India’s Biggest Love Story ‘Radhe Shyam’ Postponed . Producers Announced
ఇండియాస్ బిగ్గెస్ట్ లవ్ స్టోరీ ‘రాధే శ్యామ్’ వాయిదా.. ప్రకటించిన నిర్మాతలు..
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ఇండియాస్ బిగ్గెస్ట్ లవ్ స్టోరీ రాధే శ్యామ్. ఒమిక్రాన్ వైరస్ కారణంగా ఈ సినిమాను వాయిదా వస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ ట్వీట్ చేసారు. సినిమా వాయిదా గురించి చెప్తూ.. ‘గత కొన్ని రోజులుగా సినిమా కోసం చాలా ప్రయత్నించాం.. కానీ ప్రస్తుతం బయట ఉన్న పరిస్థితులు.. పెరిగిపోతున్న ఒమిక్రాన్ వేరియంట్ కేసుల నేపథ్యంలో.. ఈ అద్భుతమైన ప్రేమకథను థియేటర్స్‌లో ఎంజాయ్ చేయడానికి మరికొన్ని రోజుల సమయం పడుతుంది. విధికి, విధిరాతకు మధ్య జరిగే అద్భుతమైన ప్రేమకథ ఇది. మాకు తెలుసు.. మీ ప్రేమ సినిమాపై ఎప్పుడూ ఇలాగే ఉంటుందని.. ఎప్పుడు బిగ్ స్క్రీన్‌పై వచ్చినా కూడా సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాం..’ అని తెలిపారు రాధే శ్యామ్ చిత్రయూనిట్. యువీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించాయి.
నటీనటులు:
ప్రభాస్, పూజా హెగ్డే, కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్ ఖేడ్కర్, ప్రియదర్శి తదితరులు..
టెక్నికల్ టీమ్:
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: కె కె రాధాకృష్ణ కుమార్
నిర్మాతలు: వంశీ, ప్రమోద్, ప్రసీధ
బ్యానర్స్: గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్ (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం), మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ (హిందీ),
సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస,
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
యాక్షన్ కొరియోగ్రఫీ: నిక్ పావెల్
డైరక్టర్ ఆఫ్ కొరియోగ్రఫీ: వైభవి మర్చంట్
ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్
సౌండ్ ఇంజనీర్: రసూల్ పూకుట్టి
ప్రొడక్షన్ కంపెనీస్: యువీ క్రియేషన్స్, టి సిరీస్
పిఆర్ఓ : ఏలూరు శ్రీను