GURU Maestro Sri.Mandolin.U.Shrinivas Anna.. For TEACHERS DAY is launched by Dear aryasukku Dear boselyricist garu !!
టీచర్స్ డే సందర్భంగా తన గురువు మాండొలిన్ శ్రీనివాస్ కోసం దేవిశ్రీ ప్రసాద్ స్పెషల్ పెర్ఫామెన్స్.
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్. సెప్టెంబర్ 5 టీచర్స్ డే సందర్భంగా తన గురువు మాండొలిన్ శ్రీనివాస్ ను గుర్తుచేసుకుంటూ ‘దేవ దేవం’ సాంగ్ ను స్టేజ్‌పై స్పెషల్ పెర్ఫామెన్స్ చేసి తన గురువు మాండొలిన్ శ్రీనివాస్‌కు అంకితమిచ్చారు. ఆ సాంగ్‌ను బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్, ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ విడుదల చేశారు. ఈ సందర్భంగా
రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ – “గురువు గొప్పతనాన్ని మాటల్లో చెప్పలేం. అందుకే నా గురువు మాండొలిన్ శ్రీనివాస్‌గారికి ఇష్టమైన కీరవాణి రాగంలో ఓ పాటను కంపోజ్ చేశాను. మీ అందరికి కూడా ఆ పాటంటే చాలా ఇష్టమే.. మా గురువుగారితో పాటు జీవితాలకు అర్ధం నేర్పే ప్రతి గురువుకి ఈ పాట అంకితం” అన్నారు