Good response to Rudramambapuram movie teaser

యన్.వి.ఎల్ ఆర్ట్స్ రుద్రమాంబపురం చిత్ర టీజర్ కు మంచి స్పందన !!!
యన్.వి.ఎల్ ఆర్ట్స్… యన్.వి.ఎల్ అంటే అలనాటి ఆంద్ర నాటక రంగ స్థలంలో ఒక బ్రాండ్. హరిశ్చంద్ర, మైరావణ, ధుర్యోధన పాత్రలకు పెట్టింది పేరు. కీ. శే. శ్రీమాన్ యన్.వి.ఎల్ నరసింహచార్యులు. వారి పేరు మీద కుమారులు నండూరి శ్రీను, నండూరి రాము గారు కలసి యన్.వి.ఎల్ ఆర్ట్స్ స్థాపించడమైనది. ఈ బ్యానర్లో అజేయ్ ఘోష్, శుబోదయం సుబ్బారావు, జనార్ధన్ రావు (పలాస) ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న మొదటి సినిమా రుద్రమాంబపురం. ఈ చిత్రానికి మహేష్ బంటు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ గురువారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. టీజర్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది.
ఒక గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్ర కథ కథనాలు అందరిని ఆకట్టుకోబోతున్నాయని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. నటుడు అజయ్ ఘోజ్ ఈ సినిమాకు కథ అందించడం విశేషం.
మూలకథ: అజేయ్ ఘోష్ (సినీ నటుడు)
నటీ నటులు: అర్జున్ రెడ్డి, ప్రమీల, అజేయ్ ఘోష్, శుబోదయం సుబ్బారావు, జనార్ధన్ రావు (పలాస), నండూరి రాము, జెమినీ కిరణ్, రజిని శ్రీకల, పండ్రాజు శంకర్ గడ్డం రజిని (నీలవేని), పొలవరపు రమణి, డీవి.సుబ్బారావు, రత్నశ్రీ, ఆల్లు రమేష్, Tv8 సాయి, పెద్ధి రాజు, నాని తదితరులు
సాంకేతిక వర్గం :
రచన , దర్శకత్వం : మహేష్ బంటు
ఎగ్జిక్యూటివ్ నిర్మాత : కరెడ్ల బాలాజీ శ్రీను
సహా నిర్మాత : దంతులూరి నరసింహమూర్తి రాజు
నిర్మాతలు- నండూరి శ్రీను , నండూరి రాము
డి.ఓ.పి – ఎన్.సుధాకర్ రెడ్డి
ఎడిటర్ – బొంతల నాగేశ్వర రెడ్డి
సి.ఈ.ఓ: రాజశేఖర్ ఆణింగి