George Reddy Movie Review
జార్జి రెడ్డి: యూత్ తప్పకుండా చూడాల్సిన గొప్ప చిత్రం
నటీనటులు:సందీవ్ మాధవ్, సత్య దేవ్ ,ముస్కాన్ , అభయ్ ,శత్రు ,లక్ష్మణ్ మీసాల తదితరులు.
దర్శకత్వం: జీవన్ రెడ్డి
నిర్మాత : అప్పిరెడ్డి,సంజయ్ రెడ్డి,దాము రెడ్డి ,సుధాకర్ రెడ్డి యక్కంటి
సంగీతం:సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రఫర్ :సుధాకర్ రెడ్డి యక్కంటి
రిలీజ్:అభిషేక్ పిక్చర్స్
ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు జార్జి రెడ్డి కథను సినిమా గా తీస్తున్నాం అని ప్రకటించినప్పటినుండి వివాదాలు, చర్చలు మొదలయ్యాయి,
మాములు సినిమాగా మొదలైన ఈ సినిమాకి మెగా ఫ్యామిలీ నుండి మంచి సపోర్ట్ రావడంతో అంచనాలు అమాంతం పెరిగాయి,ఈ రోజు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ ని సంపాదించుకుంది.
కథ:
ఉస్మానియా యూనివర్సిటీ లో ఒక మాములు విద్యార్థి స్థాయి నుండి విద్యార్థి నాయకుడు లా జార్జి రెడ్డి అనే వ్యక్తి ఎలా ఎదిగాడు.?
బలహీన వర్గాల తరుపున ఎటువంటి పోరాటం చేసాడు.?
తమ హక్కులను సాధించడం కోసం ఎంతమందికి ఎదురు తిరిగాడు.?
విద్యార్థుల జీవితాలలో ఎలాంటి ఉద్యమ స్ఫూర్తిని నింపాడు అనేది కథ.
విశ్లేషణ:
సినిమాలోని జార్జి రెడ్డి కథను తన బాల్యం నుండి దర్శకుడు చాల అందంగా,అర్ధవంతగా చూపించాడు. తనలో నాయకత్వపు లక్షణాలను తల్లి కొడుకుల ప్రేమ అనుబంధాలను చాలా చక్కగా తీర్చి దిద్దాడు దర్శకుడు,ఈ సినిమాలో ప్రతి ఒక్కరు అద్భుతమైన పెర్ఫార్మన్స్ ప్రదర్శించారు. ఈ సినిమాలోని నేపధ్య సంగీతం ప్రతి సీన్ ని,ఆర్టిస్ట్ లా పెర్ఫార్మన్స్ ని మరో స్థాయి కి తీసుకెళ్తుంది. సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ మనకు ఆనాటి పాత రోజులను గుర్తుచేస్తుంది. సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి ఈ సినిమాకి అద్భుతమైన పాటలను అందించాడు.
సినిమా మొదటి నుండి చివరి వరకు ఆసక్తికరంగా అనిపించేలా దర్శకుడు జీవన్ రెడ్డి ఈ నిజ జీవిత కథను తెరకెక్కించారు.
యూత్ ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాల్సిన సినిమా డోంట్ మిస్ ఇట్.
రేటింగ్:3.5