Indian Super Force – Indrani
Indian Super Force – Indrani
Director Stephen Kumar has mentioned that the story of Indrani film revolves around an organization named ISF – Indian Super Force and its operations. Sanjay Swaroop and Madhunandan will be playing key roles in the film and will be leading the ISF organization. According to the director, ISF will be engaged only in matters related to border security and international issues and will be working hand in hand with the Indian Army supporting them in their engagements. He said that Indrani film has a very unique plot which was never explored in Indian cinema before and such a story is needed for a superhero film.
Makers have mentioned that Indrani film shooting is going at a rapid pace and has completed 2nd schedule in Goa and 3rd schedule in Hyderabad recently and getting ready for its release on Oct 27th, 2022 as planned.
`ఇంద్రాని` చిత్రంలో ఐఎస్ఎఫ్ ఆఫీసర్స్‌గా సంజయ్ స్వరూప్, మధు నందన్
ఫిమేల్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ తో సైన్స్ ఫిక్షన్ మూవీగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో రూపొందుతోన్న సూపర్ ఉమెన్ మూవీ `ఇంద్రాని`. యానియా భరద్వాజ్, కబీర్ దుహన్ సింగ్, షతఫ్ అహ్మద్, గరీమా కౌశల్, ఫ్రనైట జిజిన తదితరులు నటిస్తున్న ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్స్, మేకింగ్ వీడియోకి విశేష ఆదరణ లభించింది. తాజాగా ఈ మూవీలో సంజయ్ స్వరూప్, మధు నందన్ కీలకపాత్రలలో నటించనున్నారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఈ సందర్భంగా…
దర్శకుడు, నిర్మాత స్టీఫెన్ మాట్లాడుతూ – “ఇంద్రాణి సినిమా ISF – (ఇండియన్ సూపర్ ఫోర్స్) అనే సంస్థ మరియు దాని కార్యకలాపాల చుట్టూ ఉంటుంది. ISF సంస్థకు నాయకత్వం వహించే కీలక పాత్రలలో సంజయ్ స్వరూప్, మధునందన్ నటించనున్నారు. ISF సరిహద్దు భద్రత మరియు అంతర్జాతీయ సమస్యలకు సంబంధించిన విషయాలలో నిమగ్నమై ఉంటుంది. వారికి మద్దతు ఇచ్చే భారత సైన్యంతో కలిసి పని చేస్తుంది. ఇండియన్ సినిమాలో ఇంతకు ముందెన్నడూ లేని విశిష్టమైన కథాంశంతో ఇంద్రాణి చిత్రం రూపొందుతోంది“ అన్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్టాన్లీ సుమన్ బాబు మాట్లాడుతూ – “ఇంద్రాణి సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే గోవాలో సెకండ్ షెడ్యూల్ పూర్తిచేశాం. హైదరాబాద్‌లో 3వ షెడ్యూల్‌ను పూర్తి చేసి, అనుకున్న ప్రకారం 2022 అక్టోబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం“ అన్నారు.
నటీనటులు: యానియా భరద్వాజ్, కబీర్ దుహన్ సింగ్, షతఫ్ అహ్మద్, గరీమా కౌశల్, ఫ్రనైట జిజిన, సంజయ్ స్వరూప్, మధు నందన్ తదితరులు
సాంకేతిక వర్గం:
బ్యానర్: శ్రే మోషన్ పిక్చర్స్
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం, నిర్మాత: స్టీఫెన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: స్టాన్లీ సుమన్ బాబు
కో- ప్రొడ్యూసర్స్: సుధీర్ వేల్పుల, కెకె రెడ్డి, జే జి.సేన్
మ్యూజిక్: సాయి కార్తీక్
డిఓపి: చరణ్ మాధవ నేని
ఎడిటర్: ఎస్ బి ఉద్దవ్
యాక్షన్ డైరెక్టర్: ప్రేమ్ సన్
ఆర్ట్ డైరెక్టర్: రవి కుమార్ గుర్రం
కో- డైరెక్టర్: సాయి త్రివేది
ఫైనాన్స్ కంట్రోలర్ : మిర్తిపాటి నరేష్