Galla Ashok Hero Movie Interview Photos
ఈ సంక్రాంతికి `హీరో` సినిమాతో ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్ మెంట్ పెరుగుతాయి – అశోక్ గల్లా
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనళ్లుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం `హీరో`. నిధి అగర్వాల్ హీరోయిన్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రాన్ని అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీమతి గల్లా పద్మావతి నిర్మించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా హీరో అశోక్ గల్లా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
కమర్షియల్ సినిమాను చేస్తున్నామని డైరెక్టర్ ముందే చెప్పారు. ఎక్కువగా చిరంజీవి గారి సినిమాలను రిఫరెన్స్‌గా ఇచ్చారు. సెట్లో దర్శకుడు ఏది చెబితే అది చేశాను. ఆయన ఓకే అన్నారా? లేదా? అని మాత్రమే చూశాను. అంత కంటే ఎక్కువగా నేను ఆలోచించలేదు.
కథ గురించి ఇప్పుడే నేను ఎక్కువగా చెప్పలేను కాని ట్విస్ట్లోనే ఈ సినిమా టైటిల్‌కు జస్టిఫికేషన్ ఉంటుంది. రేపు రిలీజయ్యాక ఈ సినిమాకు హీరో టైటిల్ పర్ఫెక్ట్ అని అంతా అంటారు.
నేను శ్రీరామ్ ఆదిత్య గారిని దర్శకుడిగా ఎంచుకోలేదు. మేం ఇద్దరం ఒకరినొకరు ఎంచుకున్నాం. ఇద్దరం కలిసి సినిమాను చేయాలని అనుకున్నాం. ఆయన నన్ను హీరోగా ఎంచుకోవడం నా అదృష్టం. నన్ను చూశారు.. అబ్బాయి నచ్చాడు అని చెప్పారు. ఏ సినిమాలు ఇష్టమని అడిగారు. అలా ఓ ఆరు గంటలు మాట్లాడుకుంటూ ఉన్నాం. చివరకు సినిమా చేసేద్దామని అన్నారు.
శ్రీరామ్ ఆదిత్య గారి సినిమాలు, ఆయన తెరకెక్కించే విధానం అన్నీ బాగుంటాయి. ఆయనేంటో నాకు తెలుసు. స్టోరీ నచ్చింది, మేం కనెక్ట్ అయ్యాక నేనేం ఆలోచించలేదు. అంతా ఆయనే చూసుకుంటాడని అనుకున్నాను.
ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి.. హీరో అవ్వాలని అనుకుంటాడు. కాలేజ్‌లో ఉన్నప్పుడు మనమే తోపు అని అనుకునే కారెక్టర్.
నేను ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఆలోచించలేదు. నా డెబ్యూ మూవీ అని మాత్రమే చూశాను. తాతయ్య కృష్ణ, మహేష్ బాబు గారి లెగసీని కంటిన్యూ చేద్దామనే. డ్యాన్స్, యాక్షన్లోట్రైనింగ్ తీసుకున్నాను. నాకు మామూలుగా అయితే యాక్టింగ్ అంటేనే ఇష్టం. నేనేమీ నాచురల్ డ్యాన్సర్‌ని కాదు. జిమ్‌కు వెళ్లడం అంటే ఇష్టం ఉండదు. కానీ నాకున్న లెగసీ కోసమే ఇవన్నీ నేర్చుకున్నాను.
చిన్నప్పటి నుంచి థియేటర్ ఆర్ట్స్ చేశాను. కాలేజ్‌లో నాకు ఫిల్మ్ డిగ్రీ ఉంది. నాకు ఏడు ఎనిమిదేళ్లున్న సమయంలోనే తాతగారు ఓ సినిమాలో పెట్టారు. నాని సినిమాలో కూడా నటించాను. అప్పుడు నాకు సినిమాల మీద ఇంట్రెస్ట్ కలిగింది. సింగపూర్‌లో థియేటర్ క్లాస్‌లు చేస్తుంటే అక్కడ వచ్చిన రెస్పాన్స్ చూసి సినిమాల్లోకి రావాలని ఫిక్స్ అయ్యాను.
ఇంకా సినిమా ఫైనల్ కాపీ రాలేదు. వచ్చాక కృష్ణ గారు, మహేష్ బాబు గారు చూస్తారు.
ఈ సినిమా కంటే ముందు నాకు హార్స్ రైడింగ్ రాదు. కౌ బాయ్ గెటప్ చెప్పినప్పుడు నాకు హార్స్ రైడింగ్ రాదని చెప్పాను. పర్లేదు అని డైరెక్టర్ గారు అన్నారు. కానీ షూటింగ్‌కు వెళ్లే నెల ముందు మళ్లీ చెప్పారు. గుర్రం ఎక్కితే బాగుంటుందని డైరెక్టర్ అన్నారు. దీంతో హార్స్ రైడింగ్ నేర్చుకున్నాను. అది చాలెంజింగ్‌గా అనిపించింది.
నాకు చిన్నప్పటి నుంచి బ్యాట్ మాన్ అంటే ఇష్టం. జోకర్ తెలీకుండా ఉంటుందా?. సినిమాలో జోకర్ పార్ట్ కొద్దిగా చేశారు. కానీ దానికి ఇంత రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు.
సినిమా వాళ్ల జీవితం ఎలా ఉంటుందో అమ్మకు తెలుసు. ఒకరోజు సక్సెస్ ఉంటుంది. ఇంకోరోజు సక్సెస్ ఉండదు. ఎత్తుపల్లాలుంటాయి అవసరమా? అని అమ్మ భయపడ్డారు. నాన్న కూడా అలానే అన్నారు. కానీ నేను ఒక్కసారిగా నా నిర్ణయం గట్టిగా చెప్పడంతో వారు కూడా సపోర్ట్ చేశారు.
నాకు నటనపై ఆసక్తి ఉందని మహేష్ బాబు గారికి ఎప్పటి నుంచో చెబుతూ వచ్చాను. కానీ నేను ట్రైనింగ్ తీసుకుంటున్నాని తెలియడంతో సీరియస్‌గానే చెప్పాడని అనుకున్నారు. ఇక్కడకు వస్తే ఎలా ఉండాలి.. ఎలా ధైర్యంగా ఉండాలి అనేదే ఎక్కువగా చెప్పారు.
నేను బాగా చేశాను అని మా అమ్మ, నాన్న చెప్పారు. మా ఫాదర్ అయితే తెలుగు సినిమాలను జడ్జ్ చేయడం మానేశారు. ఆయనకు నచ్చిన సినిమాలు ఫ్లాప్ అవుతాయి. నచ్చని సినిమాలు హిట్ అవుతాయి. శ్రీరామ్ ఎడిటింగ్ స్టైల్ మా నాన్నకు ఇష్టం. మా అమ్మ అయితే సాధారణ తెలుగు ప్రేక్షకులురాలిగా ఉంటుంది. సినిమా నచ్చిందని చెప్పారు.
నిధి అగర్వాల్ ఎంతో ఫ్రీడమ్ ఇచ్చారు. ఇలా చేస్తే ఏమైనా అనుకుంటుందా? అనే అవకాశాన్ని కూడా ఇవ్వలేదు. అందుకే సీన్స్, సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. ఆమె చాలా ప్రొఫెషనల్. మా గ్యాంగ్‌లో కలిసిపోయింది.
ఈ సినిమాలో ఎక్కువగా ఎమోషనల్ సీన్స్ ఉండవు. కామెడీ, ఫైట్స్ ఎలా చేశానో.. ఎమోషనల్ సీన్లోనూ నటించారు. నాకు కెమెరా ముందే కంఫర్ట్ అనిపిస్తుంది. కెమెరా ముందున్న ఆ కొన్ని నిమిషాలు ఏమీ గుర్తుకు రాదు. దాని తరువాత టెన్షన్స్ మొదలవుతాయి.
దర్శకుడు ఈ సినిమాకు కమర్షియల్ ఫార్మాట్ అద్దారు. కానీ ఇందులో కాన్సెప్ట్ ఉంటుంది. సినిమా చూస్తే అందరికీ అర్థమవుతుంది. సంక్రాంతికి రావాలని చివరి నిమిషంలో నిర్ణయించుకున్నాం.
మహేష్ బాబు గారు ఇప్పుడే క్షేమంగానే ఉన్నారు. స్వల్ప లక్షణాలే ఉన్నాయి. ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నారు. ఇంకో రెండు మూడు రోజుల్లో క్షేమంగా బయటకు వస్తారు.
కృష్ణ గారికి డేరింగ్ అండ్ డాషింగ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఆయన్నుంచి అదే నేర్చుకున్నారు. మహేష్ మామయ్య దగ్గరి నుంచి సెన్సాఫ్ హ్యూమర్, టాలెంట్, ఇంటెలిజెంట్, షార్ప్ నెస్ వంటి లక్షణాలను తీసుకున్నాను.
నన్ను లాంచ్ చేయాలనే ఈ బ్యానర్‌ను స్థాపించాం. భవిష్యత్తులో దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉంది. కరోనా గురించి ఎప్పుడూ బాధపడలేదు. కానీ సినిమా ఆలస్యమవుతూ ఉందని అనిపించింది.
ఇందులో ఐదు పాటలుంటాయి. ప్రతీ ఒక్క పాటకు ప్రత్యేకమైన సందర్భంగా ఉంటుంది.
అన్ని రకాల సినిమాలు చేయాలని అనుకుంటున్నాను. దర్శకుడితో సింక్ అయినా, కథ, కారెక్టర్‌కు కనెక్ట్ అయినా కూడా సినిమాను చేస్తాను. నాకు టామ్ క్రూయిజ్ మిషన్ ఇంపాజిబుల్ వంటి సినిమా అయితే ఇంకా బెటర్. మంచి సినిమాలు చేయాలని అనుకుంటున్నాను.
కెమెరామెన్ రిచర్డ్ మా గ్యాంగ్‌లో కలిసి పోయాడు. మా ఏజ్ గ్రూపు కావడంతో ఎలాంటి సమస్య రాలేదు. సమీర్ గారు అయితే మా ఎనర్జీ ఒక్కసారిగా పైకి తీసుకెళ్లారు. వయసులో పెద్ద అయినా కూడా ఆలోచనలో మాత్రం మాకంటే యంగ్. ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా కూల్‌గా హ్యాండిల్ చేసేవారు. మా టీం స్పీడ్, ఎనర్జీని పెంచేశారు.
కథలు వింటూ ఉన్నాను. ఇంకా ఏది ఫైనల్ కాలేదు. ఈ సంక్రాంతికి హీరో సినిమాతో మీకు ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్ పెరుగుతుంది. జనవరి 15న హీరో సినిమాను థియేటర్లో అందరూ చూడండి.