Kalyan Dasari Primeshow Entertainments Adhira
Rajamouli, NTR, Ram Charan Launched First Strike Of Prashanth Varma, Kalyan Dasari, Primeshow Entertainment’s Adhira
Creative genius Prashanth Varma is not making films with stars, but he is making superheroes. After introducing zombie concept to Tollywood, Prashanth Varma is making first Indian original superhero film Hanu-Man with Teja Sajja playing the titular role. The director is introducing another hero with another superhero film. Kalyan Dasari is making debut as hero with Prashanth Varma’s next directorial venture titled Adhira.
Inspired by Indian mythological characters, Prasanth Varma is creating a Universe of Superheroes like Marvel and DC. The film’s from Prasanth Varma Cinematic Universe will be unique in terms of scripts and story-telling. Adhira is another superhero film, where Kalyan will be seen in the titular role.
Ace director SS Rajamouli, young tiger NTR and mega power star Ram Charan have launched first strike of Adhira. The glimpse of Adhira will have huge reach with the three prominent faces taking part in the initial promotions.
Series of sequences are shown in the video to exhibit the superpowers of our original superhero. He has this special skill of generating electric energy since his childhood and he becomes stronger and valiant, as he grows up.
Like every other superhero, he is there to destroy bad evil and protect innocent. The visuals are on par with Hollywood standard and the last portions of Kalyan as Adhira generating electrical energy with his specially designed weapon are a feast for eyes. The weapon he is wielding is in backbone shape and it appears like Indra’s powerful weapon Vajrayudha.
‘Adhira First Strike’ strikes a chord with all sections and we can expect never seen before kind of action extravaganza in the movie. The first strike alone creates great impact and raises expectations on the movie.
Kalyan Dasari’s face is partially revealed and he looks apt in the role with well-built body, handsome looks and height. This is going to be a dream debut for the youngster.
K Niranjan Reddy will produce the movie on a high budget under Primeshow Entertainment, while Smt Chaitanya presents it. Screenplay for the film is by Scriptsville.
Gowrihari scores music for the film, while Dasaradhi Shivendra handles the camera. Both the technicians have done a commendable job, as the visuals and the BGM are in perfect synch.
Adhira will start rolling, after Prashanth Varma completes all the works related to Hanu-Man.
Cast : Kalyan Dasari
Technical Crew:
Writer & Director: Prasanth Varma
Producer: K Niranjan Reddy
Banner: Primeshow Entertainment
Presents: Smt Chaitanya
Screenplay: Scriptsville
DOP: Dasaradhi Shivendra
Music: Gowrihari
Executive Producer: Asrin Reddy
Line Producer: Venkat Kumar Jetty
Associate Producer: Kushal Reddy
Production Designer: Srinagendhra Tangala
PRO: Vamsi-Shekar
Costume Designer: Lanka Santhoshi
క్రియేటివ్ దర్శకుడి గా పేరుపొందిన ప్రశాంత్ వర్మ తను చేసే సినిమాల తో హీరోలను సూపర్ హీరోలను చేస్తున్నాడు. టాలీవుడ్ కి జాంబి కాన్సెప్ట్‌ని పరిచయం చేసిన తర్వాత, ప్రశాంత్ వర్మ పాన్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో సినిమా `హను-మాన్`ని రూపొందిస్తున్నారు. ఇందులో తేజ సజ్జ టైటిల్ రోల్ ప్లే చేస్తున్నాడు. కాగా, మరో హీరోని పరిచయం చేస్తూ మరో సూపర్ హీరో ఫిలిం చేయబోతున్నాడు ప్రశాంత్ వర్మ. ఈ చిత్రం ద్వారా కళ్యాణ్ దాసరి హీరోగా పరిచయం అవుతున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి `అధీర` అనే టైటిల్ నిర్ణయించారు.
భారతీయ పౌరాణిక పాత్రల నుండి ప్రేరణ పొందిన ప్రశాంత్ వర్మ, మార్వెల్, DC వంటి సూపర్ హీరోలను క్రియేట్ చేస్తున్నాడు. సినిమాటిక్ యూనివర్స్ నుండి ప్రశాంత్ వర్మ సృష్టిస్తున్న ఈ చిత్రం స్క్రిప్ట్, కథను చెప్పే విధానం ప్రత్యేకంగా వుండబోతోంది. కళ్యాణ్ టైటిల్ రోల్లో కనిపించనున్న ఈ సూపర్ హీరో చిత్రం అధీర ఎంతో ప్రత్యేకతను సంతరించుకోనుంది.
గ్రాండ్ గా ఉండేలా డిజైన్ చేసిన `అధీర` పోస్టర్‌ను ఆర్.ఆర్.ఆర్. త్రయం అయిన ప్రముఖ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సంయుక్తంగా విడుదల చేసి అధీర టీం కి తమ బెస్ట్ విషెస్ తెలియజేసారు. దాంతో అధీర నుంచి వచ్చిన ఫస్ట్ స్ట్రైక్ ప్రారంభంలోనే భారీ స్థాయిలో క్రేజ్‌ను సంపాదించుకుంది.
ఫస్ట్ స్ట్రైక్ చూస్తుంటే, చిన్నప్పటి నుంచీ అధీరకు పవర్స్ వున్నాయనే ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేస్తూ సన్నివేశాలతో ఆకట్టుకుంది. విజువల్స్ గ్రాండియర్‌గా వున్నాయి. బ్యాక్ గ్రౌండ్ సంగీతం మరోస్థాయిలో వుంది. వీటిని చూస్తే ప్రశాంత్ వర్మ కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేయబోతున్నాడని స్పష్టమవుతోంది.
విజువల్స్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి. ప్రత్యేకంగా రూపొందించిన ఆయుధంతో ఎనర్జీ లెవెల్ పెంచేలా వీడియోలో అధీరగా కళ్యాణ్ కనిపించాడు. తన చేతిలో వున్న ఆయుధం వెన్నెముక ఆకారంలో ఉండి, ఇంద్రుడి శక్తివంతమైన ఆయుధం వజ్రాయుధం ను పోలివుంది.
‘అధీర ఫస్ట్ స్ట్రైక్’ అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఇంతకు ముందెన్నడూ చూడని యాక్షన్ సీక్వెన్స్ హైలైట్ గా వుండబోతున్నాయి. ‘అధీర ఫస్ట్ స్ట్రైక్’ ఇప్పటికే సినిమాపై అంచనాలను పెంచుతుంది.
కళ్యాణ్ దాసరి ఫేస్ పాక్షికంగా రివీల్ చేయబడింది. అందమైన లుక్ తో, తగినంత ఎత్తుతో పాత్రలో ఒదిగిపోయాడు.
శ్రీమతి చైతన్య సమర్పణ లో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే- స్క్రిప్ట్స్విల్లే.
ఈ చిత్రానికి గౌరీహరి సంగీతం అందిస్తుండగా, దాశరధి శివేంద్ర కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. విజువల్స్, బిజి.ఎం. పర్ఫెక్ట్ సింక్‌లో వున్న సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు.
హను-మాన్‌కి సంబంధించిన అన్ని పనులను ప్రశాంత్ వర్మ పూర్తి చేసిన తర్వాత ` అధీర `కు సంబంధించిన వివరాలు తెలియజేయనున్నారు.
తారాగణం : కళ్యాణ్ దాసరి
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: ప్రశాంత్ వర్మ
నిర్మాత: కె నిరంజన్ రెడ్డి
బ్యానర్: ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్
సమర్పకులు: శ్రీమతి చైతన్య
స్క్రీన్‌ప్లే: స్క్రిప్ట్స్విల్లే
DOP: దాశరధి శివేంద్ర
సంగీతం: గౌరిహరి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అస్రిన్ రెడ్డి
లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి
అసోసియేట్ ప్రొడ్యూసర్: కుశాల్ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగాల
PRO: వంశీ-శేఖర్
కాస్ట్యూమ్ డిజైనర్: లంకా సంతోషి