Kalaavathi Song From Mahesh Babus Sarkaru Vaari Paata Unveiled
Kalaavathi Song From Superstar Mahesh Babu’s Sarkaru Vaari Paata Unveiled
Superstar Mahesh Babu who is riding high with consecutive hits is set to continue the success streak with Sarkaru Vaari Paata which is one of the most-awaited films releasing in 2022. Directed by Parasuram, the film stars Keerthy Suresh playing the female lead.
Sensational composer S Thaman has scored music and promo of first single Kalaavathi that was released couple of days ago set the bar high for the song. The first single Kalaavathi has been unveiled as Valentine’s Day special. The song hits you with its fabulous composition, dreamy lyrics and glorious singing.
It’s the collective efforts of composer Thaman, singer Sid Sriram and lyricist Ananta Sriram made this song melody of the year. Everything about this song is so perfect and magical. Mahesh Babu’s hook step is amazing and it’s a feast for fans. Mahesh Babu oozed swag and Keerthy Suresh dazzled like a diva. Their adorable chemistry added extra glamor to the song.
The specially designed music video that presented Thaman, Sid Sriram and musical troupe in traditional getups brings reverence to the song. Kalaavathi certainly is going to top the music charts.
Parasuram is directing the film which is jointly produced by Naveen Yerneni, Y. Ravi Shankar, Ram Achanta and Gopichand Achanta under Mythri Movie Makers, GMB Entertainment and 14 Reels Plus banners.
R Madhi handles the cinematography, while Marthand K Venkatesh is the editor and AS Prakash takes care of art department.
Sarkaaru Vaari Paata is coming as summer attraction on May 12th.
Cast: Mahesh Babu, Keerthy Suresh, Vennela Kishore, Subbaraju and others.
Technical Crew:
Written and directed by: Parasuram Petla
Producers: Naveen Yerneni, Y. Ravi Shankar, Ram Achanta and Gopichand Achanta
Banners: Mythri Movie Makers, GMB Entertainment, 14 Reels Plus
Music Director: Thaman SS
Cinematography: R Madhi
Editor: Marthand K Venkatesh
Art Director: AS Prakash
Fights: Ram – Laxman
Line Producer: Raj Kumar
Co-Director: Vijaya Ram Prasad
CEO: Cherry
VFX Supervisor – Yugandhar
PRO: Vamsi-Shekar
వరుస బ్లాక్ బస్టర్ హిట్స్‌తో దూసుకుపోతున్న సూపర్‌స్టార్ మహేష్ బాబు మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ సర్కారు వారి పాటతో 2022లో తన విజయ పరంపరను కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నారు. యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సర్కారు వారి పాట చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ పరుశురామ్ తెరకెక్కిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది.
సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. తమన్ స్వరపరిచిన ఫస్ట్ సింగిల్ కళావతి ప్రోమో ఇటీవల విడుదలై
ఫుల్ సాంగ్ కోసం అందరూ ఎదురు చూసేలా చేసింది. వాలెంటైన్స్ డే స్పెషల్‌గా ఈ రోజు కళావతి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు.
మ్యూజిక్ డైరెక్టర్ తమన్, సింగర్ సిద్ శ్రీరామ్ మరియు లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ సమిష్టి కృషితో ఈ పాట ఈ ఏడాది మెలొడి సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. ఈ పాటలో అన్ని ఫర్ఫెక్ట్గా కుదిరాయి. మహేష్ బాబు హుక్ స్టెప్ అద్భుతంగా ఉంది. అభిమానుల్లో పండుగ వాతావరణాన్ని నెలకొలిపింది.
సూపర్‌స్టార్ మహేష్ బాబు స్వాగ్, కీర్తి సురేష్ అందం అబ్బురపరిచేలా ఉంది. వారి కెమిస్ట్రీ ఈ పాటకు అదనపు గ్లామర్ జోడించింది. సినిమాటోగ్రాఫర్ ఆర్ మధి విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి.
తమన్, సిద్ శ్రీరామ్ మరియు సంగీత బృందం సంప్రదాయ గెటప్‌లలో ప్రదర్శించిన ప్రత్యేకంగా రూపొందించిన మ్యూజిక్ వీడియో ఈ పాటకు మరింత అందాన్ని తెచ్చింది. కళావతి ఖచ్చితంగా మ్యూజిక్ చార్ట్‌లలో అగ్రస్థానంలో ఉంటుంది.
ఈ మూవీలో మహేష్ బాబును సరికొత్త అవతారంలో చూపించబోతోన్నారు దర్శకులు పరుశురాం. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ల మీద నవీన్ యెర్నేని, వై రవి శంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఆర్ మధి సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నారు. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్‌గా, ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.
సర్కారు వారి పాట వేసవి కానుకగా మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
నటీనటులు : మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు
సాంకేతిక బృందం
రచయిత, దర్శకుడు : పరుశురామ్ పెట్లా
నిర్మాతలు : నవీన్ యెర్నేని, వై రవి శంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట
బ్యానర్స్ : మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్
సంగీతం : తమన్
సినిమాటోగ్రఫీ : ఆర్ మధి
ఎడిటర్ : మార్తాండ్ కే వెంకటేష్
ఆర్ట్ డైరెక్టర్ : ఏఎస్ ప్రకాష్
ఫైట్స్ : రామ్ లక్ష్మణ్
లైన్ ప్రొడ్యూసర్ : రాజ్ కుమార్
కో డైరెక్టర్ : విజయ రామ్ ప్రసాద్
సీఈవో : చెర్రీ
వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ : యుగంధర్