంది.ఇప్పుడు అది చెప్పకూడదు. సినిమా చూసిన మహిళలు తప్పకుండా కనెక్ట్ అవుతారని చెప్పగలరు.
రాధేశ్యామ్ సినిమాకు ముందే ఇటి. విడుదల కావడం ఎలా అనిపిస్తుంది?
చాలా థ్రిల్‌గా వుంది. రెండు భిన్నమైన కథలు. ఏ భాషలో సినిమా బాగున్నా చూస్తారు. అలాగే ఆర్.ఆర్.ఆర్., మణిరత్నం సినిమాలు కూడా రాబోతున్నాయి.
ఉమెన్స్ డే కు రెండు రోజుల ముందు మీ సినిమా రాబోతోంది? ఎలా అనిపిస్తుంది?
నాకు అది తెలీదు. అలా రావడం కూడా కథ పరంగా కరెక్టే అని భావిస్తున్నా.
ఉమెన్స్ డే సందర్భంగా మీరు ఏమి చెబుతారు?
మహిళలు ఏ రంగంలో వున్నా అంతా హ్యాపీగా ఉండాలి. పనిలోనూ మీ టాలెంట్ చూపించండి. సమస్య వస్తే ఎదుర్కోండి.
నటిగా స్పూర్తి ఎవరు?
శ్రీదేవి, రజనీకాంత్, సౌందర్యలు
కొత్త సినిమాలు?
తమిళంలో ఓ సినిమా చేయబోతున్నా. తర్వాత వివరాలు తెలియజేస్తా అని ముగించారు.