Is kajal agree for less remuneration?
కాజల్ మరీ అంత తక్కువకి ఒప్పుకుందా…!
కాజల్ అగర్వాల్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కెరీర్ మొదలై 12 ఏళ్లైనా కూడా ఇప్పటికీ అదే జోరు చూపిస్తుంది ఈ అందాల చందమామ. ఇప్పటికీ వరస సినిమాలతో రఫ్ఫాడిస్తూనే ఉంది. చందమామను చూసి కుర్రాళ్ల మతులు చెడిపోతున్నాయి. సింపుల్‌గా చూపులతోనే చంపేస్తుంది ఈ ముద్దుగుమ్మ. చిన్న హీరోలతో పాటు పెద్ద సినిమాలతోనూ బిజీగా ఉంది కాజల్ అగర్వాల్.
కాజల్ అగర్వాల్… కోలీవుడ్‌లో మూడు సినిమాలతో యమా బిజీగా ఉంది. విశ్వనాయకుడు కమల్ హాసన్‌కు జోడిగా ‘భారతీయుడు-2’ సినిమాలో నటిస్తున్న కాజల్ అగర్వాల్, ‘క్వీన్’ రీమేక్ ‘పారిస్ పారిస్’, ‘కోమలి’ సినిమాల్లోనూ నటిస్తోంది.
ఇక ఈ భామ తెలుగు, తమిళ భాషల్లో కోటి నుంచి కోటిన్నర వరకు తీసుకుంటున్న అందాలతార కాజల్ అగర్వాల్ ఓ హిందీ చిత్రానికి కేవలం 30 లక్షల పారితోషికం మాత్రమే తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. జాన్ అబ్రహాం హీరోగా రూపొందే ‘బాంబే సాగా’ చిత్రంలో పాత్ర బాగా నచ్చడం వల్ల ఈ ముద్దుగుమ్మ ఇంత తక్కువకే ఆ సినిమా చేస్తోందట. మరి అంతగా నచ్చిన పాత్ర ఏమిటి అన్నది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. అలాగే బాలీవుడ్ అంటే కాస్త క్రేజ్ ఎక్కువ కాబట్టి ఛాన్స్ దొరకడమే ఆలస్యం అన్నట్లు వెళ్లాందా లేక ఆ పాత్రకి అంతటి ప్రాధాన్యం ఉందా అన్నది తెలియాలి. మరి అలాంటి పాత్ర ఇంతక ముందు ఎప్పుడూ కాజల్ నటించలేదా అంటూ కొందరు మరికొందరు మన తెలుగు దర్శకులు అంత మంచి పాత్రలు ఆమె కోసం రాయడంలేదా అని అనుమానులు కూడా వ్యక్తమవుతున్నాయి. అలాగే ఒకేసారి రెమ్యూనరేషన్ అంతలాగా తగ్గించుకుంటే తన తర్వాత చిత్రాలకు ప్రొడ్యూసర్లు ఆమెతో బేరాలాడకుండానే సినిమాలు చేస్తారా అని కూడా కొందరు అంటున్నారు. బాలీవుడ్ అంటే చాలు మనవాళ్ళకి ఎంత క్రేజ్ అంటే చెప్పలేనంత క్రేజ్ అని గుసగుసలు వినిపిస్తున్నాయి