Introducing Samuthirakani As Rajappa In Macherla Niyojakavargam
Introducing Samuthirakani As Rajappa In Nithiin, Sudhakar Reddy, Sreshth Movies Macherla Niyojakavargam
Hero Nithiin’s most awaited political action entertainer Macherla Niyojakavargam will arrive in theatres in less than a month and the team is leaving no stone unturned to keep the expectations up on the movie releasing on August 12th.
The makers today introduced the main antagonist of the movie. The most sought after Samuthirakani has played the role of Rajappa who is unanimous MLA of Macherla Niyojakavargam. In fact, there’s no opposition for him in the constituency.
Samuthirakani looks old in the poster where he is seen giving serious expression, as he signs on papers. The Tilak on his forehead and the malas on his neck shows his devotion, wherein his dressing shows his traditionalism. It will be interesting to see the fight between the IAS officer played by Nithiin and the MLA.
Macherla Niyojakavargam is carrying humongous buzz, thanks to the massive promotions and appealing promotional stuff. The recently released Ra Ra Reddy song is still trending top on YouTube and it has become one of the biggest chartbusters in recent times. Nithiin and Anjali’s mass dances are being appreciated by all.
Sudhakar Reddy and Nikitha Reddy are producing the movie on Sreshth Movies banner, while Rajkumar Akella presents it. MS Raja Shekhar Reddy is making his directorial debut with the movie.
Krithi Shetty and Catherine Tresa are the heroines in the movie. Prasad Murella is the cinematographer. Mamidala Thirupathi has provided dialogues and Sahi Suresh is the art director. Kotagiri Venkateswara Rao is the editor. Three might masters Venkat, Ravi Varma and Anal Arasu choreographed action part of the movie to be high on mass and action elements.
Cast: Nithiin, Krithi Shetty, Catherine Tresa, Samuthirakani, Anjali (special song) and others
Technical Crew:
Written & Directed by: MS Raja Shekhar Reddy
Producers: Sudhakar Reddy, Nikitha Reddy
Banner: Sreshth Movies
Presents Rajkumar Akella
Music: Mahati Swara Sagar
DOP: Prasad Murella
Editor: Kotagiri Venkateswara Rao
Dialogues: Mamidala Thirupathi
Art Director: Sahi Suresh
Fights: Venkat, Ravi Varma, Anal Arasu
PRO: Vamsi-Shekar
యంగ్ అండ్ వెర్సటైల్ హీరో నితిన్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మాచర్ల నియోజకవర్గం’ కోసం ప్రేక్షకుల ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆగస్ట్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ప్రచార కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. ఈ చిత్రం నుండి బయటికి వస్తున్న ప్రొమోషనల్ కంటెంట్ కు భారీ రెస్పాన్స్ వస్తుంది.
తాజాగా ఈ సినిమాలో విలన్ ని పరిచయం చేసింది చిత్ర యూనిట్.”మాచర్ల నియోజకవర్గం’ నుండి ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్యే రాజప్ప పాత్రలో కనిపించబోతున్నారు విలక్షణ నటుడు సముద్రఖని. మాచర్ల నియోజకవర్గంలో రాజప్పకు ప్రతిపక్షమే లేదు.
నెరిసిన జుట్టు, మెలితిరిగిన మీసం, నుదిటిన తిలకం, మెడలో రుద్రాక్షమాలతో వింటేజ్ పొలిటిషియన్ లుక్ లో కనిపించిన సముద్రఖని పేపర్లపై సంతకం చేస్తూ సీరియస్ ఎక్స్ప్రెషన్స్ చూడటం చాలా క్యురియాసిటీని పెంచింది. ఐఏఎస్ అధికారిగా నితిన్, ఎమ్మెల్యే మధ్య పోరు ఇందులో ఆసక్తికరంగా వుండబోతుంది.
‘మాచర్ల నియోజకవర్గం’ భారీ ప్రమోషన్లు, ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెంట్ తో దూసుకుపోతుంది. ఇటీవల విడుదలైన ”రా రా రెడ్డి” పాట ఇప్పటికీ యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఉంటూ, ఇటీవలి కాలంలో బిగ్గెస్ట్ చార్ట్బస్టర్లలో ఒకటిగా నిలిచింది. నితిన్, అంజలిల మాస్ డ్యాన్స్‌లు అందరినీ అలరిస్తున్నాయి.
శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పొలిటికల్ ఎలిమెంట్స్ తో మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్నారు. ఎంఎస్ రాజ శేఖర్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా ఈ చిత్రంలో కథానాయికలు. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ పని చేస్తుండగా, మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి మామిడాల తిరుపతి డైలాగ్స్ అందించగా, సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ గా పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి ముగ్గురు ఫైట్ మాస్టర్స్ వెంకట్, రవివర్మ , అనల్ అరసు భారీ యాక్షన్ పార్ట్స్ ని, అదిరిపోయే ఫైట్ సీక్వెన్స్ లని డిజైన్ చేస్తున్నారు.
తారాగణం: నితిన్, కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా, సముద్రఖని, అంజలి (స్పెషల్ సాంగ్) తదితరులు
సాంకేతిక విభాగం :
రచన, దర్శకత్వం: ఎంఎస్ రాజ శేఖర్ రెడ్డి
నిర్మాతలు: సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి
బ్యానర్: శ్రేష్ట్ మూవీస్
సమర్పణ : రాజ్‌కుమార్ ఆకెళ్ల
సంగీతం: మహతి స్వర సాగర్
డీవోపీ : ప్రసాద్ మూరెళ్ల
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
డైలాగ్స్ : మామిడాల తిరుపతి
ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్
ఫైట్స్: వెంకట్, రవివర్మ, అనల్ అరసు
పీఆర్వో: వంశీ-శేఖర్