Kalaavathi Song Sarkaru Vaari Paata Hits 100 Million Views
Kalaavathi Song From Superstar Mahesh Babu’s Sarkaru Vaari Paata Hits 100 Million Views, Becomes Fastest To First Single To Reach The Milestone
Kalaavathi song from superstar Mahesh Babu’s highly anticipated film Sarkaru Vaari Paata is the new emotion of love. The song which topped all the music charts within no time after its release is continuing to steal the hearts. The blockbuster song has surpassed 100 Million views with 1.7 Million likes thus far and it has now become the fastest first single to reach the milestone.
S Thaman has scored a refreshing track with wonderful orchestration, while Sid Sriram gave life to it with his expressive singing. Ananta Sriram’s catchy lyrics deserve special mention. Mahesh Babu spellbound one and all with his stylish looks and graceful moves, Keerthy Suresh looked gorgeous in the number.
The film’s second single Penny is also set to break several records. The song that featured Sitara Ghttamaneni also went viral. Thaman has scored wonderful tunes for the film and the success of the first two songs hikes interest on the next songs of the movie.
The film is jointly being produced by Naveen Yerneni, Y. Ravi Shankar, Ram Achanta and Gopichand Achanta under Mythri Movie Makers, GMB Entertainment and 14 Reels Plus banners.
R Madhi handles the cinematography, while Marthand K Venkatesh is the editor and AS Prakash takes care of art department.
Sarkaaru Vaari Paata is coming as summer attraction on May 12th.
తెలుగులో ఫాస్టెస్ట్ 100 మిలియన్ల వ్యూస్ తో ట్రెండ్ సృష్టించిన `సర్కారు వారి పాట`లోని `కళావతి` సాంగ్
సరికొత్త రికార్డ్‌ను క్రియేట్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు `సర్కారు వారి పాట`లోని కళావతి సాంగ్
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం `సర్కారు వారి పాట`లోని `కళావతి` పాటలో ప్రేమ,
చక్కటి భావోద్వేగం కలిగివున్నాయి. అందుకే విడుదలైన కొద్దిసేపటికే అన్ని మ్యూజిక్ చార్టులలో అగ్రస్థానంలో నిలిచి శ్రోతల
హృదయాలను దోచుకుంటూనే ఉంది. ఈ బ్లాక్ బస్టర్ పాట ఇప్పటివరకు 1.7 మిలియన్ లైక్ లతో 100 మిలియన్ల వ్యూస్‌ను అధిగమించింది. ఫాస్టెస్ట్ గా మహేష్‌బాబు కెరీర్లోనే మైలురాయిని చేరుకున్న మొదటి సింగిల్‌గా నిలవడం విశేషం.
S థమన్ అద్భుతమైన ఆర్కెస్ట్రాతో చక్కటి ఫీల్‌ను కలిగించేలా బాణీలు సమకూర్చాడు. సిద్ శ్రీరామ్ తన మధురమైన గానంతో పాటకు ప్రాణం పోశాడు. అనంత శ్రీరామ్ ఆకట్టుకునే సాహిత్యం సమకూర్చారు. మహేష్ బాబు తన స్టైలిష్ లుక్స్, ఆకట్టుకునే హావభావాలతో అందరినీ ఆశ్చర్యపరిచారు, కీర్తి సురేష్ ఇందులో చాలా అందంగా కనిపించింది.
ఈ చిత్రం నుంచి వచ్చిన రెండవ సింగిల్ `పెన్నీ` కూడా అనేక రికార్డులను బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉంది. సితార ఘట్టమనేని
నటించిన ఈ పాట వైరల్‌గా మారింది. థమన్ ఈ చిత్రానికి అద్భుతమైన ట్యూన్స్ అందించారు. మొదటి రెండు పాటలు విజయం
సాధించడంతో సినిమా తదుపరి పాటలపై ఆసక్తి పెరిగింది.
మైత్రీ మూవీ మేకర్స్, GMB ఎంటర్టైన్మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట
సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఆర్ మధి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్‌గా, ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.
సర్కారు వారి పాట మే 12న వేసవి కానుకగా థియేటర్లలో సందడి చేయబోతోంది.