Gurtunda Seetakaalm Movie Photos
టాలెంటెడ్ వెర్సటైల్ యాక్టర్ యంగ్ హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటించిన సినిమా ‘గుర్తుందా శీతాకాలం. కన్నడలో సక్సస్ఫుల్ దర్శకుడు మరియు నటుడు నాగశేఖర్ ని తెలుగుకి దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వేదాక్షర ఫిల్మ్స్ , నాగశేఖర్ మూవీస్ మరియు మణికంఠ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై నిర్మాతలు చింతపల్లి రామారావు, భావన రవి, నాగశేఖర్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని చినబాబు, ఎం, సుబ్బారెడ్ది లు సమర్సించగా కాలభైరవ సంగీతాన్ని అందిస్తున్నారు, చిత్రాన్ని డిసెంబర్ 9 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
నిర్మాత రామారావు చింతపల్లి మాట్లాడుతూ.. శీతాకాలం తో నాకు ప్రత్యేఖమైన పరిచయం లేకపోయినా.. ఈ శీతాకాలం మాత్రం నాకు గుర్తుండిపోతుంది. ఈ సినిమా లో హీరో సత్యదేవ్ , తమన్నా, మెఘా ఆకాష్, కావ్య శెట్టి లు వాళ్ళ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేశారు. పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. సత్యదేవ్, తమన్నా లు ఇంతకు ముందు చాలా చిత్రాల్లో అద్బుతం గా నటించి వుండచ్చు.. భవిష్యత్తులో మరిన్ని చిత్రాల్లో అద్బతంగా నటించవచ్చు కాని వారి కెరీర్ లో మరియు ప్రేక్షకుల గుండెల్లో మా గుర్తుందా శీతాకాం మాత్రం గుర్తిండిపోతుంది. మ్యూజిక్, కెమోరా విజువల్స్ డైలాగ్స్ చాలా చాలా ఆహ్లదకరంగా వుంటాయి. అని అన్నారు
చిత్ర సమర్పకుడు ఎం. సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నో డేట్స్ మార్చుకుంటూ వచ్చాము. ఎందుకొ ప్రతి డేట్ మార్చాల్సి వస్తే కొంచెం ఇబ్బంది వుండేది కాని ఫైనల్ డిసెంబర్ 9 న శీతాకాలం ఈ సినిమా రిలీజ్ అయ్యి టైటిల్ జస్టిఫికేషన్ అవుతుంది. ఈ సినిమాకి గుర్తుందా శీతాకాలం అనే టైటిల్ పెట్టిన దగ్గర నుండి ఎదో మ్యాజిక్ నడుస్తుంది. ఎన్ని డేట్స్ మార్చినా కూడా ఏమాత్రం ఓపిక నశించకుండా మాకు అండగా వున్న సత్యదేవ్ కి థ్యాంక్స్ చెప్పితీరాలి. ఈ సినిమా ఆయన కెరీర్ కి కొత్త టర్న అవుతుంది. అని అన్నారు.
ఎగ్జక్యూటివ్ ప్రోడ్యూసర్ నవీన్ రెడ్డి మాట్లాడుతూ.. మా హీరో సత్యదేవ్ గారు నన్ను ఎంకరేజ్ చేస్తునందుకు ఆయనకి థ్యాంక్స్ , అలాగే ప్రోడ్యూసర్స్ కి డైరక్టర్ నాగశేఖర్ కి నా ప్రత్యేఖమైన ధన్యవాదాలు. ఈ సినిమా గుర్తుండిపోయే చిత్రం.
ప్రియదర్శి మాట్లాడూతూ.. సత్యదేవ్ ఎప్పటినుండో ఒక మంచి లవ్‌స్టోరి చేయలని అనుకునేవాడు. కాని తనకి వయసుకి మించిన పాత్రలు పలకరించాయి. అన్ని చేసుకుంటూ ప్రేక్షకుల్ని తన నటనతో ఆకట్టుకుంటూ వచ్చాడు, ఈ సినిమా తన కెరీర్ కి చాలా ఇంపార్టెంట్ చిత్రం గా నిలుస్తుంది. అంతేకాకుండా ఈ చిత్రం లో తమన్నా గారు చేయడం చాలా ఆనందంగా వుంది. మూడు లవ్ స్టోరీస్ కలిపిన శీతాకాలం లవ్‌స్టోరి ఈ గుర్తుందా శీతాకాలం. ఈ చిత్రం లో చాలా మంచి పాత్రలో నవ్విస్తాను.. మీ అందరితో ట్రావెల్ అవుతాను. సత్యదేవ్, తమన్నా పాత్రలు ప్రతి ప్రేక్షకుడు హర్ట్ లో నిలిచిపోతాయి. డిసెంబర్ 9 న ధియేటర్స్ కి మాత్రమే వచ్చి ఈ చిత్రాన్ని చూడాల్సిందిగా కొరుకుంటున్నాను.అని అన్నారు
దర్శకుడు నాగశేఖర్ మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులకి నమస్కారం చెబుతూ.. ఈ చిత్రం డైరక్షన్ చేసే అవకాశం అనుకొకుండా వచ్చింది. నేను కన్నడలో బిజి గా వున్న టైంలొ మా ప్రోడ్యూసర్ భావన రవి గారు ఈ సినిమా తెలుగు లో డైరక్షన్ చేయమని అడిగారు. అప్పడు నాకు నా స్నేహితుడు సంపత్ ద్వారా తెలుగు కి వచ్చాను. ఇక్కడ స్టార్ రైటర్ లక్ష్మి భూపాల్ గారు పరిచయం అయ్యారు ఆయన ద్వారా మన యంగ్ వెర్సటైల్ నటుడు సత్యదేవ్ పరిచయం అయ్యారు మేటర్ చెప్పాను ఆయన వెంటనే ఒకే అనేసారు, అక్కడి నుండి మెదలయ్యింది మా శీతాకాలం ముచ్చట్లు.. ఈ సినిమా కి టైటిల్ అనుకున్నాము నెక్ట్స్ డే మోర్నింగ్ హీరోగారికి చెప్పాలని అనుకున్నాము ఆయనే వచ్చి ఇదే టైటిల్ ని చెప్పారు. యూనిట్ లొ అందరూ ఇదే టైటిల్ సజస్ట్ చేయడం తో ఆలోచన కూడా చెయ్యలేదు వెంటనే ఒకే చెప్పేశాము. ఈ సినిమా లో లవ్ స్టోరీస్ అంటే ఎదో నార్మల్ గా వుండవు. మీ హర్ట్ ని టచ్ చేసేలా వుంటాయి. ఈ డిసెంబర్ 9 న శీతాకాలం లో మా గుర్తుందా శీతాకాలం చూడండి మీ గుండెల్లో నిలిచిపోతుంది. మా ప్రోడ్యూసర్స్ ఎన్నో ఇబ్బందులు భరించి ఫైనల్ గా భారీ గా రిలీజ్ చేస్తున్నారు. అలాగే మ్యూజిక్ కాలభైరవ నెక్ట్స్ లెవెల్ లో అందించాడు, సత్య ఫోటోగ్రఫి ఇప్పటికే విడుదల చేసిన అన్ని విజువల్స్ లో చూశారు. లక్ష్మి భూపాల్ మాటలు చిత్రాన్ని ఇంకో లెవెల్ కి తీసుకుపోతాయి. ఎడిటింగ్ కొటగిరి వెంకటేశ్వరావు గారు ఎక్కడా ఫీల్ మిస్ కాకుండా జాగ్రత్తగా చేశారు. మా హీరోయిన్స్ శీతాకాలం మ్యాజిక్ ని అందిస్తారు. అందరూ ఈ చిత్రాన్ని దియోటర్స్ లో డిసెంబర్ 9 న చూడాల్సిందిగా కొరుకుంటున్నాను..అని అన్నారు.
హీరో సత్యదేవ్ మాట్లాడుతూ.. నేను కామెడి, లవ్ స్టోరిస్ బాగానే చేస్తానుకదా ఎందుకు నాకు కాన్సెప్ట్ చిత్రాలు లేదా పెద్ద క్యారక్టరైజేషన్స్ ఇస్తున్నారు అని కొంచెం అనిపించేది. అలాంటి టైం లో నాగశేఖర్ నాకు ఈ కథ చెప్పాడు, 10 నిమాషాల్లో నేను ఈ సినిమా చేస్తా అని చెప్పా.. కాని నా పక్కన హీరోయిన్ అంటే నిధి కేరక్టర్ ఎవరు చేస్తారు అనుకుంటూ వున్నా ఆ టైం లో నా మొబైల్ ఒక మోసెజ్ వచ్చింది తమన్నా గారు చేస్తున్నారని కన్ఫర్మ్ చేశారు. వావ్ అని పించింది అందుకే సినిమా లో ఒక డైలాగ్ పెట్టాము తమన్నా ని సినిమా లో చూడగానే ఇది మన రేంజ్ కాదేమోరా అని . అలా చాలా నేచురల్ గా మూడు లవ్ స్టోరిస్ కలిపిన ఒక మంచి లవ్ స్టోరి మా గుర్దుందా సీతాకాలం. ఈ సినిమా లొ తమన్నా చేసిన కెరక్టర్ ఎప్పూడూ చెయ్యలేదు ఇది మాత్రం నిజం. నిధి పాత్ర ని సత్యదేవ్ ఎంతలా ప్రేమిస్తాడో ఈ చిత్రం చూసిన ప్రేక్షకులు అంతకి మించి ప్రేమిస్తారు. సుహసిని సాంగ్ విజువల్స్ చూస్లే అందరి ఫేవరేట్ సాంగ్ అవుతుంది. రీసెంట్ గా గాడ్ ఫాదర్ చిత్రం లో చేసిన పాత్ర కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం లో సత్యదేవ్ లవ్ స్టోరి ని అంతకి మించి ఆదరించాలని కొరుకుంటున్నాను. కావ్య శెట్టి, మెఘా అకాష్ లు చాలా అందంగా నటించారు. లక్ష్మి భూపాల్ అందించి మాటలు , సత్య అందిచింన విజువల్స్, కాలభైరవ సంగీతం ఇంకో లెవెల్ కి తీసుకెళ్ళింది. త్వరలో టీజర్ లో యూత్ కి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ వుంటాయి. నాగశేఖర్ దర్శకుడిగా తెలుగు లో టాప్ డైరక్టర్స్ లో ఒకరిగా నిలదొక్కుకుంటారు. అలాగే నిర్మాతలు రామారావు గారు, భావన రవి గారు, సుబ్బారెడ్డి గారు, చిన్నా గారు ఈ చిత్రం విషయం లో ఎన్నో వేవ్స్ వచ్చినా తట్టుకుని నిలబడ్డారు. ఈచిత్రం బిగ్గెస్ట్ హిట్ అవ్వడానికే ఇన్ని కష్టాలు పడిందేమో అనుకుంటున్నా.. ఈ చిత్రం తప్పకుండా అందరి హ్రుదయాల్ని గెలుచుకుంటుంది. ఈ ఇ చిత్రం కమర్షియల్ గా పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నా.. అని అన్నారు.
నటీనటులు:
సత్యదేవ్, తమన్నా, కావ్య శెట్టి, మేఘా ఆకాష్, ప్రియదర్శి, సుహసిని తదితరులు
టెక్నికల్ టీం:
స్కీన్ ప్లే, డైరెక్షన్ – నాగశేఖర్
బ్యానర్ – వేదాక్షర ఫిల్మ్స్, నాగశేఖర మూవీస్, మణికంఠ ఎంటర్టైన్మెంట్
సమర్పకులు – ఎమ్ ఎస్ రెడ్డి, చినబాబు
నిర్మాతలు – రామారావు చింతపల్లి, భావన రవి, నాగ శేఖర్,
కొరియోగ్రఫి – వీజేశేఖర్
లైన్ ప్రొడ్యూసర్స్ – సంపత్, శివ ఎస్. యశోధర
ఎక్సీక్యూటివ్ ప్రొడ్యూసర్ – నవీన్ రెడ్డి
డైలాగ్స్ – లక్ష్మీ భూపాల్
మ్యూజిక్ – కాలభైరవ
ఎడిటిర్ – కోటగిరి వెంకటేశ్వరరావు
సినిమాటోగ్రాఫర్ – సత్య హెగ్డే
స్టంట్స్ – వెంకట్