Iitlu Maredumilli Prajaneekam Pressmeet
‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ అందరూ తప్పక చూడాల్సిన సినిమా: ప్రెస్ మీట్ లో ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ చిత్ర యూనిట్
వెర్సటైల్ హీరో అల్లరి నరేష్ ఎన్నికల అధికారిగా నటిస్తున్న సోషల్ డ్రామా మూవీ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ఏఆర్ మోహన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ తో కలిసి హాస్య మూవీస్‌పై రాజేష్ దండా నిర్మించారు. ఆనంది కథానాయిక. ఈ చిత్రం ఈ నెల 25న థియేటర్లలో విడుదలౌతున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది.
అల్లరి నరేష్ మాట్లాడుతూ.. ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ఒక నిజాయితీ గల సినిమా. మన చుట్టూ జరిగే కథ. సినిమా అద్భుతంగా వచ్చింది. దర్శకుడు మోహన్, ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్, డీవోపీ రాంరెడ్డి, మాటల రచయిత అబ్బూరి రవి గారు.. టీం అంతా కలసి చాలా మంచి వర్క్ చేశాం. చివరి ఇరవై నిమిషాల్లో చాలా కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ ని ఫైట్ మాస్టర్ పృద్వీ గారు అద్భుతంగా కంపోజ్ చేశారు. సినిమా చూసిన తర్వాత సంగీత దర్శకుడు శ్రీచరణ్, మాటల రచయిత అబ్బూరి రవి గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. నాంది తర్వాత నిర్మాత సతీష్ గారికి ఎంత పేరొచ్చిందో.. ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ కూడా నిర్మాత గా రాజేష్ కి మంచి పేరు తీసుకొస్తుంది. అందరూ కష్టపడి, ఇష్టపడి చేసిన సినిమా ఇది. ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ జనం సినిమా. జనం అంటే మనం. మన చుట్టుపక్కల జరిగే కథ. ప్రేక్షకులు కొత్త కంటెంట్ ని కోరుకుంటున్నారు. కొత్త ప్రయత్నంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ని ఆదరిస్తారనే నమ్మకం వుంది. రేపు సినిమా విడుదలౌతుంది. అందరూ థియేటర్ లో చూడాలి. మళ్ళీ సక్సెస్ మీట్ లో కలుద్దాం” అన్నారు.
ఆనంది మాట్లాడుతూ.. ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ లాంటి మంచి సినిమాతో మీ ముందుకు రావడం చాలా ఎక్సయిటింగా వుంది. కొత్త నేపధ్యంలో వస్తున్న ఈ సినిమాని అందరూ ఎంజాయ్ చేస్తారనే నమ్మకం వుంది. కమర్షియల్ గా ఇలాంటి కథతో వస్తున్నందుకు చాలా హ్యాపీగా వుంది. ఇందులో కనకమహా లక్ష్మీ పాత్రలో కనిపిస్తా. ఈ పాత్రలో చక్కని హాస్యం కూడా వుంది. నరేష్ గారు, మోహన్ గారు, రాజేష్ గారు.. టీం అందరికీ థాంక్స్. ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ అందరూ చూడాల్సిన సినిమా. అందరూ 25 నుండి థియేటర్లో చూడాలి” అని కోరారు
నిర్మాత రాజేష్ దండా మాట్లాడుతూ.. స్వామి రారా సినిమాతో ఇండస్ట్రీకి డిస్ట్రిబ్యూటర్ గా వచ్చాను. 75 సినిమాలు పైగా డిస్ట్రిబ్యూట్ చేశాను, నిర్మాతగా ఇది నా మొదటి సినిమా. ఎలాంటి ఒత్తిడి లేదు. చాలా ఎక్సయిటింగా వుంది. ఈ సినిమాని నిర్మించే అవకాశం ఇచ్చిన నరేష్ గారికి థాంక్స్. నన్ను నిర్మాత చేసిన సినిమా ఇది. మా సినిమాకి పని చేసిన ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్, ఎడిటర్ ప్రసాద్, డీవోపీ రాంరెడ్డి, మాటల రచయిత అబ్బూరి రవి .. అందరూ ఫ్యామిలీ మెంబర్స్ లా ఎంతో సపోర్ట్ చేసారు. ఇది ఎప్పటికీ మర్చిపోలేను. దర్శకుడు మోహన్ నిజాయితీ గల కథతో వచ్చారు. ఈ సినిమాని అంతే నిజాయితీగా తీశాం. ఈ సినిమా నిర్మాణ భాగస్వామిగా వచ్చిన జీ స్టూడియోస్ వారికి థాంక్స్. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో ఎంతో సహకరించిన నిమ్మకాయల ప్రసాద్ గారికి కృతజ్ఞతలు. హీరోయిన్ ఆనంది గారికి థాంక్స్. రేపు ఈ సినిమా థియేటర్లోకి వస్తుంది. అందరూ థియేటర్ లో చూసి మా సిన్సియర్ ప్రయత్నాన్ని ఆశీర్వదించాలి’ అని కోరారు.
దర్శకుడు ఏఆర్ మోహన్ మాట్లాడుతూ.. .: ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ నా లైఫ్ లో చాలా ముఖ్యమైన సందర్భం. నరేష్ గారికి ఎలా థాంక్స్ చెప్పుకోవాలో తెలియడం లేదు. ఇది సినిమా కాదు.. జీవితం. కొందరి బ్రతుకు. ఈ సినిమా కోసం గొప్ప టీం వర్క్ చేశాం. ఆర్ట్ డైరెక్టర్ కడలి గారు అద్భుతమైన ఆర్ట్ వర్క్ చేశారు, శ్రీ చరణ్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. డీవోపీ రాంరెడ్డి వండర్ ఫుల్ గా చుపించారు. మాటల రచయిత అబ్బూరి రవి గారు చాలా బలమైన మాటలు రాశారు. టీం అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. రాజేష్ గారి లాంటి నిర్మాత దొరకడం నా అదృష్టం. చాలా మంచి సినిమా చేశాం. మంచి కంటెంట్ ని తీసుకొస్తున్నాం. ఎంటర్టైన్మెంట్, యాక్షన్, సాంగ్స్.. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ వున్నాయి. అందరూ ఎంజాయ్ చేసే సినిమా. అందరూ థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయాలి” అని కోరారు.
నిమ్మకాయల ప్రసాద్ మాట్లాడుతూ.. నరేష్ గారు ఈ సినిమా కోసం చాలా అంకితభావంతో పని చేశారు. అది స్క్రీన్ మీద కనిపిస్తుంది. థియేటర్ లో చూడాల్సిన సినిమా ఇది. అందరూ థియేటర్లో సినిమా చూడాలి” అని కోరారు.
శ్రీ చరణ్ పాకాల మాట్లాడుతూ..: ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ నా కెరీర్ లో చాలా ముఖ్యమైన సినిమా. మంచి కథ దొరకడం వలన మంచి మ్యూజిక్ చేసే అవకాశం దొరికింది. నరేష్ గారికి, దర్శకుడు మోహన్, నిర్మాత రాజేష్ గారికి థాంక్స్. నరేష్ అద్భుతంగా ఫెర్ ఫార్మ్ చేశారు. సినిమా మీ అందరికీ నచుతుంది.
అబ్బూరి రవి : ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమా కి రాయడం నా అదృష్టంగా ఫీలౌతున్నాను. మార్పు ఎక్కడ మొదలైతే బావుంటుందనే ఆలోచనతో కూడిన కథ ఇది. ఇలాంటి కథకు మాటలు రాసే ఆవకాశం ఇచ్చిన నరేష్ గారికి, దర్శకుడు మోహన్, నిర్మాత రాజేష్, నిమ్మకాయల ప్రసాద్ గారికి కృతజ్ఞతలు. చాలా మంచి టీం కలిసి చేసిన సినిమా ఇది. ఇందులో ఒక పాట రాసి, పాడాను. మీకు నచ్చుతుందని భావిస్తున్నాను. ఇది జనం కథ. అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను” అన్నారు. ఈ ప్రెస్ మీట్ లో షాని, కుమరన్, శ్రీతేజ్, చోటాకే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
తారాగణం: అల్లరి నరేష్, ఆనంది, వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: ఎఆర్ మోహన్
నిర్మాత: రాజేష్ దండా
నిర్మాణం: హాస్య మూవీస్, జీ స్టూడియోస్
సహ నిర్మాత: బాలాజీ గుత్తా
సంగీతం: శ్రీచరణ్ పాకాల
డైలాగ్స్: అబ్బూరి రవి
డీవోపీ: రాంరెడ్డి
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
స్టంట్స్: పృథ్వీ
కొరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్, బిన్నీ
డిఐ – అన్నపూర్ణ స్టూడియోస్
పీఆర్వో: వంశీ-శేఖర్