Kaliyouga pretelease event Photos
సామాన్య ప్రేక్షకులను ఆలోచింపజేసే చిత్రం కలియుగ. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సూర్య. డిసెంబర్ 6న కలియుగ గ్రాండ్ రిలీజ్ !!!
రాజ్, స్వాతి దీక్షిత్ జంటగా, తిరుపతి దర్శకత్వంలో.. బాలాజీ సిల్వర్ స్ర్కీన్ బ్యానర్‌పై, నటుడు సూర్య (పింగ్ పాంగ్) నిర్మించిన సినిమా ‘కలియుగ’. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. చిత్ర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
హీరో సూర్య మాట్లాడుతూ…
కలియుగ సినిమాలో యాక్షన్, లవ్, సెంటిమెంట్ అన్నీ ఉన్నాయి. నన్ను సపోర్ట్ చేస్తున్న రవీందర్ గారికి, శాస్త్రి గారికి థాంక్స్. అలాగే నన్ను వెనక ఉండి నడిపిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్ గారికి ధన్యవాదాలు. 24 శాఖల వారు నన్ను సపోర్ట్ చేశారు. సామాన్య ప్రేక్షకులను ఆలోచింపజేసే సినిమా కలియుగ. సినిమా మీ అందరికి నచ్చుతుందని, తప్పకుండా సినిమా థియేటర్ లో చూడమని తెలిపారు.
హీరో సత్యదేవ్ మాట్లాడుతూ…
ఈ సినిమాలో పనిచేసిన ప్రతివక్కరికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను. సమాజంలో జరుగుతున్న సంఘటనలు ఆధారంగా ఈ సినిమాను తీసిన సూర్యకు అభినందనలు. సూర్య భవిషత్తులో ఇలాంటి మరెన్నో సినిమాలు నిర్మించాలని కోరుకుంటున్న. మ్యూజిక్ డైరెక్టర్ సునిల్ కశ్యప్ మంచి పాటలు ఇచ్చాడు. డిసెంబర్ 6న విడుదల కానున్న ఈ సినిమాను మీరందరూ చూసి ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నానని తెలిపారు.
హీరో రాజ్ మాట్లాడుతూ..
ఈరోజు మా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చి మమ్మల్ని సపోర్టు చేస్తున్న మీ అందరికి థాంక్స్. సూర్య భవిషత్తులో ఇలాంటి సినిమాలు మరిన్ని చెయ్యాలి. విశ్వ, శాంతి బాగా నటించారు. డైరెక్టర్ గోపి గణేష్ గారి సహకారం మరువలేనిది. డైరెక్టర్ తిరుపతి గారు సినిమాను బాగా తీసాడు అన్నారు.
తాగుబోతు రమేష్ మాట్లాడుతూ…
సూర్య కథను నమ్మి ఈ సినిమా తీశాడు. కచ్చితంగా ఈ సినిమా పేరుతో పాటు మంచి డబ్బు తెచ్చిపెడుతోంది. అందరూ టెక్నీషియన్స్ , ఆర్టిస్ట్స్ కష్టబడి ఈ సినిమా చేశారు. మంచి సినిమాలు తప్పకుండా సక్సెస్ అవుతాయి. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను అన్నారు.
డైరెక్టర్ తిరుపతి మాట్లాడుతూ…
అందరికి నమస్కారం. రెగ్యులర్ కథలు పక్కన పెట్టి సమాజంలో జరుగుతున్న సంఘటనలు ఆధారంగా ఈ సినిమా కథ రాసుకున్నాను. సినిమా చూస్తున్నప్పుడు ఆడియన్స్ ఈ మూవీకి కనెక్ట్ అవుతారు. షూటింగ్ సమయంలో సూర్య సపోర్ట్ మరువలేనిది. మా చిత్ర సాంగ్ ను విడుదల చేసిన పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. మా చిత్రానికి పనిచేసిన అందరూ సాంకేతిక నిపుణులకు థాంక్స్. శశి, స్వాతి ఈ సినిమాలో బాగా నటించారన్నారు.